Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారం అవుతున్న సీరియల్స్ లో ఇంటింటి గృహలక్ష్మి కూడా ఒకటి.. ఈ సీరియల్ కార్తీకదీపం సీరియల్ కు గట్టిపోటీని ఇస్తూ టిఆర్పి రేటింగ్ లో రెండో స్థానంలో నిలుస్తూ వస్తుంది.. గత కొన్ని వారాలుగా సెకండ్ ప్లేస్ లో ఉన్న ఈ సీరియల్ ఈ వారం మూడవ స్థానానికి పడిపోయింది.. ఇంటింటి గృహలక్ష్మి ఈ వారం 9.39 రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ కు మెయిన్ అడ్వాంటేజ్ తులసి పాత్రే..! ఈ వారం సీరియల్ కాస్త చప్ప చప్పగా సాగడం.. తులసి పాత్ర కాస్త డల్ అవ్వడం ప్రేక్షకులకు ఒకింత నిరాశను కలిగించినట్టు ఉన్నాయి.. అందుకే ఈ సీరియల్ రేటింగ్ పడిపోయింది..!
అంకిత కు వచ్చే ఆస్తిని లాస్య క్యాష్ చేసుకోవాలనుకుంది. నందు లాస్య ఇద్దరు స్టార్ట్ చేసే కొత్త కంపెనీకి ఈ ఆస్తి నుంచి పెట్టుబడి తీసుకుని కొత్త కంపెనీ స్టార్ట్ చేయాలి అని అనుకుంటారు. లాస్య ఐడియా ప్రకారం నందు బుట్టలో వేసుకుంటాడు. లాస్య వంకరబుద్ధి తెలుసుకున్న తులసి వాళ్ళ ప్లాన్ అంకిత దగ్గర వర్కౌట్ కాకుండా జాగ్రత్త పడుతోంది. అభి నీ వాళ్ళ నాన్న వాళ్ళ తో జాగ్రత్తగా ఉండమని హితబోధ చేస్తుంది. గాయత్రి, లాస్య కలిసి ఆ ఆస్తిని పేరు మీద ట్రాన్స్ఫర్ చేయాలి అని అనుకుంటారు..
అంకిత వాళ్ళ నాన్న ఆస్తిని తన కూతురు పేరు మీద రాశి గాయత్రి ఇద్దరికీ షాక్ ఇస్తాడు ఐడియా ఎవరికీ అంటే తులసి అని చెబుతాడు దాంతో ఆస్తి వి కాదు నన్ను చాతగాని వాడిగా లెక్క కట్టినందుకు నీమీద నాకు చాలా కోపంగా ఉంది. ఇక నేను మీ ఇంటి గుమ్మం తొక్క నువ్వు అని అంటాడు అభి.
తులసి మంచి మనసు తెలుసుకున్న అంకిత మరోసారి మిమ్మల్ని అపార్థం చేసుకున్న ఆంటీ నన్ను క్షమించమని వేడుకుంటుంది. తులసి తన మంచి మనసుతో అంకితను క్షమిస్తుంది కనీసం నువ్వైనా అర్ధం చేసుకున్నావు అని ఆనందపడుతుంది. ఇక వాళ్ళిద్దరూ కలిసి నడుచుకుంటూ వెళ్తుండగా శృతి ఒక ఇంటిలో నుంచి వచ్చే వస్తుంది. పని మనిషి గా మారిన శృతి ని చూసి తులసి నేనే తప్పు చేశాను అని ఒప్పుకుంటుంది. తులసి ఏ విధంగా ప్రేమ జీవితాన్ని బాగు చేస్తుందో చూడాలి.