NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న పార్టీలో గౌతమ్ చేసిన అవమానం తెలుసుకుని రగిలిపోతుంది. ఫుల్ గా తాగేసి కారు డ్రైవ్ చేస్తూ వాటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. జ్యోత్స్న తూలుతూ ఇంటికి రావడం దీప చూస్తుంది. ఇక తులుతూ కింద పడిపోతుంటే దీప వచ్చి పట్టుకుని సహాయం చేస్తుంది. బావ‌ వచ్చాడా అని అడుగుతుంది. బావకి నేనంటే ప్రేమ లేదని దీపతో చెబుతూ ఉంటుంది. మందు తాగావా అని దీప అడగడంతో.‌.. అవును బావ కోసం తాగానని చెబుతుంది. తనని పట్టుకునే జాగ్రత్తగా ఇంట్లోకి తీసుకువెళ్తుంది దీప. పారిజాతం జ్యోత్స్న నీ చూసి ఎప్పుడు లేనిది ఇంతగా తాగిందేంటని ఆలోచిస్తుంది. బావ నన్ను వదిలేసి వెళ్ళిపోయావా? అని కలవరిస్తూ ఉంటుంది జ్యోత్స్న.

Karthika Deepam 2 April 26th 2024 Episode
Karthika Deepam 2 April 26th 2024 Episode

ఈ అమ్మాయికి తాగుడు అలవాటు కూడా ఉందా? ఇదంతా సుమిత్ర అమ్మగారికి చెప్పాలని దీప అనుకుంటుంది. అటు హైదరాబాద్ చేరుకున్న అనసూయ రోడ్డు మీద తిరుగుతూ నీడ లేకుండా ఉంటుంది. టి కొట్టు దగ్గరికి వెళ్లి నరసింహ గురించి ఆరా తీస్తుంది. బంటు, పారిజాతం మాట్లాడుకుంటూ ఉంటారు. దీప నన్ను గుర్తుపట్టి సుమిత్ర అమ్మగారికి చెప్పిందంట పోలీసులు వచ్చారని బంటు అటుగా పోలీసులు రావడం చూసి తెగ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. దశరథ వచ్చి ఏమైందని ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తాడు. తన పేరు బయట పెట్టొద్దని పారిజాతం బతిమిలాడుతుంది. పోలీసులు జ్యోత్స్న నీ పిలవమని చెబుతారు. జ్యోత్స్న రాగానే తన కారు చూపించి నైట్ ఎక్కడికి వెళ్లారు? యాక్సిడెంట్ చేయడంతో ముగ్గురికి గాయాలు అయ్యాయి.

ఒకరికి సీరియస్ గా ఉంది. ఆ యాక్సిడెంట్ చేసింది ఈ కారు. ఈ కారు మీ అమ్మాయిది అంటే యాక్సిడెంట్ చేసింది కూడా మీ అమ్మాయే అయి ఉంటుంది.. అని పోలీసులు ఆరోపిస్తారు. జ్యోత్స్న టెన్షన్ గా రాత్రి జరిగింది గుర్తు చేసుకుంటుంది. పారిజాతం కళ్ళతోనే మనవరాలిని నిజమేనా అంటే అవునని సైగ చేస్తుంది. వెంటనే బంటు చంప పగలగొట్టి రాత్రి కారు వేసుకుని వెళ్లి నువ్వు చేసిన నిర్వాహం ఇదా అని వాడి మీదకు నెట్టేద్దామని చూస్తుంది. ఎస్సై గారు కారు నడిపింది వీడే అని చెబుతుంది. ఇక అప్పుడే దీప వస్తుంది. పుట్టినరోజు అని మా మనవరాలు తమతోనే ఉంది కారు నడిపింది వీడే తీసుకెళ్లండి అని పారిజాతం చెబుతుంది.

దీప.. జ్యోత్స్న నీ ఇంట్లోకి తీసుకొచ్చింది గుర్తు చేసుకుంటుంది. దీప నోరు విప్పితే తన మనవరాలిని అరెస్ట్ చేస్తారని పారు తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది. బంటు కారు నడపడం ఏంటి? రాత్రి కారు తీసుకొచ్చింది జ్యోత్స్న కదా? అని దీప చెబుతుంది. పారిజాతం దీప మీద అరుస్తుంది. దీప రాత్రి జ్యోత్స్న ఈ కారు తీసుకురావడం నువ్వు చూసావా? అని సుమిత్రా అడుగుతుంది. అప్పుడు దీపా చూసానని సమాధానం ఇస్తుంది. వచ్చినప్పుడు జ్యోత్స్న ఎలా ఉందో చూశారా? అని ఎస్ఐ దీపం అడుగుతాడు. సరిగ్గా నడవలేక పోతుంటే తీసుకెళ్లి గదిలో పడుకోబెట్టానని చెబుతుంది దీప. ఏం జరిగిందని దీప ఎస్ఐని ప్రశ్నిస్తుంది.

ఈ అమ్మాయి బాగా తాగి రోడ్డు మీద యాక్సిడెంట్ చేస్తుంది.. గాయాలు అయిన వాళ్లు హాస్పటల్లో ఉన్నారు.. నిజం చెప్పినందుకు మీకు థాంక్స్ అని ఎస్ఐ దీపకి చెబుతాడు. యాక్సిడెంట్ జరిగినప్పుడు కారుకు అంటున్న రక్తపు మరకలు కూడా అలాగే ఉన్నాయి. మీ అమ్మాయిని అరెస్ట్ చేస్తున్నామని ఎస్ఐ చెబుతాడు. తన మనవరాలిని అరెస్ట్ చేయడానికి వీల్లేదని పారిజాతం అడ్డుపడుతుంది. జ్యోత్స్న నీ పోలీసులు కారు ఎక్కమని చెబుతారు. ఇక అప్పుడు అందరూ సైలెంట్ గా ఉంటారు. జ్యోత్స్న నీ వెళ్ళమని దశరథ చెబుతాడు. తన మనవరాలిని తీసుకెళ్లి పోతున్నారని ఆపమని పారిజాతం బ్రతిమాలుకుంటుంది.

Karthika Deepam 2 April 26th 2024 Episode
Karthika Deepam 2 April 26th 2024 Episode

పారిజాతం దీప వైపు కోపంగా చూస్తుంది. ఆ వెంటనే సుమిత్ర.. కాంచన కి ఫోన్ చేసి ఈ విషయం చెప్తుంది. జ్యోత్స్న యాక్సిడెంట్ చేసిందని కోడలిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారని కార్తీకి చెప్తుంది. జ్యోత్స్న పోలీస్ స్టేషన్ లో కూర్చుని ఏడుస్తుంది. ప్రమాదం జరిగిన వారికి సహాయం చేస్తామని.. హాస్పిటల్ ఖర్చులు కూడా ఇస్తామని దశరథ సిఐని అడుగుతాడు. మా అమ్మాయి కోట్లో నిలబడడం తన కెరీర్ కి నష్టమని చెబుతాడు. మీడియా వాళ్ళు మిస్ హైదరాబాద్ జ్యోత్స్న తాగి కారు నడిపి యాక్సిడెంట్ చేసిందని అంటారు. పారిజాతం… దీప మీద అరుస్తూ ఉంటుంది. సుమిత్ర అడ్డుపడుతుంటే పారిజాతం మాత్రం ఆగదు. నీ ప్రాణం కాపాడింది అన్నావు కానీ ఈరోజు నీ పరువు తీసింది. దీనికి కారణం ఇది చెప్పినా సాక్ష్యం అని ఘోరంగా తిట్టిపోస్తుంది. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తయింది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella