24.2 C
Hyderabad
February 5, 2023
NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: కోడలిగా లాస్యను పరంధామయ్య ఒప్పుకున్నా.. భార్యగా నందు వద్దనుకుంటున్నాడు. తులసి నిర్ణయం ఏంటంటే.!? 

Intinti Gruhalakshmi 24 September 2022 Today Episode Highlights
Share

Intinti Gruhalakshmi: భాగ్య ఇచ్చిన ఐడియా ప్రకారం లాస్య పరంధామయ్య అనసూయమ్మ దగ్గరకు వస్తుంది. నన్ను క్షమించండి అని అంటుంది. చచ్చిన పామును ఇంకా చంపకండి మావయ్య.. ఈ ఇల్లు నా పేరు మీద రాయించుకున్నానని అందరూ నా మీద కోపంగా ఉన్నారు. ఈ క్షణం నుంచి నేను దీని మీద ఉన్న పూర్తి హక్కులను వదులుకుంటున్నను మావయ్య.. మీరు ఎవరి పేరు మీద రాయమంటే వాళ్ళ పేరు మీద రాస్తాను. ఇది మీ కష్టార్జితం మావయ్య అని లాస్య కన్నీళ్లు పెట్టుకుంటుంది.

Karthika Deepam Highlights: కార్తీక దీపం సీరియల్ ఈ వారం హై లెట్స్ మీకోసం!

Intinti Gruhalakshmi Serial 7 December 2022 today 809 episode Highlights
Intinti Gruhalakshmi Serial 7 December 2022 today 809 episode Highlights

ఈ ఆస్తి మీద ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తో ఈ పని చేశాను మావయ్య. ఈ ఇంట్లో దేని మీద నాకు ఆశ లేదు. నందు కూడా నన్ను సీరియస్ గా తీసుకోలేదు. అందుకే ఇలా చేశాను.. మీకు ఎప్పటికీ నా మీద కోపంగా ఉంటే చెప్పండి అని పక్కనే ఉన్న కత్తి తీసుకొని చెయ్యి కోసుకుని చచ్చిపోతాను అని అంటుంది‌ మీ అందరి ముందు ఇలా అవమానంగా బ్రతికే కంటే ఒకేసారి చచ్చిపోవటం నాకు హాయిగా ఉంటుంది అని లాస్య ప్రాణ త్యాగం చేయాలని అనుకుంటుంది. నీ మీద మాకు కోపం ఉన్నమాట వాస్తవమే. ఎందుకంటే నువ్వు తులసి విషయంలో చేయకూడని తప్పు చేశావు. అలా అని నిన్ను క్షమించకుండా ఇప్పుడు ఉండలేను. నువ్వు చనిపోతుంటే చూస్తూ ఊరుకోలేం అని పరంధామయ్య అంటాడు. ఇక అంకిత శృతి దివ్య వచ్చి నువ్వు గెలిచామని సంబరపడిపోకు.. తాతయ్య గెలిచాడు. ఆయన మంచిదనం గెలిచింది అని అంటారు. ప్రేమ్ మాత్రం లాస్య వంకర బుద్ధి తెలుసు కాబట్టి తనని క్షమించద్దని చెబుతాడు. ఈసారికి పోనీలే అని అందరూ వదిలేస్తారు.

Intinti Gruhalakshmi: తులసికి సామ్రాట్ స్వీట్ మెమోరీ.. అంతా కలిసిపోయి లాస్య ఓ ఆట ఆడుకున్నారు.!

సామ్రాట్ తులసి ఇద్దరూ ఆ రోజు షాపింగ్ ముగించుకొని ఇంటికి రావడానికి రోడ్డుమీద నడుస్తూ ఉంటారు. ఏంటండీ ఇల్లు ఇంకా ఎంత దూరం ఉంది అని సామ్రాట్ అంటాడు. ఇంకాస్త దూరం వెళ్ళాలి అని తులసి అంటుంది. ఇక ఇంటికి రాగానే సామ్రాట్ గారూ మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. మీరే గ్రేట్ అని తులసి అంటుంది. లేదు తులసి గారు మధ్యతరగతి ఆడవాళ్ళందరూ గ్రేట్.. వాళ్లకి జోహార్లు అని సామ్రాట్ సవినయంగా ఆడవాళ్ళు గ్రేట్ అని ఒప్పుకుంటాడు. వాళ్లు చేసే బాధ్యతకి మగవాడి సంపాదన కంటే ఎక్కువే అని సామ్రాట్ ఆడవాళ్ళని అందర్నీ పొగుడుతాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే త్రిశంకు స్వర్గం అని తులసి అంటుంది.

Intinti Gruhalakshmi: ఇంటింటి గృహలక్ష్మి రేపటి దిమ్మతిరిపోయే ట్విస్ట్..! 

తులసి షాపు ముగిసాక సామ్రాట్ కి బాయ్ చెప్పి తన అత్తింటికి వస్తుంది. తన ఇంట్లోకి వచ్చేసరికి ఎవ్వరూ కనిపించరు అందరూ ఎక్కడున్నారు అని వెతుకుతుంది. అప్పుడే దివ్య తులసిని చూసి అమ్మ అని పిలుస్తుంది అందరూ వస్తారు. ఇక ప్రేమగా ఆప్యాయంగా అందరినీ తులసి హత్తుకుంటుంది. ఇంట్లో అందరికీ కావలసిన వస్తువులన్నింటినీ తులసి తీసుకువచ్చి ఇస్తుంది. నువ్వు ఇంట్లో ఉన్నా లేకపోయినా నీ బాధ్యతలు నిర్వర్తించడం మర్చిపోవడం లేదుగా అని అభి అంటాడు . నేను మీకు దూరంగా ఉన్నా దగ్గర ఉన్నట్టే అని తులసి అంటుంది ఇక అప్పుడే నందు లాస్య కోప్పడడం తులసి వింటుంది. నందు లాస్యను వద్దనుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుండగా.. తులసి ఎలా రియాక్ట్ అవుతుందో తరువాయి భాగంలో చూద్దాం.


Share

Related posts

ప్ర‌ముఖ ఓటీటీకి `గాడ్ ఫాద‌ర్‌`.. భారీ ధ‌ర‌కు డీల్ క్లోజ్‌!?

kavya N

ఫైన‌ల్‌గా పెళ్లికి అనుష్క గ్రీన్‌సిగ్న‌ల్‌.. భ‌ర్త‌గా వ‌స్తున్న‌ `బంగారం` లాంటి అబ్బాయి!?

kavya N

వామ్మో.. డ్యాన్స్ షోకు గెస్ట్ గా వ‌చ్చినందుకే మ‌హేశ్ అన్ని కోట్లు పుచ్చుకున్నాడా?

kavya N