Intinti Gruhalakshmi Today Episode డిసెంబర్ 9: మీరిద్దరూ విడిపోవడం కరెక్ట్ కాదు. అది మీకే కాదు మీ కుటుంబానికి కూడా మంచిది కాదు. అసలు మీకు ఎలాంటి భార్య కావాలో మీకు స్పష్టత లేనట్టుంది అని తులసి అంటుంది. నా విషయంలో చదువు లేదని నన్ను కాదనుకున్నారు. ఇప్పుడు లాస్య మీ అంచనాలుగు అనుగుణంగా ఉంది. కానీ తనని కూడా ఇప్పుడు మీరు వద్దనుకుంటున్నారు. మీ నిర్ణయాలు ఏంటో మీకైనా అర్థమవుతుందా అని తులసి నందుని ప్రశ్నిస్తుంది. మీ ఇద్దరి మధ్య ప్రేమ బంధం ఉంది. కాబట్టి ఇద్దరూ అడ్జస్ట్ అయ్యి ఉండటం మంచిది అని తులసి సలహా ఇస్తుంది. సరే అని నందు తల ఊపుతాడు. తులసి మీ ఆరోగ్యం జాగ్రత్త అని నందు అనగానే.. తులసి ముఖంలో ఏదో తెలియని ఆనందం సంతోషం రెండు స్పష్టంగా కనిపిస్తాయి..
తులసి ఇంటికి వెళ్లాక కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది.అప్పుడే తను ఏం చేయాలో అని అనుకుంటుండగా తను కోర్కెల లిస్ట్ రాసుకున్న పేపర్ కనిపిస్తుంది. అందులో తను కోరుకున్నట్లుగా విమానం ఎక్కాలని సముద్రపు ఒడ్డున ఆడుకోవాలని కోరికలు సామ్రాట్ వలన తీరాయని మనసులో అనుకుంటుంది. ఇక సొంతంగా తన కాళ్ళ మీద ఎదగాలన్న కోరిక కూడా తీరడంతో పాటు ఇంట్లో వాళ్లందర్నీ నేనే పోషిస్తున్నాను అని తులసి తనని తాను చూసుకొని గర్వపడుతుంది. లాస్య తులసి చెప్పిన సలహాలను పాటించాలి అని అనుకుంటుంది. నందు అంతలోకి తన గదిలోకి వస్తాడు.
ఇక రేపటి ఎపిసోడ్ లో సామ్రాట్ తులసి ఇద్దరూ గుడికి వెళ్తారు. గుడిలో ఇద్దరు కలిసి ముడుపులు కడుతూ ఉంటారు. మీ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయండి తులసి గారు అని సామ్రాట్ అంటాడు. సరే అని నవ్వుతూ తులసి సామ్రాట్ ఇద్దరు చెట్టుకి ముడుపులు కడతారు. తులసి గారు మీరు ఏం కోరిక కోరుకున్నారు అని సమ్రాట్ అడుగుతాడు. కోరిక ఏంటి అనేది చెప్పకూడదని అది నెరవేరాక అందరికీ తెలుస్తుంది అని తులసి ఉంటుంది. సామ్రాట్ మనసు ఉండబట్టలేక తులసి చెట్టుకు కట్టిన ముడుపును విప్పతీసి అందులో ఏం రాసిందో చూడాలని అనుకుంటాడు. అంతలో తులసి వచ్చి సామ్రాట్ వెనక నుంచున్నట్లుగా ఉంటుంది. ఇక ఏం జరుగుతుందో తరువాయి భాగంలో చూద్దాం.