NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Karthika Deepam 2 June 2nd 2024: శౌర్య కనిపించకపోవడంతో అల్లాడిపోయిన దీప.. ధైర్యం చెప్పిన కార్తీక్..!

Karthika Deepam 2 June 2nd 2024: కార్తీక్ ని కలవడానికి జో ఆఫీసుకు వెళ్తుంది. నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను అని అంటుంది. మన రెస్టారెంట్ మీద కేసు పెట్టిన వాడు క్షమాపణ చెప్పి పరువు నష్టం దావా వెయ్యోద్దని బ్రతిమాలాడని చెప్తుంది. కంగ్రాట్స్ చెప్తాడు. కేసు గెలిచాము కదా నీకు పార్టీ ఇస్తానని అంటుంది జో. వర్క్ ఉందని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ జోక్ మాత్రం కుదరదు అనేసి తనని తీసుకుని వెళుతుంది. నీ ఆలోచనలు బిజినెస్ మీదకు డైవర్ట్ చేయాలని కార్తీక్ అనుకుంటాడు. దీప స్కూల్ దగ్గరకు వస్తుంది. టీచర్స్ మీటింగ్ ఉంటే గంటన్నర ముందే వెళ్లిపోయారని స్కూల్ సెక్యూరిటీ చెప్తాడు. స్కూల్లో తన కూతురు ఉంటుందని దీప కంగారుగా అంటుంది. తాను రాకుండా ఎక్కడికి వెళ్ళదని చెప్తుంది. ఒక క్యాబ్ వచ్చింది. నేను పని ఉండి లోపలికి వెళ్లి వచ్చేసరికి పాప లేదని చెప్తాడు. నరసింహ తీసుకుని వెళ్లి ఉంటాడని దీప కంగారుగా వెళుతుంది.

Karthika Deepam 2 June 2nd 2024
Karthika Deepam 2 June 2nd 2024

దీప విషయంలో అనవసరంగా నరసింహని రెచ్చగొట్టొద్దని అనసూయ శోభకి చెప్తుంది. దాని బతుకు ఏదో అది బతుకుతుంది ఎందుకు మనకి దాంతో అంటుంది. కానీ శోభ మాత్రం ఒప్పుకోదు. పోలీసులు కాదు ఈసారి దీప ఇంటికి వస్తే అని శోభా అనగానే దీప అత్తయ్య అని కంగారుగా పిలుస్తూ వస్తుంది. నా కూతురు ఎక్కడ నీ అనసూయని నిలదీస్తుంది. దీప కంగారుగా శౌర్య కోసం ఇల్లంతా వెతుకుతుంది. కానీ కనిపించదు. ఏం జరిగిందని అనసూయ అడుగుతుంది. నా కూతురు కనిపించడం లేదు నరసింహ నా కూతుర్ని ఎక్కడ దాచాడో చెప్పమని నిలదీస్తుంది. నా భర్తని పోలీసులకు పట్టించడం కోసం ఇదొక కొత్త నాటకం ఆడుతున్నావా అని శోభా తిడుతుంది. స్కూల్ దగ్గర నుంచి కనిపించకుండా పోయింది. నిన్న నరసింహ స్కూల్ దగ్గరికి వచ్చి పాపతో మాట్లాడడానికి ప్రయత్నించాడు. అయినా వినకుండా హోటల్ దగ్గరకు వచ్చి గొడవ చేస్తే జనం బుద్ధి చెప్పి పంపించారు.

ఇక ఈరోజు స్కూల్ దగ్గరికి వచ్చి ఎత్తుకుని వచ్చాడు. మీరందరూ దూరం అయినా నాకు ఉన్న ఒకే ఒక బంధం అది. నా కూతురిని నాకు దూరం చేయొద్దని దీప ఏడుస్తూ అడుగుతుంది. నీ కూతుర్ని ఎత్తుకు రావాల్సిన అవసరం మాకు ఏంటి? మేం నిన్నే వద్దని అనుకుంటే ఇక దాంతో మాకేం పని అని అనసూయ అడుగుతుంది. నేను కూడా అందుకే ఇప్పటివరకు నరసింహ తన తండ్రి అని చెప్పలేదు. కానీ ఇప్పుడు కావాలనే దానికి నిజాలు చెప్పి దాని మనసు పాడు చేయాలని చూస్తున్నాడు. మమ్మల్ని వదిలేయండి నా కూతురుని నాకు ఇచ్చేయండి. నా కూతురు లేకుండా నేను బ్రతకలేను అని అంటుంది. చాలు ఆపు నీ నాటకాలు అని అనసూయ మరియు శోభా ఇద్దరూ దీపని తిడతారు. నరసింహనా కూతురిని ఎక్కడ దాచాడో చెప్పమని నిలదీస్తుంది. నీ కూతురు ఎక్కడ ఉందో మాకు తెలియదు. నువ్వు ఒక దరిద్రం అయితే అది ఒక పిల్ల దరిద్రం.

Karthika Deepam 2 June 2nd 2024
Karthika Deepam 2 June 2nd 2024

నీ వెధవ వేషాలు తెలిసి నీ మొగుడు నిన్ను వదిలేసినట్టు నీ కూతురు కూడా వదిలేసి వెళ్లిపోయి ఉంటుంది. నీకు మాకు ఏ సంబంధం లేదు. కూతురు కనిపించడం లేదని అడ్డమైన సాకులు చెప్పి ఈ ఇంటికి రావద్దు. నా కొడుకుని కూతురిని తీసుకురాలేదు. ఆ అవసరం కూడా లేదు ఎక్కడికైనా పోయిందో లేదో ఎవరైనా ఎత్తుకుపోయారో వెళ్లి వెతుక్కో అని అనసూయ దీపని కోపంగా తిడుతుంది. పారు తనని తాను. అది చూసి శివ నారాయణ తనకు కౌంటర్ వేస్తాడు. ఇలా ఒంటరిగా కూర్చుని మాట్లాడుకునే వాళ్ళకి ఒక హాస్పిటల్ ఉంది. వెంటనే తీసుకుని వెళ్తానని నరసింహ గాలి వేస్తాడు. ఇంట్లో తనకు గుర్తింపు లేదని అంటుంది. ఏం గనకార్యం చేశావని అడుగుతాడు. ఎడ మొహం పెడ మొహం పెట్టుకున్న మనవడు మనవరాలిని కలపడానికి ప్రయత్నం చేస్తానని చెప్తుంది. నువ్వు మనవరాలు విషయంలో వేలు పెట్టకు. దానికి కాస్త దూరంగా ఉండు లేదంటే హాస్పటల్లో తీసుకెళ్లి పడేస్తానని వార్నింగ్ ఇస్తారు. నా అసలు నీకు తెలియదు. నీ వంశంలో నీ రక్తం పుట్టకుండా చేస్తానని పారు అనుకుంటుంది.

బిడ్డల్ని మార్చేశాను ఒక మీదట కొనసాగబోయేది నా కొడుకు దాసు రక్తం. నీ ఆశలు మనవరాలికి పుట్టుకతోనే నూరేళ్లు నిండిపోయాయి. ఏకన్నా మనవరాలు ఈ ఇంటి వారసురాలు. జో కార్తీక్ పెళ్లి జరిపించడం నా జీవిత లక్ష్యం అని పారు అనుకుంటుంది. జో కార్తీక్ కారులో వెళ్తూ ఉంటారు. కార్తీక్ బిజినెస్ గురించి మాట్లాడుతాడు. మనకి రెస్టారెంట్లు ఉన్నాయి కదా అందులో ఇన్వాల్వ్ అవ్వమని చెప్తాడు. తనకి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టమని చెప్తుంది. అయితే అందులోనే ఏదో ఒకటి చేసి ట్రెండ్ సెట్ చెయ్యి. చదువుకుని ఇంట్లో కూర్చోవడం ఎందుకని అంటాడు. అదే ఐదో తరగతితో ఆపేసిన దీపని చూడు సిటీకి కొత్త అయిన హోటల్ పెట్టుకుందని మెచ్చుకుంటాడు. జో దీప ని చూసి కారు ఆపమని చెప్తుంది. రోడ్డు పక్కన దీపా ఏడుస్తూ కూర్చుంటే వెళ్లి ఏమైందని అడుగుతారు. శౌర్య కనిపించడం లేదని దీపా ఏడుస్తూ చెప్తుంది. స్కూల్లో లేదు. ఇవాళ గంటన్నర ముందే స్కూల్ వదిలేసారు అంట నాకు తెలియదని చెప్తుంది. చుట్టుపక్కల అంతా వెతికాను ఎక్కడ కనిపించడం లేదని దీపా ఏడుస్తుంది. ఒకవేళ నరసింహ ఏమైనా అని కార్తీక్ అంటే లేదు అక్కడికి కూడా వెళ్లాను తాను కిరాయికి వెళ్లాడని చెప్తుంది. రండి వెళ్లి వెతుకుదామని కార్తీక్ తనని కారు ఎక్కించుకుంటారు. కారులో దీప కార్తీక్ పక్క సీట్లో కూర్చునే సరికి జో రగిలిపోతుంది. అక్కడితో నేటి ఎపిసోడ్ కంప్లీట్ అయింది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella