NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Karthika Deepam 2 May 11th 2024 Episode: పారు బంటుని సీక్రెట్ గా కలుస్తూ ఉంటుంది. దీప ఇంట్లో ఉంటే నిన్ను గెంటేసినట్టే ఏదో ఒక రోజు నన్ను గెంటేస్తారని పారు చెబుతుంది. ఇదంతా జరగకూడదు అంటే దీప ఇంట్లో ఉండకూడదని బంటుకి చెబుతుంది పారు. దీప మోడీ వివరాలు మనకు సగమే తెలిసాయి. పూర్తి వివరాలు కోసం దీప సంతూరు ముత్యాలమ్మ గుడెం వెళ్లాలి. దీప పుట్టుపూర్వతాలు తెలుసుకుని రమ్మని చెబుతుంది పారు. దాని కథ ఏంటో తెలిస్తే దాని బలహీనత తెలుస్తుంది దాని మీద దెబ్బ కొడితే ఇల్లు వదిలి వెళ్ళిపోతుందని పారు మాస్టర్ ప్లాన్ వేస్తుంది. ఇక దీప ఒక్కసారిగా సుమిత్ర వాళ్ళ ఇంట్లో పడిపోతుంది. ఏమైందని సుమిత్ర వాళ్లు కంగారుగా అడుగుతారు. అప్పుడే నరసింహ వస్తాడు. నువ్వు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు అని సుమిత్ర అడుగుతుంది. నేను ఇక్కడికి వచ్చింది మీతో గొడవ పడడానికి కాదు వాడి సంగతి తేల్చడానికి అని అంటాడు నరసింహ. రారా బయటకు అని అరుస్తాడు.

Karthika Deepam 2 May 11th 2024 Episode
Karthika Deepam 2 May 11th 2024 Episode

ఇంట్లో వాళ్ళందరూ నరసింహ చేసే గొడవ చూస్తూ ఆశ్చర్యపోతారు. బయటకు వెళ్ళమని దీపక్ కోపంగా చెబుతుంది. వాడు ఎలా పిలిస్తే రాడు ఎలా రప్పించాలో నాకు తెలుసని దీప జుట్టు పట్టుకుంటాడు. ఇక అప్పుడే కార్తీక్ వచ్చి నరసింహ మెడ పట్టుకుంటాడు. కార్తీక్ నరసింహని మెడ పట్టుకుని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు. కార్తీక్ వాడిని కొట్టబోతుంటే దీప ఆపుతుంది. దీపా మరియు కార్తికే అక్రమ సంబంధం అంటగడుతూ నరసింహ నోటికి వచ్చినట్లు వాగుతూ ఉంటాడు. అందరూ ఆశ్చర్యపోయి చూస్తారు. ఏ సంబంధం లేకుండా నా భార్య ని తీసుకుని నీ ఇంట్లో పెట్టుకున్నావా అని కార్తీక్ ని నిలదీస్తాడు నరసింహ. ఏ సంబంధం లేకుండా నువ్వు నన్ను గుడిలో కొట్టావా? ఏ సంబంధం లేకుండానే నా పెళ్ళాన్ని మరియు కూతురిని తీసుకుని షాపింగ్ కి వెళ్తున్నావా? అని సంబంధం లేకుండానే తన కూతురిని నీకు పుట్టిన కూతురుగా ఎత్తుకుని తిరుగుతున్నావా అని కార్తీక్ ని నిలదీస్తాడు నరసింహ.

Karthika Deepam 2 May 11th 2024 Episode
Karthika Deepam 2 May 11th 2024 Episode

రోడ్డు పక్కన చెట్ల కింద మీరు మాట్లాడుకోవడం నేను చూడలేదు అనుకుంటున్నావా? నేనే కాదు మా అమ్మ కూడా చూసింది. నిన్ను మొగుడు వదిలేస్తే ఏంటి నిన్ను చూసుకోవడానికి నేనున్నానని వీడు అన్నాడా లేదా అని నరసింహ నిలదీస్తాడు. కార్తీక్ కోపంగా నరసింహ కాలర్ పట్టుకుంటాడు. నువ్వు ఎక్కడ నుంచి పోయే వరకు నేను ఇలాగే అరిచి పెంట పెంట చేస్తానని అనేసరికి సుమిత్ర లాగిపెట్టి నరసింహాని కొడుతుంది. దేపని అంటే ఎక్కడికి పోతుందని అడుగుతుంది. వాడి ఇంటికే పోతుందని పారు అంటుంది. వీడు దేపని వదిలేసి ఇంకొక దాన్ని పెళ్లి చేసుకున్నాడని సుమిత్ర నిజం బయటపెడుతుంది. భర్త కోసం వెతుకుతూ వస్తే కానీ వీడి సంగతి తెలియలేదు. వీడు మోసం చేశాడని తెలిసి కాపురం వద్దనుకుని దూరంగా వెళ్లిపోవాలని అనుకుంటుంది. ఆ తర్వాత నా ప్రాణాలు కాపాడి మన ఇంటికి వచ్చింది. వీడు దీపని ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు.

Karthika Deepam 2 May 11th 2024 Episode
Karthika Deepam 2 May 11th 2024 Episode

ఈ పెద్దావిడకు మన సినిమా చూపించావా? ఇక నేరుగా మాట్లాడతాను. నా పెళ్ళాం మీ ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదు. నువ్వు ఉన్నఫలంగా కూతురిని తీసుకుని ఊరు వెళ్లిపో లేదంటే నేనే జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ తగిలించి పంపిస్తానని అనేసరికి సుమిత్ర మళ్ళీ ఒకటి పీకుతుంది. ఏంట్రా బెదిరిస్తున్నావ్ ఊరు వెళ్లకపోతే చంపేస్తావా దాన్ని అంటుంది. దీపా నా కూతురు తనకోసం నేను ఉన్నాను. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి అరెస్ట్ చేయించమని శివ నారాయణ దశరథ తో అంటాడు. నరసింహ మాత్రం దీపా మరియు కార్తీక్ గురించి తప్పుగా మాట్లాడుతూనే ఉంటాడు. ఇక నరసింహ కార్తీక్ చొక్కాలు పట్టుకుని తలపడతారు. నా గురించి ఎవరు ఎవరితో గొడవ పడాల్సిన అవసరం లేదని దీపం ఉంటుంది. నువ్వు ఊరు వెళ్ళిపోవాలి అదే పరిష్కారం అంటాడు నరసింహ. అక్కడ ఎవరు ఉన్నారని వెళ్లాలని అంటుంది దీప. ఇక్కడ ఎవరు ఉన్నారని నరసింహ అడుగుతాడు.

ఏంటి మాకు ఈ దరిద్రం మీ మాటలు వింటుంటే కంపరంగా ఉందని పారు కోపంగా అరుస్తుంది. నీ మొగుడిని తీసుకుని ఇక్కడి నుంచి పో అని అంటుంది. దీప ఎక్కడికి వెళ్ళదు. తనకు మనం తప్ప ఎవరూ లేరు. దీప నీతో రాదు వెళ్ళు అని సుమిత్ర అంటుంది. పోలీసులకు ఫోన్ చేసి చీటింగ్ కేసు పెడితే దాని బుద్ధి రాదని దశరథ కూడా తిడతాడు. దీప వద్దని అంటుంది. సుమిత్ర కుటుంబం మొత్తం దీపకు అండగా మాట్లాడుతుంది. వాడుని వెనుక ఉన్నాడనే ధైర్యంతోనే కదా ఇలా మాట్లాడుతున్నావ్. ఊరు వెళ్లకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు.. నిన్ను అయితే వదిలేదే లే అని దీపకు నరసింహ వార్నింగ్ ఇస్తాడు. దీప ఏడుస్తూ వెళ్ళిపోతుంది. కాంచన మరియు శ్రీధర్, సరదాగా ఉంటారు. మనం కొడుకుతోపాటు కూతురిని కూడా కానీ ఉంటే బాగుందని కాంచన అనగానే శ్రీధర్ కోపంగా మొహం పెడతాడు. అక్కడితో నేటి ఎపిసోడ్ కంప్లీట్ అయింది.

Related posts

Karthika Deepam 2 May 29th 2024: శౌర్యని కలిసిన నరసింహ.. దీపకి వార్నింగ్..!

Saranya Koduri

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Brahmamudi May 29 Episode 422: రుద్రాణి ఉచ్చులో చిక్కుకున్న అపర్ణ.. మాయతో రాజ్ పెళ్లికి కావ్య అంగీకరించనుందా?

bharani jella

Nuvvu Nenu Prema May 29 Episode 636: ఒకే ఆఫీసులో విక్కీ, పద్మావతి.. యశోదర్ మనసులో పద్మావతి.. సుగుణ సంతోషం.. విక్కీ కి ఫోన్ చేసిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 29 Episode 482:ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ముకుంద.. దేవుడి ఆగ్రహానికి గురైన అత్తా కోడలు.. మురారి మీద కంప్లైంట్ ఇచ్చిన ముకుంద..

bharani jella

Sarkar Promo: ఒక్కసారి నువ్వు అంటే బావ.. పిచ్చికుక్కలు కరిచినా నేను సావా.. సుధీర్ ఆకట్టుకునే డైలాగులతో సర్కార్ కొత్త ప్రోమో..!

Saranya Koduri

Web Series: బిల్ గేట్స్ కు ఎంతో ఇష్టమైన సిరీస్ ఇవే.. అందరూ చూడాలంటున్న ప్రపంచ కుబేరుడు..!

Saranya Koduri

Popular Pette Serial: రీ టెలికాస్ట్ అవుతున్న సీనియర్ నరేష్ – జంధ్యాల కాంబోలో వచ్చిన కామెడీ సీరియల్.. ఏ ప్లాట్ ఫారంలో అంటే..?

Saranya Koduri

36 Days Web Series: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మిస్టరీ క్రైమ్ సిరీస్.. గూస్బంస్ పుట్టిస్తున్న ట్రైలర్..!

Saranya Koduri

Aa Okkati Adakku OTT: ఈవారం ఓటీటీలో సందడి చేయనున్న అల్లరి నరేష్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri