Subscribe for notification

Intinti Gruhalakshmi: ఈ ఒక్క ఐడియాతో అభి మనసులో లాస్య ప్లేస్ కన్ఫర్మ్.. తులసి పాతాళానికి.. మరి అంకిత.!?

Share

Intinti Gruhalakshmi: అభి దగ్గరకి వెళ్లిన తులసి అభిని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుంది.. నీకు వచ్చే ఆస్తి నీది కాదు మీ అత్తయ్య వాళ్ళు చాలా బరువు బాధ్యతలతో నీకు ఇస్తున్నారు.. ఒక్కసారి నువ్వు తప్పటడుగు వేస్తే మళ్లీ పాతాళానికి పడిపోతావు.. మీ నాన్న వాళ్ళని నమ్మద్దు చాలా జాగ్రత్తగా ఉండమని సలహా ఇస్తుంది తులసి.. అభి తో తులసి మాట్లాడిన విషయం భాగ్య నందు వాళ్లకు వెళ్లి చెబుతుంది. మీరు ఇక్కడ ఆనందంతో డాన్స్ లు వేస్తున్నారు. అక్కడ తులసి అభిని కంట్రోల్లో పెట్టడానికి మీకు దూరంగా ఉండమని హితబోధ చేసింది అని చెబుతుంది భాగ్య. తన మాటలు విన్న నందు, లాస్య తులసి పై గొడవకు బయలుదేరుతారు..

Intinti Gruhalakshmi: Serial 6 June 2022 Today Episode Highlights

కడుపు మంట నందు మనల్ని చూసి అని లాస్య అంటుంది తులసిని చూస్తూ.. నాటకాలు ఆడకు తులసి మీకు నాటకాలు ఇష్టం లేదా నాకు అసహ్యం అని అంటాడు నందు మరి లాస్య నాటకం చూసి అంత మురిసిపోయారు అని అంటుంది తులసి.. కట్టుకున్న దాన్ని వదిలేసి తన మెడలో తాళి కట్టారు కదా.. ఒక్కసారిగా నాటకాలు అంటే ఇప్పుడు అంత అసహ్యం వచ్చిందా.. నీ అతి తెలివి నా దగ్గర కాదు తులసి అని నందు అంటుండగా.. వాళ్ళ అమ్మ నాన్న వస్తారు అసలు ఏమైంది అని అడుగుతారు.. మీకు నా అరుపులే వినిపిస్తాయి కాని తులసి చేసే పనులు కనిపించవా అమ్మ అని నందు అంటాడు.. జీవితంలో తులసి చేసిన తప్పు ఒకటేరా నిన్ను నమ్మి ప్రేమించి పెళ్లి చేసుకోవడమే.. ఎలాగూ వా తప్పుకు శిక్ష అనుభవిస్తోంది కదా ఇంకేంటి మీ సమస్య అని వాళ్ళని అడుగుతుంది..

Intinti Gruhalakshmi: Serial 6 June 2022 Today Episode Highlights

నిన్ను గౌరవిస్తున్నారని ఇంట్లో ప్రతి ఒక్కరిని గుప్పిట్లో పెట్టుకొని ఆటాడుకుందాం అని అనుకుంటున్నావా.. నా పిల్లల్ని నాకు దూరం చేద్దాం అనుకుంటున్నావా.. అసలు నీ ప్రాబ్లం ఏంటి నందు అని వాళ్ళ నాన్న అడుగుతాడు.. అభి నాతో ఉంటే నా మాట వింటే చెడిపోతారా.. ఖచ్చితంగా చెడిపోతాడు అని పరంధామయ్య అంటాడు.. తులసి ప్రేమ ఏమో నిస్వార్ధమైనది. నా ప్రేమో స్వార్థంతో కూడుకున్నది ఏంన్యాయం నాన్న ఇది అని నందు వాళ్ళ నాన్న ను అడుగుతాడు.. నువ్వు ఎలాగో మా మాట వినవు. కనీసం మనవడు అదుపులో పెట్టుకోవాలి కదా అని అనసూయమ్మ అంటుంది. నా పిల్లల్ని నాకు దూరం కాకుండా చేస్తే తులసిపై కేసు పెడతాను అని నందు అంటాడు. పెట్టాలి అనుకొన్నప్పుడు ఇక్కడికి ఎందుకు రావడం.. అక్కడికి వెళ్లి కేసు పెట్టుకోవచ్చు కదా అని తులసి అంటుంది.. మీరు చేయాల్సింది మీరు చెయ్యండి నందగోపాల్ గారు. నేను చేయాల్సింది నేను చేస్తాను అని తులసి అంటుంది. నా గురించి మీరు చెప్పాల్సింది మీరు చెప్పుకోండి నేను మీ మీద చెప్పాల్సింది నేను చెబుతాను ఇక నిర్ణయం అభిది..

Intinti Gruhalakshmi: Serial 6 June 2022 Today Episode Highlights

దివ్య అంకిత ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ నాన్న వాళ్ళు గొడవ చేసిన విషయం మొత్తం చెబుతుంది. అసలు అభి అన్నయ్య ఏం చేస్తున్నాడో నువ్వు తెలుసుకోపోతే ఎలా వదిన అని అంటుంది. అసలు ఆ రోజు పార్టీ లో ఏం జరిగిందో నీకు తెలుసా.. అమ్మ నిన్ను దూరం పెట్టడానికి కారణం తెలుసా.. నీకు ఆస్తి వస్తుందని అన్నయ్య వాళ్ళు అమ్మను దూరం పెట్టాలనుకున్నారు.. అందుకే అమ్మ నిన్ను ఇంటికి రావద్దు అని చెప్పింది. నువ్వు అన్నయ్య ను చాలా జాగ్రత్తగా చూసుకో వదిన అని అంటుంది దివ్య. అంకిత వాళ్ళ అమ్మతో గొడవ పడుతుంది. రేపు ఆస్తి నాకు వస్తే ఆ ఆస్తిని తులసి ఆంటీ పేరుమీద రాస్తాను అని అంటుంది అంకిత. లాస్య వెంటనే ఆ ఆస్తి అభి పేరు మీద రాయండి అని గాయత్రి కి సలహా ఇస్తుంది. అభి లాస్యను పొగడ్తలతో ముంచెత్తాడు. మీరు నాపై నమ్మకం ఉంచారు ఆంటీ. మీరు మా అమ్మ స్థానంలో నిలబడి నన్ను గుర్తించారు. థాంక్యూ ఆంటీ అని అంటాడు అభి.


Share
bharani jella

Recent Posts

pushpa 2: `పుష్ప 2`లో న‌టించాల‌నుందా..? అయితే ఇదిగో బిగ్ ఆఫ‌ర్‌!

pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న పాన్…

13 seconds ago

Hero Yash: పాన్ ఇండియా నిర్మాతల వేటలో హీరో యశ్

Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…

30 mins ago

Pakka Commercial: `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌` ఓటీటీ రైట్స్ ధ‌రెంతో తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ మారుతి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`.…

1 hour ago

Sudigali Sudheer : సుధీర్‌పై నాగబాబు సెటైర్లు.. మళ్లీ ఒకే చోట చేరిన గ్యాంగ్..

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…

2 hours ago

Rashmika: కెరీర్‌లో పెద్ద టర్నింగ్‌ పాయింట్ ఆ సినిమానే అంటున్న ర‌ష్మిక‌!

Rashmika: నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఛ‌లో`తో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి అన‌తి…

2 hours ago

Pears: తప్పనిసరిగా తినాల్సిన పండు ఇది..!

Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…

2 hours ago