ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ బుల్లి తెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది.. కార్తీక దీపం వంటలక్క దీప అంతటి క్రేజ్ ను తులసి సంపాదించుకుంది.. ఈ సీరియల్ కేవలం తులసి కోసమే చూసే వారి సంఖ్య ఎక్కువ అంటే అతిశయోక్తి కాదు.. తులసి తన నటనతో ప్రేక్షకులను టీవీ ల నుంచి కడలనివ్వకుండా చేస్తుంది.. తాజాగా విడుదలైన స్టార్ మా టి ఆర్ పి రేటింగ్స్ లో ఇంటింటి గృహలక్ష్మి 10 రేటింగ్ ను సొంతం చేసుకొని మూడవ స్థానంలో నిలిచింది.. గత వారంలో కూడా ఇదే ప్లేస్ సాధించుకొని ఈ వారం తన స్థానాన్ని పదిలం చేసుకుంది.. ఇంటింటికి గృహలక్ష్మి ఈవారం జరిగిన హైలెట్స్ తో పాటు వచ్చేవారం ఊహించని ట్విస్ట్ ఏమిటంటే.!?
ప్రేమ్ ఇంట్లోనే ఉంటే అమ్మ మీద ప్రేమతో తన లక్ష్యాన్ని మరిచిపోతున్నాడని ప్రేమని కావాలని.. తులసి దూరం పెట్టడానికి ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తుంది. తులసి గొప్ప సింగర్ గా ఎదిగిన తర్వాత మళ్లీ తనను ఇంటికి పిలవాలి అని అనుకుంటుంది.. కానీ ప్రేమ్ తన లక్ష్యసాధనలో అమ్మ ప్రేమకు దూరమవుతున్నానన్న బాధలో లక్ష్యాన్ని చేరుకోలేకపోతాడు.. తన బాధ ను అర్థం చేసుకున్న తులసి.. ప్రేమ్ కు కావలసినంత మనో ధైర్యాన్ని అందించి.. సింగింగ్ కాంపిటీషన్లో పాల్గొనే లాగా చేస్తుంది. ప్రేమ్ ఈ కాంపిటీషన్లో ఓడిపోవడానికి లాస్య తనదైన స్టైల్ లో కుట్ర పండుతుంది.. లాస్య కుట్రను తులసి తెలివిగా తిప్పి కొడుతుంది.. తను తీసుకున్న గోతిలో తానే పడేలా చేస్తుంది.. మీకు ముందుగానే చెప్పాను కదా లస్య నేను ఇదివరకటి తులసీను కాదని.. నేను చాలా మారిపోయానని చెప్పాను కదా.. నా జోలికి రావద్దు అంటే వస్తున్నావు.. అందుకే నీకు బుద్ధి చెప్పడానికి నువ్వు వేసిన ప్లాన్ నీకే తిప్పి కొట్టాను అని చెబుతుంది.. నా జోలికి వస్తే సహిస్తానేమో కానీ నా పిల్లలు జోలికి వస్తే మాత్రం ఊరుకోనని తులసి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది..
కుక్క తోక వంకర అన్నట్టు.. లాస్య బుద్ధి కూడా వంకరే.. భాగ్యతో కలిసి ప్రేమ్ ఓడిపోవడానికి కాంపిటీషన్ కి వచ్చిన ఆడియన్స్ అందర్నీ ప్రేమ్ ని గెలిపించవద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తుంది.. మొత్తానికి ప్రేమ సెకండ్ రౌండ్ లో ప్రేమ్ తన పర్ఫామెన్స్ ఇస్తాడు.n ఒక్క ఓటు తేడాతో ఎవరు గెలుస్తారో అంటూ సస్పెన్షన్ క్రియేట్ చేస్తూ నిన్నటితో ఎపిసోడ్ ముగుస్తుంది.. లాస్య ఎన్ని కుట్రలు పన్నినా కూడా చివరికి విజయం మాత్రం తులసినే వరిస్తుంది.. ప్రేమ్ ఈ సింగింగ్ కాంపిటీషన్లో గెలుస్తాడు.. లాస్య అవమానంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.. ప్రేమ్ ఆల్బమ్ కి కావలసిన మనీని తనే సంపాదించుకుంటాడు.. మొత్తానికి కథ మలుపు తిరుగుతోంది.
ప్రేమ్ ను తులసి తనతో పాటు ఇంటికి తీసుకు వెళ్దాం అని అనుకుంటుంది.. కానీ ప్రేమ్ మాత్రం ఆల్బమ్ చేశాక వస్తాను అంటాడు.. అప్పుడే అభి వచ్చి అంకిత ను నాకు కాకుండా చేశావ్.. నువ్వు మాత్రం ప్రేమ్ తో సంతోషంగా ఉంటావా అంటూ గొడవకు దిగుతాడు.. ఇంతలో లాస్య ఆభిని రెచ్చ గొడుతుంది.. మళ్ళీ కొత్త ప్రోబ్లం క్రియేట్ చేసింది..
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!