NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Karthika Deepam 2 May 14th 2024 Episode: కార్తీక్ పై సీరియస్ అయిన శ్రీధర్.. జ్యోత్స్న కి నూరిపోసిన పారు..!

Karthika Deepam 2 May 14th 2024 Episode: నరసింహ జరిగిన అవమానం తెలుసుకుని రగిలిపోతూ ఉంటాడు. అక్కడ దాన్ని వాడు మాత్రమే కాదు అందరూ వెనకేసుకుని వస్తున్నారు. ముందు వాడు కొట్టాడు తర్వాత ఆ పెద్దావిడ కొట్టింది. ఆ తర్వాత ఇద్దరూ కలిపి కొట్టారని అంటాడు. చెప్తే వినకుండా వెళ్లి తన్నులు తిని వచ్చావని అనసూయ తిడుతూ ఉంటుంది. దీప జోలికి వెళ్ళొద్దని దాని బ్రతుకు ఏదో అది బతుకుతుంది అని అంటుంది. నేను ఈ ఇంట్లో ఉండగా అది మీ జోలికి రాదు. పెద్దావిడని కాపాడినందుకు వాళ్లందరూ దాన్ని నెత్తిన పెట్టుకుని చూస్తున్నారు. వాడు దీప ని తీసుకుని ఇంట్లో పెట్టుకోవడం వెనుక ఏదో ఉందని నాకు అర్థం అయింది. నువ్వు ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకుంటే డబ్బున్న వాళ్ళు కేసులు పెడతారు ఇంకేమైనా చేస్తారని అనసూయ భయపడుతుంది.

Karthika Deepam 2 May 14th 2024 Episode
Karthika Deepam 2 May 14th 2024 Episode

కానీ నరసింహ మాత్రం దాన్ని వదిలిపెట్టేది లేదని అనసూయతో కోపంగా చెబుతూ ఉంటాడు. కార్తీక్ నరసింహ మాటలు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కాంచన వచ్చి ఏం ఆలోచిస్తున్నావ్ అంటుంది. శ్రీధర్ కోపంగా మాట్లాడుతాడు. జ్యోత్స్న ఫోన్ చేసిందని చెబుతాడు. నీకు ఆ రోజే చెప్పాను అనవసరమైన విషయాల్లో తల దూర్చొద్దని. నువ్వు మా గురించి ఆలోచించకపోయినా పరవాలేదు కోడలి గురించి ఆలోచించమని చెబుతాడు. మొదటిసారి కోడలు ఏడుపు విన్నాను. తనని బాధ పెట్టొద్దని కాంచన కూడా కార్తీక్ కి చెబుతుంది. దీప విషయంలో కార్తీక్ ని శ్రీధర్ తప్పు పడతాడు. తప్పు చేస్తున్నావ్ నువ్వు లండన్ లో ఉన్నప్పుడు బావ ఎప్పుడు వస్తాడని ఆనందంగా ఉండేది. కానీ నువ్వు ఇప్పుడు కళ్ళముందు ఉంటూ దాన్ని కన్నీళ్లు పెట్టిస్తున్నావని అంటాడు.

Karthika Deepam 2 May 14th 2024 Episode
Karthika Deepam 2 May 14th 2024 Episode

జ్యోత్స్న ఏడుపు నేను చూడలేను. ఎందుకంటే అది మా అమ్మ. మా నాన్న తనకు నా పేరు పెట్టాడు. మేం దాన్ని ఎంతో అపురూపంగా చూసుకుంటే నువ్వు దాన్ని ఏడిపిస్తున్నావు అని అంటారు. వీడికి ఎన్ని చెప్పినా అనవసరం బావతో మాట్లాడి వీళ్ళిద్దరికీ పెళ్లి ముహూర్తాలు పెట్టించాల్సిందే రేపే ఆ పని చేస్తానని శ్రీధర్ తెగేసి చెబుతాడు. మీకు ఒక విషయం చెప్తాను అప్పటివరకు మీరు పెళ్లి విషయంలో తొందర పడొద్దు అని కార్తీక్ తండ్రిని రిక్వెస్ట్ చేస్తాడు.‌ జ్యోత్స్న రగిలిపోతుంటే పారు వచ్చి మరింత ఆద్యం పోస్తుంది. మగాడు పెళ్లి కానీ పిల్ల వెంట పడితే అది ప్రేమ అవుతుంది. అదే పెళ్లయిన దాని వెంట పడితే మంచిది కాదు. నీ బావ వాడిని చేసుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం రాదు.

అది దీపం ఉంటే జరగదు. అది వెళ్ళిపోతే మీ పెళ్లి సంగతి చూడు. మీ ఇంట్లో ఏం జరగాలంటే మీ అమ్మ దగ్గర నీ బావని రెట్టింపు చేసి చూపించు. ఇప్పుడు నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. చెయ్ జారకం ముందే జాగ్రత్త పడమని పారు చెబుతుంది. షావరిని స్కూల్లో చేర్పిస్తామని దీప చెప్తుంది. రేపటి నుంచి నేను వంట పని చేయడానికి వెళుతున్నాను ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఆడుకోమని చెబుతుంది. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదా అని శౌర్య అడుగుతుంది. జో,జో గ్రానీ నాతో మాట్లాడడం లేదు వాళ్లకి మనం ఇక్కడ ఉండటం ఇష్టం లేదా అని శౌర్య దీపని అడుగుతుంది. మనం కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్లి పోదామా? తాను నాతో మాట్లాడతాడు నన్ను ప్రేమగా చూసుకుంటాడు.

Karthika Deepam 2 May 14th 2024 Episode
Karthika Deepam 2 May 14th 2024 Episode

నీలాగే అని చెప్తుంది శౌర్య. దీప శౌర్యని కోపంగా తిడుతుంది. అందరి గురించి చెప్తే కోప్పడలేదు కానీ కార్తీక్ గురించి చెప్పే సరికి ఎందుకు కోప్పడుతున్నావని అడుగుతుంది. తను నిన్నేమైనా బాధపెట్టాడా? అని నిలదీస్తుంది. దేవ మాత్రం మౌనంగా ఉంటుంది. దీప హోటల్ లో పనిచేస్తుంది. హోటల్ వ్యాపారం బాగా నడిచేందుకు దీప వేసిన ఐడియా బాగా పనిచేస్తుంది. దీప చేసిన ఉప్మా బాగుందని కస్టమర్స్ మెచ్చుకుంటారు. కార్తీక్ దీప పని చేస్తున్న హోటల్ దగ్గరకు వస్తాడు. ఎలాగైనా దీపా తన కాళ్ళ మీద నిలబడినందుకు సంతోషపడతాడు. కార్తీక్ ని చూసి దీపా మొహం కోపంగా పెడుతుంది. హోటల్లో కస్టమర్ లాగా వచ్చానని చెబుతాడు కార్తీక్. దీప చేసిన వంటని నేర్చుకుంటాడు. ఏదైనా సాయం కావాలంటే తనని అడగమని అంటే వద్దని కోపంగా చెబుతుంది దీప. అక్కడితో నేటి ఎపిసోడ్ కంప్లీట్ అయింది.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri