NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Karthika Deepam 2 June 4th 2024: నీ బిడ్డని నీకు దక్కకుండా చేస్తానని దీపకి వార్నింగ్ ఇచ్చిన నరసింహ.. కంటతడి పెట్టుకున్న వంటలక్క..!

Karthika Deepam 2 June 4th 2024: దీప, కార్తీక్ రోడ్డు మీద శౌర్య కోసం వెతుకుతూ ఉంటారు. జో మాత్రం ఏం పట్టనట్టు నుంచుంటుంది. కూతురి కోసం దీప కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. కావాలంటే పోలీస్ కంప్లైంట్ ఇద్దామని కార్తీక్ అంటాడు. వద్దు నేను ఇప్పటికే ఒక సాక్షిని ఎప్పుడు పారిపోతానా అని పోలీసులు కాపలా కాస్తున్నారు. ఇది ఒక నాటకం అనే వాళ్ళు అంటే తట్టుకోలేనని ఏడుస్తుంది. కాంచన మరియు శ్రీధర్ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. మీరు రెండు రోజుల నుంచి తేడాగా ఉన్నారు ఏమైనా చెప్పాలా అని కాంచన అడుగుతుంది. ఏం లేదని అంటాడు. నేను వారం రోజులు బయటకు వెళ్తాను నామీద దిగులు పెట్టుకోకుండా మీ అన్నయ్య ఇంటికి వెళ్ళమని చెప్తాడు. ఎక్కడికని అడుగుతుంది కాంచన. కావేరి అమ్మాయిని తీసుకుని బయటకు వెళ్తున్నాను కానీ ఆ విషయం నీతో చెప్పలేను కదా అని అనుకుంటాడు.

Karthika Deepam 2 June 4th 2024
Karthika Deepam 2 June 4th 2024

నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తున్నారని అంటే ప్రస్తుతం ఎక్కడికి వెళ్లడం లేదు ఒకవేళ వెళ్తే బెంగ పెట్టుకోవద్దని చెప్తాడు. అర్జెంట్గా కార్తీక్ పెళ్లి చేసి తరువాత కావేరి విషయం చెప్పాలి. వేరే వాళ్ళ ద్వారా ఈ విషయం తెలిస్తే మంచిది కాదని అనుకుంటాడు శ్రీధర్. మీకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఇష్టం లేకపోతే నేనే వెళ్లి నా బిడ్డ కనిపించడం లేదని కంప్లైంట్ ఇస్తానని కార్తీక్ అనేసరికి జో రగిలిపోతుంది. అయినా నాదే తప్పు ఈ ఊరు వచ్చి సరిదిద్దుకోలేని తప్పు చేశాను. వచ్చిన దగ్గర నుంచి అన్ని అవమానాలు మరియు దారుణమైన నిందలు వేశారు. అవన్నీ నేను భరించాను భరిస్తా ను కానీ ఇప్పుడు నా బిడ్డ అని ఏడుస్తుంది. నేను ప్రామిస్ చేసి చెప్తున్నా శౌర్య ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి అప్పగించే బాధ్యత తనదని కార్తీక్ హామీ ఇస్తాడు. జోకి పారు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారని అడుగుతుంది. శౌర్య కనిపించకపోతే నేను దీప కార్తీక్ వెతుకుతున్నామని చెప్తుంది.

శౌర్యని మీరు వెతకడం ఏంటి అది ఇంటి గుమ్మం దగ్గర ఉందని ఫోటో తీసి పంపుతుంది. వెంటనే బావ శౌర్య ఇంటిలోనే ఉంది ఫోటో కూడా పంపించిందని చెప్తుంది. దీంతో దీప ఊపిరి పీల్చుకుంటుంది. దీప మేం వెళ్తాం మాకు పని ఉంది ఆటోలో వెళ్తావా అని జోక్ అడుగుతుంది. అలాగే అని దీప వెల్లబోతుంటే కార్తీక్ కాపుతాడు. ఇప్పుడు తనని వదిలేయడం కరెక్ట్ కాదు నాకు శరీ అని చూడాలని ఉందని చెప్తాడు. ఇంటిదగ్గర శౌర్య దీప కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. దీప ఇంటికి రాగానే శౌర్య దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి కావలించుకుని ఏడుస్తుంది. నిన్ను తీసుకురావడానికి స్కూల్ కి వస్తానని చెప్పాను కదా నువ్వు ఎందుకు ఇంటికి వచ్చేసావ్ దారిలో నీకేమైనా అయితే నువ్వు స్కూల్ దగ్గర కనిపించకపోయేసరికి నీకోసమే వెతుకుతున్నానని దీపక్ కోపంగా ఉంటుంది. గంటన్నర ముందే వెళ్లిపోమన్నారు.

Karthika Deepam 2 June 4th 2024
Karthika Deepam 2 June 4th 2024

బయట చాలాసేపు నిలబడ్డాను నీకు ఫోన్ చేద్దామని అంటే నీ దగ్గర ఫోన్ లేదు అంటుంది. కార్తీక్ వాస్తే నీకు ఫోన్ చేద్దామని అంటే నీ నెంబర్ నాకు తెలియదు అంటుంది. ఎలా వచ్చావు అంటే కార్లో అని చెప్తుంది. అప్పుడే నరసింహ కార్తీక్ కి ఫోన్ చేస్తాడు. నువ్వు నా పెళ్ళాన్ని లాక్కున్నావు. ఎందుకు నాకు ఫోన్ చేశావని కార్తీక్ కోపంగా అడుగుతాడు. బావ ఇలా మాట్లాడుతున్నాడు అంటే ఫోన్ చేసింది దీప మొగుడు అని జో అర్ధం చేసుకుంటుంది. నా పెళ్ళాంతో మాట్లాడడానికి నీకు ఫోన్ చేయాల్సి వచ్చింది. ఒకసారి ఫోన్ ఇవ్వు దాంతో మాట్లాడి తర్వాత నీతో మాట్లాడతానని అంటాడు. ఫోన్ ఇవ్వకపోతే ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేస్తానని బెదిరిస్తాడు. ఏమైందని దీప అడుగుతుంది. పాప కనిపించిందా ఇంటికి వచ్చావు నేనే ఎత్తుకుపోయాను అనుకున్నావా? బాగా టెన్షన్ పడినట్టు ఉన్నావ్. దీపను తీసుకెళ్లిన వ్యక్తి నా ఫ్రెండ్. కావాలనే తాపను ఎక్కించుకోమని చెప్పాను.

నేను పెట్టబోయే టార్చర్ ఎలా ఉంటుందో నీకు రుచి చూపించాను. ఇకనుంచి నీ బలహీనతతో ఎలా ఆడుకుంటానో చూడు. నీ కూతురుని నీకు దూరం చేస్తాను. నువ్వు ఏడుస్తూ చూడటం తప్ప ఏం చేయలేదు. నీ బిడ్డ అయితే నీకు దక్కదు అని దీపకు వార్నింగ్ ఇస్తాడు నరసింహ. ఆ వెంటనే దీప ఫోన్ విచ్చేసి వెళ్ళిపోతుంది. మనం పంపించాలని అనుకుంటే సరిపోదు మీ అమ్మ పంపించాలి కదా. దీపను సొంత కూతురు లాగా చూసుకుంటుంది. అసలు దీని అంతటికీ కారణం మీ అమ్మే అనేసరికి సుమిత్ర కోపంగా అత్తయ్య అని అరుస్తుంది. మీ మనవరాలికి చెప్పాల్సిన మాటలు ఇవా? తాను అసలే చెడుగా ఆలోచిస్తుంటే తప్పని చెప్పాల్సింది పోయి అవే చెప్తున్నారు ఏంటని నిలదీస్తుంది. గ్రానీ ఏం పెట్ట కథలు చెప్పడం లేదు నా చుట్టూ జరుగుతుంది నాకు చెప్తుంది. బావతో నేను సరదాగా బయటకు వెళ్దామని అనుకున్నాను. శౌర్య కనిపించడం లేదని దీప ఏడుస్తూ కారులో ఎక్కితే మేము వెతికాము. గ్రానీ ఫోన్ చేస్తే ఇంటికి వచ్చేసాము. దీపకు శౌర్య దొరికింది కానీ నాకే బావ దొరకడం లేదు. కలిసి కూర్చుని కప్పు కాఫీ తాగాలన్న ఏదో ఒక సమస్య. అన్నిటికీ ఒకటే కారణం దీప అని రగిలిపోతుంది. అక్కడితో నెట్ ఎపిసోడ్ కంప్లీట్ అయింది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella