NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Karthika Deepam 2 April 23th 2024 Episode: నరసింహ చంప పగిలేలాగా కొట్టిన సుమిత్ర.. నేనే దీప తల్లిని అంటూ ట్విస్ట్..!

Karthika Deepam 2 April 23th 2024 Episode: సుమిత్ర దీప వివరాలు తెలుసుకోవాలని మెల్లగా ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. నీకు వంటలు ఎవరు నేర్పించారని అడుగుతుంది. మా నాన్న నేర్పించారు ఆయన పెద్ద వంట మాస్టర్ అని చెబుతుంది దీప. వండి మార్చడం మీ రక్తంలోనే ఉందన్నమాట అని సుమిత్రా అంటుంది. మీకు కూడా ఉంది కదా అప్పుడు గుడిలో మీరు నాకు వడ్డించారు. పైగా మీకు రెస్టారెంట్ బిజినెస్ ఉందని పోలీసామె చెప్తారు. నేను 100 మందికి పెడితే మీరు వేల మందికి పెడుతున్నారని దీప అంటుంది. అవును దీపా నువ్వు అంటుంటే అనిపిస్తుంది. మన ఆలోచనలోనే కాదు మన ఇద్దరి రక్తాల్లో ఓకే ఆలోచన ఉందని సుమిత్ర ఎమోషనల్ అవుతూ ఉంటుంది. నీకు నాకు ఏదో బంధం ఉంది దీప చూస్తుంటే చాలా దగ్గరగా అనిపిస్తుంది. పోయిన జన్మలో నువ్వు నా కూతురుగా పుట్టి ఉంటావు లేదా మా అమ్మవి అయ్యి ఉంటావని సుమిత్ర ఎమోషనల్ అవుతుంది. మీలో నేను అమ్మని చూసుకుంటున్నానని దీప అంటుంది. శౌర్య వాళ్ల నాన్న ఏం చేస్తున్నాడని సుమిత్ర అడగ్గానే దీప ఏదో ఆలోచనలో ఉండి డ్రైవర్ అని చెప్పేస్తుంది.

Karthika Deepam 2 April 23th 2024 Episode
Karthika Deepam 2 April 23th 2024 Episode

మీ ఆయన ఎక్కడ ఉంటాడని సుమిత్రా గట్టిగా అడిగేస్తుంది. ఇక దీపం మాత్రం ఆ టాపిక్ మాట్లాడకుండా ఏదేదో మాట్లాడేసి వెళ్ళిపోతుంది. నీ భర్త గురించి చెప్తేనే కదా నేను సాయం చేయగలిగేది. ఇంతకీ వాడు ఎక్కడ ఉంటాడని సుమిత్ర ఆలోచిస్తుంది. కార్తీక్ పారిజాతాన్ని నిలబెట్టి కడిగేస్తాడు. పారు మీరంతా అనుకున్నట్టు జ్యోత్స్న నా జీవితంలోకి రాదు. నేను తనని పెళ్లి చేసుకోను. నువ్వు చెప్పడం లేదని నేనే మా అమ్మతో చెప్పాలనుకుంటున్నాను కానీ వాళ్ల మాటలు విని ఆగిపోయానని చెబుతాడు. అయితే పెళ్లి చేసుకోవచ్చు కదా అంటుంది. ఇష్టంలేని అమ్మాయితో నడవడం కష్టం అలాంటిది జీవితాంతం కలిసి నడవడం అయితే ఇంకా కష్టం అంటాడు కార్తీక్. జ్యోత్స్న నీకు ఎందుకు నచ్చలేదని ఫారు అడుగుతుంది. నాకు అత్త, మావయ్య, తాతయ్య ఎలాగో జ్యోత్స్న కూడా అలాగే. చేతులు పట్టుకుని తిరగడానికి చెయ్యి పట్టుకుని తిరగడానికి చాలా తేడా ఉంది. మేం కలిసి పెరిగాము కానీ భార్యాభర్తలు కాలేము. మీరందరూ కలిసి చిన్నప్పటి నుంచి దాని మైండ్ చెడగొట్టారు.

ఇష్టం లేని పని చిన్నపిల్లలే చెయ్యరు అలాంటిది నేను ఎలా చేస్తాను. నువ్వు పెళ్లి ముహూర్తాలు ఆపి అసలు విషయం అందరితో చెప్పకపోతే నేనే అందరితో చెప్పేస్తాను. చెప్పకపోతే ఎదురుపడడానికి నేను బాధపడాలి. నువ్వు ఇప్పుడు చెప్తావా నేను వెళ్లి చెప్పే మంటావా అని సీరియస్ గా చెబుతాడు కార్తీక్. ఇప్పుడు కాదు ఒక నాలుగు రోజుల తర్వాత నేనే చెప్తానని కార్తీక్ ని ఆపుతుంది పారు. ఇది కూడా నా కుటుంబమే.. నా కారణంగా ఎవ్వరూ బాధపడకూడదని అంటాడు. మీ ఇద్దరికీ పెళ్లి కాకుండా చేసే బాధ్యత నాదని మాట ఇస్తుంది పారు. కార్తీక్ కాస్త రిలాక్స్ అవుతాడు. నా మాటలు నీటి మీద రాతలు లాంటివి. మీ ఇద్దరికీ పెళ్లి చేసే బాధ్యత నాది అన్నానా కానీ మీ ఇద్దరి పెళ్లి అయ్యేలా చేసే బాధ్యత నాది అని అనుకుంటుంది. దీప చేసిన పాయసం తిని సువిత్ర బాలు తెగ పొగిడేస్తారు. కార్తీక్ ని పిలిచి సుమిత్ర పాయసం పెడుతుంది. కార్తీక్ పాయసం తిని చాలా స్పెషల్ గా ఉందని మెచ్చుకుంటాడు. ఎవరు చేశారని అడిగితే దీప చేసిందని సుమిత్ర చెబుతుంది.

పాయసమే కాదు వంటలు కూడా చాలా బాగా చేసింది. నీకు ఒక అడ్వైజ్ నీ కొత్త రెస్టారెంట్ కి చెఫ్ గా దీపం తీసుకోమని దశరథ సలహా ఇస్తాడు. దీప వంట మాస్టర్ అయితే జనాలు నీ రెస్టారెంట్ దగ్గర క్యు కడతారని సుమిత్ర కి చెబుతాడు. డేపని నేను ఒప్పిస్తానని అంటాడు. కానీ దీప మాత్రం వద్దమ్మా నా పనులు నాకు ఉన్నాయి నేను వెళ్ళాలి అంటుంది. రెస్టారెంట్లో చెఫ్ అంటే మంచి జీవితం వస్తుంది. నీకు ఇదొక మంచి అవకాశం. నీ జీవితం మారిపోతుందని సుమిత్ర అంటుంది. ఏదైనా తేడా పడితే మన జీవితాలు మారిపోతాయి. నలుగురికి వంట చేసి పెట్టడం వేరు నాలుగు వందల మందికి రుచిగా చేయగలుగుతానని అనుకుంటున్నారా? లేదంటే వంట పేరుతో పర్మినెంట్గా ఇంట్లో పెట్టుకుందామని అనుకుంటున్నారా? అని సుమిత్రాన్ని ప్రశ్నిస్తోంది దీప. పెట్టుకుంటే తప్పేంటి? వంట చేసేది దీపా, రెస్టారెంట్ కార్తిక్ ది వాళ్లు వీళ్లు చూసుకుంటారు మధ్యలో నీకు ఏంటని శివ నారాయణ కౌంటర్ వేస్తాడు. ఏదైనా జరిగితే రెస్టారెంట్ మూసుకోవాల్సి వస్తుందని పారు అంటుంది.

దీప వంటలు చేస్తే ఆ పరిస్థితి రాదని శివ నారాయణ వెనకేసుకొస్తాడు. దీప మాత్రం మీరు అడిగిన దానికి నేను ఒప్పుకోలేను నాకు వేరే జీవితం ఉంది వెళ్ళిపోవాలని చెబుతుంది. దీప కు ఏదో ఒక రూపంలో సాయం చేయాలని అనుకుంటున్నాను కానీ తాను వెళ్లిపోతానని అంటుంది. దీపను ఎలా ఆపాలని సుమిత్ర ఆలోచిస్తూ ఉంటుంది. శౌర్య పరిగెత్తుతూ భయపడి ఇంట్లోకి వచ్చి దీపని కౌగిలించుకుంటుంది. ఏమైందని అంటే బూచోడు వచ్చాడు. ఆరోజు నేను పూలు కోస్తే నీతో గొడవ పెట్టుకున్నాడు కదా ఆ బూచోడు వచ్చాడని చెప్పేసరికి దీప షాక్ అవుతుంది. నీతో ఏమైనా మాట్లాడాడా అని దీపా అడిగితే లేదు నన్ను పిలిచాడు నేను పరిగెత్తుకుంటూ వచ్చేసానని చెబుతుంది. దీప కోపంగా నరసింహ దగ్గరకు వస్తుంది. ఎందుకు వచ్చావని అడుగుతుంది. నువ్వు ఇక్కడ ఎందుకు ఉంటున్నావని నరసింహ అడుగుతాడు. నీకు ఈ ఇంటి కి సంబంధం ఏమిటని అవమానిస్తాడు. సంబంధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అడిగే హక్కు నీకు కూడా లేదు. ముందు నువ్వు బయటకు నడువు అంటుంది.

Karthika Deepam 2 April 23th 2024 Episode
Karthika Deepam 2 April 23th 2024 Episode

నువ్వు గుడి దగ్గర ఒకటితో నన్ను కొట్టించావు చూడు ఇది వాడి ఇల్లు. నా కూతురికి వాడు ఏదో తండ్రి అయినట్టు షాపింగ్ చేయించడానికి, ఐస్ క్రీమ్ తినిపించడం మూతి తోడబడాలు చేస్తున్నాడు. కథ చాలా దూరం పోయింది. నా కూతురిని కూతురుగా చూసుకుంటున్నట్టు నా పెళ్ళాన్ని కూడా పెళ్ళాంగా చూసుకుంటాడా అని అసహ్యంగా మాట్లాడుతాడు నరసింహ. చెప్పు తీసి పళ్ళు రాలగొట్టకు ముందే ఇక్కడ నుంచి వెళ్ళిపోమని తిడుతుంది దీప. దీప గురించి నీచంగా మాట్లాడుతాడు నరసింహ. నీలాంటి కుక్క దగ్గర నేను ఏంటో నిరూపించుకోవాల్సిన అవసరం లేదని అంటుంది దీప. అవును నేను పిచ్చి కుక్కని నిన్ను కలవడానికి వచ్చాను. నువ్వు ఇక్కడ ఉంటే నా శోభా నాతో ఉండనని అంటుంది. నువ్వు ఇక్కడ ఉండకూడదు వెంటనే ఊరు వెళ్ళిపో అంటాడు. మన కూతురుని తీసుకురా మిమ్మల్ని బస్సు ఎక్కిస్తానని అంటాడు. దీప కోపంగా చూస్తుంది. నువ్వు ఎక్కడ ఉండడానికి వీల్లేదు పదా అంటాడు. నువ్వు నా గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని దీప తిడుతుంది.

నువ్వు ఇక్కడ ఉంటే నాకు నష్టం. నువ్వు ఇక్కడ ఉంటే చంపేస్తానని తన చేతిని పట్టుకుని లాక్కెళ్ళబోతాడు. ఇక సుమిత్ర లాగిపెట్టి నరసింహ చంప పగలగొడుతుంది. చంపుతానని బెదిరిస్తున్న అసలు ఎవడ్రా నువ్వు అని సుమిత్రా కోపంగా అడుగుతుంది. నేనే నీ మెడలో తాళి కట్టిన మొగుడిని అని చెప్పు అని నరసింహ అనేసరికి సుమిత్ర దీపని ఇది నిజమేనా అని అడుగుతుంది. దీప మౌనంగా తలవంచుకుంటుంది. నువ్వు కాదని ఒక్క మాట చెప్పు వీడిని ఏం చేయాలో తెలుసు. వీడు చెప్పేది నిజం కాదు కదా అంటుంది సుమిత్ర. అవును అని దీప చెబుతుంది. ఇక దీప మీ ఇంట్లో ఉండదు తీసుకుని వెళ్లిపోవడానికి వచ్చానని దీపక్ చెయ్యి పట్టుకోపోతే నరసింహని ఆపుతుంది. దీపని ముట్టుకుంటే ఊరుకోనని అంటుంది. డేపని చూస్తుంటేనే అర్థం అవుతుంది నువ్వు ఎంత మంచి మొగుడివో. దీప నీతో రాదని అంటుంది. అని చెప్పడానికి నువ్వు ఎవరని అంటాడు నరసింహ. నేను దీప తల్లిని అని చెబుతుంది. ఇక దీప సుమిత్ర వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది… అక్కడితో నేటి ఎపిసోడ్ కంప్లీట్ అయింది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella