NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Karthika Deepam 2 May 10th 2024 Episode: కడియం దీపని కార్తీక్ గురించి అడుగుతూ ఉంటాడు. మిమ్మల్ని చూడగానే ఆ ఇంట్లో వంట మనిషి అనుకున్నాను కానీ ఆయన నిన్ను ఏవండి అంటున్నాడు. ఆయన తలుచుకుంటే ఎంతైనా సహాయం చేయగలరు. అయినా నువ్వు నా దగ్గర పని చేయడం ఏంటమ్మా అని అడుగుతాడు. ఒకరికి ప్రమాదం జరగబోతుంటే నేను కాపాడాను. నేను కాపాడిన సుమిత్రమ్మ మేనల్లుడు ఆయన. కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లో ఉండాల్సి వస్తుందని చెప్పింది. అక్కడ నేను మాత్రం ఎన్నాళ్ళు ఉంటాను అవసరం తీరిపోయిన తరువాత వెళ్ళిపోవాల్సిందే కదా అని అంటుంది దీప. మళ్లీ వెళ్ళిపోతావా అని కడియం అంటే లేదు నా కూతురిని చదివించుకోవాలి. చాలా బాధ్యతలు ఉన్నాయి అప్పటివరకు ఎక్కడికి వెళ్ళనని చెబుతుంది. నరసింహ దీప వచ్చి ఏం గొడవ పడుతుందోనని భయంగా ఉందని అంటాడు. అనసూయ మరియు శోభ మీద పెత్తనం చెలాయించాలని చూస్తుంది. నిన్ను ఇంట్లో ఉంచుకుంది నామీద పెత్తనం చాలా ఉంచడానికి.. మేపడానికి కాదు.

Karthika Deepam 2 May 10th 2024 Episode
Karthika Deepam 2 May 10th 2024 Episode

దీపని వదిలించుకోవడానికి ముందు దాన్ని వదిలించుకుని ఆ తర్వాత నిన్ను రోడ్డుమీద ని కొడుకుతోచ్చి కొట్టించి మరీ గెంటేస్తానని శోభ మనసులో అనుకుంటుంది. నువ్వు నా మొదటి కోడలు అయితే ఎంత బాగుందోనని అనసూయ అంటుంది. మొదటి కోడలు రెండో కోడలు ఏంటి ఉన్న ఒక కోడలిని నేనే అని శోభా నోటికి పని చెబుతుంది. దీప ఇక్కడే ఉంటే కూతురుని ఇంటికి తీసుకువచ్చి గొడవ చేస్తుంది. అత్త అన్న మాట నలుగురు అనకముందే ఏదో ఒకటి జరగాలి. విడాకులు తీసుకుంటావో లేదంటే దూరంగా తరిమి కొడతావో నీ ఇష్టం. తిట్టినా కూడా దానికి భయం లేదని అంటే.. అయితే కొట్టు దానికి ఆత్మ అభిమానం ఎక్కువ దాని మీద కొట్టమని చెప్తుంది. మనం పొమ్మంటే అది పోయింది దాని బ్రతుకు ఏదో అది బ్రతుకుతుందని అనసూయ అంటుంది. శోభ మాత్రం అసలు తగ్గదు. నువ్వు ఏదైనా చెప్తావా లేదంటే మా అమ్మని రమ్మని చెప్పనా. రానివి వస్తే ఏమవుతుందని అనసూయ అంటుంది. మా అత్త నాంచారి వస్తే పొయ్యిలో నిప్పులు ఒడిలో వేసుకుంటానని అంటాడు.

దీప జోలికి వెళ్ళకు ఆ ఇంట్లో పెద్ద ఆవిడ తనని కూతురులా చూసుకుంటుంది. నీ మీద పోలీస్ కేస్ పెడతానని అన్నదని అనసూయ చెబుతుంది. అలా వారి మధ్య కొంత గొడవ జరుగుతుంది. అనంతరం శౌర్యతన బ్యాగ్ లో నక్లీస్ మనకి ఇచ్చారా అని అడుగుతుంది. మీరు ఇద్దరు బయటకు వెళ్లారు కదా నానమ్మ ఎందుకు రాలేదని అడుగుతుంది. అనసూయ మాటలు గుర్తు చేసుకుంటుంది. సుమిత్ర దీప దగ్గరకు వస్తుంది. నానమ్మ ఊరు వెళ్లిపోయిందని దీప అబద్ధం చెబుతుంది. నువ్వు చెప్పే అబద్దాలు శౌర్య నమ్ముతుంది కానీ నేను నమ్మను అంటుంది సుమిత్ర. దీప ని తీసుకుని పక్కకి తీసుకెళ్లి అసలు విషయం అడుగుతుంది. మీ అత్తయ్య ఎక్కడని అంటుంది. మీరందరూ నరసింహ ఇంటికి వెళ్లారా అని అడుగుతుంది. కార్తీక్ దీప వాళ్ళని చూస్తాడు. మీ ఆయన్ని రెండో పెళ్లి గురించి అడిగా? అని సుమిత్ర ప్రశ్నిస్తుంది. అయితే దీపకు నరసింహ చేసిన అన్యాయం ఇదని అనుకుంటాడు. అందుకే దీప వాడిని వదిలేసి వాడే తండ్రి అని కూతురికి ఎప్పటికీ తెలియకూడదు అని అనుకుంటుంది.

Karthika Deepam 2 May 10th 2024 Episode
Karthika Deepam 2 May 10th 2024 Episode

దీప బాధగా మాట్లాడుతుంది. రాత్రి మీ దగ్గర సపదాలు చేసిన మనిషి అక్కడికి వెళ్లిన తరువాత నాకు చివాట్లు పెట్టింది. అప్పులు చేసి ఊరు వదిలి వెళ్లిపోయిన కొడుకుది ఏమి తప్పు లేదట. తప్పంతా నాదేనట. చివరికి తన కొడుకు రెండో పెళ్లి కూడా సమర్ధించుకుంటూ వచ్చింది. నీకు నీ కూతురికి మాకు ఏ సంబంధం లేదని చెప్పేసింది. నేను భర్త వదిలేసిన ఆడదాన్ని కాదు అత్త వదిలేసిన ఆడదాన్ని కూడా. వాళ్లకు నేను నా కూతురు అవసరం లేదు. ఎలా బ్రతుకుతారో పోయి బ్రతకండి అంది. ఇప్పుడు మా అత్తయ్య కు ఆ రెండో కోడలు ఇష్టమట. నాన్న పోయినప్పుడు కూడా ఇంతగా బాధపడలేదు. ఆయన చనిపోయి దూరమయ్యాడు. వీళ్లు బ్రతికే ఉండి దూరం అయ్యారు. ఇప్పుడు నేను నిజంగానే అనాధని అయ్యాను. అలా అని నేను ఏడుస్తూ కూర్చును. నాకు ఎవరు లేకపోవచ్చు కానీ నా కూతురికి నేను ఉన్నాను. ఈ ఆకలి కష్టాలు మరియు కన్నీళ్లు తెలియనివ్వను. అందుకే నేను ఒక హోటల్లో పనిచేస్తున్నాను. ఇక నా దగ్గర పోగొట్టుకోవడానికి ఏం మిగల్లేదు నా ప్రాణం ఒక్కటే అది నా కూతురు.

అందుకే అది నాన్న, నానమ్మ గురించి అడిగితే ఏదో ఒక అబద్ధం చెప్పాను… అని సుమిత్రా కి చెబుతుంది దీప. ఇక దీపం మాటలని కార్తీక్ వింటాడు. నీకు జరిగిన దానికి వాళ్లకి బుద్ధి చెప్పాల్సింది. పోలీస్ కేసు పెట్టి నాలుగు తన్నించాల్సింది అని సుమిత్రా అంటుంది. దీప మాత్రం వద్దని అంటుంది. వాళ్లే బంధాలు తెంపేసి కుంటే ఎవరి మీద కేసు పెడితే ఏం ఉపయోగం అని బాధపడుతుంది. నేను ఎవరి జోలికి వెళ్లాలని అనుకోవడం లేదని చెబుతుంది. నీ తండ్రి బ్రతికి ఉంటే నీకు ఈ కష్టం వచ్చేది కాదని సుమిత్ర అంటుంది. నీ కూతురికి నువ్వు ఉన్నావు నీకు నేను ఉన్నాను. నేను ఉండగా నువ్వు ఎప్పటికీ అనాధవి కాదు. నువ్వు ఎక్కడ పని చేయాల్సిన అవసరం లేదు నేను చూసుకుంటాను. వద్దు ఉండటానికి ఇల్లు ఇచ్చారు తిండి పెడుతున్నారు చాలు. ఏ బంధం లేకపోయినా నన్ను చూసుకుంటున్నారని దీప చెబుతుంది. బంధం లేదని నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు బాధపడితే నా సొంత మనిషికి బాధ కలిగినట్టు అనిపిస్తుంది. నువ్వు ఇక్కడే ఉండి మీకు నచ్చిన పని చేసుకో. నీకు ఈ అమ్మ ఉందనే విషయం ఎప్పటికీ మర్చిపోకు… అని సుమిత్ర దీప కు చెబుతుంది. అత్త చెప్పింది కరెక్ట్ దీపా కు నాన్న ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు అని కార్తీక్ అనుకుంటాడు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అయింది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella