NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Karthika Deepam 2 June 1st 2024 Episode: కాంచనకు నిజం నిర్మోహమాటంగా చెప్పమంటున్న కావేరి.. కార్తీక్ కి దగ్గరయ్యేందుకు జో ప్రయత్నాలు..!

Karthika Deepam 2 June 1st 2024 Episode: మీ నాన్న వచ్చారు హడావిడిగా వెళ్లిపోయారని దశరధ కార్తీక్ కి చెబుతాడు. ఆయన రహస్యం ఎక్కడ బయటపడిపోతుందోనని వెళ్లిపోయారని కార్తీక్ సరదాగా అనేసరికి దీప షాక్ అవుతుంది.‌ ఏంటి ఆ రహస్యం అని సుమిత్రా అంటే ప్రతి మగవాడి జీవితంలో రహస్యాలు ఉంటాయని అంటాడు కార్తీక్. దీప కార్తీక్ వైపు చూస్తూ ఉండడంతో ఏమైనా చెప్పాలని అనుకుంటుందా ఏంటని అనుకుంటాడు కార్తీక్.‌ మా అల్లుడు శ్రీరామచంద్రుడు అనవసరంగా లేనిపోని అనుమానాలు పెట్టొద్దు అని కాంచన కంగారు పడుతుందని పారు అంటుంది. మా ఆయన దేవుడనీ కాంచన చెప్తుంది. దేవుడు కాదు నీ మొగుడు కూడా నా మొగుడు లాగా నీచుడని దీప మనసులో అనుకుంటుంది.

Karthika Deepam 2 June 1st 2024 Episode
Karthika Deepam 2 June 1st 2024 Episode

సస్పెన్స్ కాదు చెప్పమని అంటే ధూమపానం ఆరోగ్యానికి హానికరం అనేసరికి అందరూ రిలీఫ్ గా ఫీల్ అవుతారు. సిగరెట్ తాగితే మీ నాన్న ఆరోగ్యం చెడిపోతుందని కాంచన బాధగా చెప్తుంది. ఇక దీపం వెళ్ళిపోతుంటే కార్తీక్ వెనుకే వెళ్లి ఏమైనా చెప్పాలని అనుకుంటున్నావా అని అడుగుతాడు. మీ నాన్న మీ అమ్మకి చేసిన ద్రోహం గురించి చెప్పాలని అనుకున్నాను కానీ ఆవిడ తన భర్త మీద పెట్టుకున్నా నమ్మకం చూస్తే జాలిగా అనిపిస్తుందని దీప మనసులో అనుకుంటుంది. మీరు ఇప్పుడు కూడా మనసులో ఏదో మాట్లాడుకుంటున్నారు ఏమైనా ఉంటే బయటికి చెప్పండి అని కార్తీక్ అంటాడు. ఇంట్లో కార్తీక్ లేకపోవడంతో జో వెతుకుతూ బయటకు వస్తుంది.

బయట కార్తీక్ మరియు దీప మాట్లాడుకుంటూ కనిపిస్తారు. భర్తల అందరూ మా నాన్న లాగా ఉంటే భార్యలకు ఎంత అదృష్టమో. మా నాన్న చాలా మంచివాడు. అందుకే ఆయన అంటే నాకు అంత గౌరవం అని తండ్రి గురించి గొప్పగా చెబుతూ ఉంటాడు కార్తీక్. మా నాన్నకి ఒకటే లోటు నాకు చెల్లెలు లేదని. అందుకే జో ని బంగారం గా చూసుకుంటారని చెప్తాడు. నేను హాయ్ చెప్తే హాయ్ చెప్పావు కానీ దీపతో ఎంతసేపు మాట్లాడుతున్నావ్ ఇంతకంటే అవమానం మరొకటి ఉండదు. ఐ హేట్ యు బావ అనుకుంటూ కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది జో. దేపని సంతోషంగా బతకమని దేని గురించి ఆలోచించొద్దని సలహా ఇస్తాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండమని చెప్తాడు.

Karthika Deepam 2 June 1st 2024 Episode
Karthika Deepam 2 June 1st 2024 Episode

మీ పాట చాలా బాగుందని మెచ్చుకుంటాడు. మీ వంటలాగా మీ పాట కూడా చాలా బాగుందని చెప్తాడు. శౌర్య కోసం పాడానని చెప్పేసి వెళ్ళిపోతుంది దీప. కావేరి మరియు శ్రీధర్ కలుస్తారు. తమ అమ్మాయికి ఏ ఇబ్బంది రాకుండా చూసుకోమని కావేరికి చెప్తాడు. డబ్బులు ఇస్తే సరిపోదు పట్టించుకోమని అడుగుతుంది. డాడీ కోసం అడుగుతుంది. బయటకు వెళ్దామని అడుగుతుందని చెప్తుంది. సరే మనం ముగ్గురం బయటకు వెళ్దామని అంటాడు శ్రీధర్. ఇంట్లో ఏం చెప్తావ్ అంటే ఫ్రెండ్ పెళ్లి ఉందని ఏదో ఒకటి చెప్తాను కాంచన నమ్మేస్తుందని శ్రీధర్ అనేసరికి కావేరి మొహం మార్చుకుంటుంది. నాకు పెళ్లి అయ్యిందని కొడుకు ఉన్నాడని నీ మెడలో తాళి కట్టక ముందే చెప్పాను మళ్లీ కొత్తగా విషయం తెలిసినట్టు ఫీల్ అవుతావ్ ఏంటని అంటాడు శ్రీధర్.

మన పిల్ల కు ఏదో ఒక రోజు ఈ విషయం తెలియాల్సిందే దోషులుగా నిలబడాల్సిందేనని అంటాడు. కాంచన అక్కతో మన విషయం చెప్పొచ్చు కదా అని అడుగుతుంది కావేరి. చెప్పలేనని అనేసరికి కావేరి కోపంగా శ్రీధర్ ఇచ్చిన డబ్బులు తన చేతిలో పెట్టేసి కోపంగా వెళ్ళిపోతుంది. దీప డల్ గా ఉండటం చూసి ఏమైంది వాడేమన్నా ఇంటికి వచ్చాడా? వస్తే కార్తీక్ బాబు చూసుకుంటాడని కడియం నోరు జారుతాడు. ఆయన దాకా ఎందుకు నువ్వే వదిలిపెట్టవు కదా అని మాట మారుస్తాడు. మన గురించి ఎవరైనా ఒక మంచి మాట చెప్తే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయినా దాన్ని తీసుకుంటే మంచిదని అంటాడు.

Karthika Deepam 2 June 1st 2024 Episode
Karthika Deepam 2 June 1st 2024 Episode

కార్తీక్ మాటలు గురించి ఆలోచిస్తుంది. ఆయన చెప్పింది నా మంచి కోసమే కదా నాకు ఉన్న కోపం వల్ల మంచి చెప్పినా పట్టించుకోవడం లేదని అనుకుంటుంది దీప. జ్యోత్స్న కూడా కార్తీక్ మరియు దీప మాట్లాడుకోవడం తలుచుకుని రగిలిపోతూ ఉంటుంది. పారు వచ్చి ఏమైందని అడుగుతుంది. దీపతో మాట్లాడటానికి స్పేస్ ఉంటుంది బావ మాట్లాడుతాడు. అదే నేను మాట్లాడితే అడిగిన దానికి కూడా సమాధానం చెప్పడు. వాడు మాట్లాడకపోతే నువ్వు మాట్లాడు నీకెందుకు అంత ఈగో. నువ్వు మాట్లాడకపోతే దూరం జరిగి అవుట్ హౌస్ వైపు వెళ్ళిపోతాడని అనేసరికి జో కోపంగా అరుస్తుంది. నీ బావని మెడలో మూడు ముళ్ళు వేసే వరకు ఏదో ఒకటి చేసి నీ వైపుకు లాక్కోవాలి. కార్తీక్ కి దగ్గరగా ఉండమని సలహా ఇస్తుంది పారు. ఇక ఆ వెంటనే జ్యోత్స్న కార్తీక్ దగ్గరకు వెళ్తుంది. అక్కడితో నేటి ఎపిసోడ్ కంప్లీట్ అయింది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella