Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారం అవుతున్న సీరియల్స్ లో ఇంటింటి గృహలక్ష్మి కూడా ఒకటి.. కార్తీకదీపం కు గట్టి పోటీ ఇస్తూ ఇంటింటి గృహలక్ష్మి టిఆర్పి రేటింగ్స్ లో.. తాజాగా విడుదలైన స్టార్ మా మా టీవీ సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ లో ఇంటింటికి గృహలక్ష్మి నాలుగో స్థానానికి పడిపోయింది.. గతవారం థర్డ్ ప్లేస్ లో ఉన్న ఈ సీరియల్ ఈ వారం మళ్ళీ కిందకు పడిపోయింది.. అంతకు ముందు వరుసగా మూడు వారాల పాటు రెండవ స్థానంలో నిలిచి కార్తీక దీపం సీరియల్ కు టఫ్ గా ఉంది.. ఇక ఈ వారం నాల్గవ స్థానం పడిపోవడానికి కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..!
అంకితకు వచ్చిన ఆస్తిని అభి పేరుమీద ట్రాన్స్ఫర్ చేయాలి అని అనుకుంటారు లాస్య గాయత్రీ. ఇదే బెస్ట్ ఛాన్స్ అని లాస్య అడ్వాంటేజ్ తీసుకుని అభి ను అడ్డం పెట్టుకుని.. తన ద్వారా నందు బిజినెస్ కి కావాల్సిన డబ్బులు తన ద్వారా తీసుకోవాలి అని అనుకుంటారు.. ఆ ప్లాన్ వర్క్ అవుట్ అవ్వదు. ఇక సీరియల్ కాస్త సాగదీయడానికి అందరూ విడివిడిగా మాల్ కి వెళ్లడం.. ఆ మాల్ లో కాశ్మీర్ ట్రిప్ అంటూ ఒక ట్రావెల్ ఏజెంట్ వాళ్ళని అటాచ్ చేయడం.. తులసి ఫ్యామిలీ వాళ్ళకి ఆ కాశ్మీర్ ట్రిప్ కి సెలెక్ట్ అవ్వడం ఇదంతా చూసిన ఆడియెన్స్ కి కాస్త బోరింగ్ గా అనిపించడం తో సీరియల్ రేటింగ్ పడిపోయింది..
ఇక ఈ వారం ట్విస్ట్ కూడా అంత క్రిస్పీగా కూడా లేదు. తులసి వాళ్ళ ఇంటికి అంకిత వస్తుంది. గాయత్రి వాళ్ళ తో గొడవపడి.. ఆస్తి కోసం లాస్య గాయత్రి ని రెచ్చగొడుతుంది.. మొత్తానికి వాళ్లంతా కలిసి తులసి వాళ్ళ ఇంటికి గొడవకు దిగుతారు.. తులసి బెస్ట్ అత్త అవార్డ్ యాక్టింగ్ లో ఒక బొంగు కర్ర ను తీసుకువచ్చి వాళ్ళ ముందు వేసి ఈ తులసి రేఖను దాటి వస్తె కురుక్షేత్రమే అని వార్నింగ్ ఇస్తుంది.. ఇక తులసి చేసే గొడవ లో ఏదైనా ట్విస్ట్ జరిగితే కానీ వచ్చే వారం ఈ సీరియల్ రేటింగ్ హైక్ అవ్వదు. లేదంటే ఇక అంతే.