Categories: Telugu TV Serials

Karthika Deepam: నిరూపమ్ ముందే జ్వాలను కొట్టిన స్వప్న..!!

Share

Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.గత ఎపిసోడ్‌లో జ్వాల పేపర్స్, ఫొటోస్ అన్ని చించి పడేసి ఇంటి నుండి వేసి తినకుండానే నిద్రపోతుంది. జ్వాలని చూడటానికి వచ్చిన సౌందర్య.. వాటన్నిటినీ తీసి ఇల్లంతా శుభ్రంగా తుడిచి,ఇంటి ముందు ముగ్గులు వేస్తుంది. జ్వాల లేచి సౌందర్యను చూసి షాక్ అవుతుంది.‘ఏంటి సీసీ ఇదంతా.. నువ్వు ఇలాంటి పనులు చేయడం ఏంటీ.. నీకు రుణపడిపోతున్నా’ అంటుంది జ్వాల. అప్పుడే జ్వాలకు సౌందర్య ఒక కవర్ తెచ్చి చేతిలో పెడుతుంది. అది ఓపెన్ చేసి చూసిన జ్వాల.. షాక్ అవుతుంది. ఈ క్రమంలోనే ఆ లెటర్ లో ఏముంది అనే ఆసక్తి అందరిలో మొదలయింది.

సౌందర్య ఇచ్చిన లెటర్ లో ఏముంది :

జ్వాల ఓపెన్ చేసి చూసింది లేఖ కాదు దానిలో నిరుపమ్ బొమ్మ ఉంటుంది.సౌందర్య రాకముందు హిమ మీద కోపంతో.. హిమ ఫొటోస్‌తో పాటు నిరుపమ్ బొమ్మని కూడా రెండు ముక్కలుగా చించి పడేస్తుంది జ్వాల. మళ్ళీ సౌందర్య అన్నిటిని అతికించి జ్వాలకు ఇస్తుంది. ‘నా కోపం డాక్టర్ సాబ్ మీద కాదు సీసీ.. ఆ తింగరి మీద అని ఇంకాస్త ఫైర్ అవుతుంది.ఇక సౌందర్య టాపిక్ ని డైవర్ట్ చేస్తూ ‘రౌడీ సాయంత్రం ఎక్కడికైనా వెళ్తావా?’ అంటుంది‘లేదు సీసీ ఇక్కడే ఉంటాను అంటే అయితే ఈవెనింగ్ మీ యంగ్ మెన్(ఆనందరావు)ని తీసుకొస్తాను.. సరేనా’ అంటుంది. ‘సరే’ అంటుంది జ్వాల.

శోభను కొట్టిన హిమ :

ఇక సీన్ కట్ చేస్తే హిమ శోభని లాగిపెట్టి కొట్టి.. గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. తీరా చూస్తే అదంతా శోభ కల. కలలోంచి బయటికి వస్తూ ఉలిక్కిపడుతుంది.ఇక నిరుపమ్, స్వప్నలు పెళ్లి శుభలేఖ హిమ వాళ్లకి ఇచ్చి.. ఇంటికి వచ్చేసరికి జ్వాల ఆటో ఇంటి ముందు ఉంటుంది.ఆటో ఏంటే ఇంటి ముందు పెట్టావ్ అంటూ జ్వాలను నానా మాటలు అంటుంది స్వప్న.జ్వాల కళ్లనిండా నీళ్లతో నిరుపమ్‌నే చూస్తూ ఆటో తాళాలు నిరూపమ్ చేతిలో పెడుతుంది.

జ్వాలను కొట్టిన స్వప్న :

ఏంటి జ్వాల అని నిరూపమ్ అంటే స్వప్న మాత్రం ఏంట్రా దానితో అంత నిదానంగా మాట్లాడుతున్నావ్ అంటుంది. జ్వాల కూడా ఏ మాత్రం తగ్గకుండా మాటకి మాట అనడంతో స్వప్న జ్వాల చెంప పగలగొడుతుంది. ‘మమ్మీ ఏంటిది?’ అంటాడు నిరుపమ్ కోపంగా.చెంప మీద దెబ్బ కంటే మనసు మీద కొట్టిన దెబ్బ బాధ ఎక్కువగా ఉంది డాక్టర్ సాబ్’ అంటుంది జ్వాల నిరుపమ్‌తో.. ఇక జ్వాల కూడా వెంటనే వేలు చూపిస్తూ.. ‘మేడమ్ ఇంకొక్కసారి చేయి ఎత్తితే మర్యాదగా ఉండదు..’ అని వార్నింగ్ ఇస్తుంది స్వప్నకు. ‘హేయ్ ఆపు.. ఆటో ఇస్తే ఇచ్చాడు.ఇలా ఇంటి ముందు పెడితే మేమేం చేసుకోవాలి’ అంటుంది స్వప్న. ‘

స్వప్న కు ఎదురుతిరిగిన జ్వాల :

మేడమ్ మీరు ఉంచుకుంటారో ఊరేగుతారో మీ ఇష్టం అయినా కాల్చేయడం మీకు అలవాటే కదా అంటుంది జ్వాల. ‘నిరుపమ్.. ఇలాంటి అలగా జనంతో నీకేంట్రా’ అంటుంది స్వప్న కోపంగా. ‘అలగా అనకండి అలాంటి దాన్నే అయితే ఆటో తిరిగి ఇచ్చేదాన్ని కాదు కదా అంటుంది.జ్వాలా ఇలా ఆటోని తిరిగి ఇవ్వడం అవసరమా’అంటాడు నిరుపమ్. ‘మనా అనుకుని సాయం చేశారనుకున్నాను.. కానీ మీరు పరాయిదాన్ని అని ముఖం మీదే చెప్పారు.. మీ సహాయానికి మీ సానుభూతికి..’ అంటూ దన్నం పెట్టి అక్కడ నుంచి వెళ్లిపోతుంది జ్వాల.వెంటనే నిరుపమ్ కారులోంచి పెళ్లి కార్డు తీసి ‘జ్వాలా’ అని పిలుస్తాడు. అప్పటికే జ్వాల వెళ్లిపోతుంది. ఇక సీన్ కట్ చేస్తే.. శోభ నిరుపమ్ ఇంటికి వచ్చి జ్వాల ఆటో చూసి ఆలోచనలో పడుతుంది. శోభ వెళ్లగానే.. ‘రా శోభా కూర్చో’ అంటారు. శోభ కూర్చుంటుంది కానీ జ్వాల కోసం ఇల్లంతా వెతుకుంటుంది


Share

Recent Posts

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

58 mins ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

1 hour ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

2 hours ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

3 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

3 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

4 hours ago