NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Karthika Deepam 2 May 18th 2024 Episode: ఊర్లో కార్తీక్ సైకిల్ బహుమతిగా ఇచ్చాడని శౌర్య చెబుతూ ఉంటుంది. అది విని పారు షాక్ అవుతుంది. దీప శౌర్యని ఆపడానికి చూస్తుంది. కానీ పారు ఆగదు. కార్తీక్ మా ఊరు జాతరకు వచ్చాడు పోటీలో గెలిచినందుకు సైకిల్ ఇచ్చాడని అంటుంది. కార్తీక్ కి దీప ఇక్కడికి రావడం కంటే ముందే తెలుసు. వీరిద్దరికీ ముందే పరిచయం ఉంటే ఏం తెలియనట్టు ఎందుకు నటిస్తున్నారని అనుకుంటుంది. మీ ఫ్రెండ్ ఎప్పుడైనా ఊర్లో ఉంటున్న మీ ఇంటికి వచ్చాడా అని పారు శౌర్యని అడుగుతుంది. దీప కోపంగా పారిజాతం గారు అని అరుస్తుంది. నేను పోటీలో గలిచాను ఇచ్చారు. మిగతా విషయాలు ఏదైనా కావాలంటే ఇచ్చిన వాళ్ళని అడగండి అంటుంది. శౌర్యం ముందు మీకు మర్యాద చేస్తే బాగోదు ఇక మీరు వెళ్ళండి అంటుంది.

Karthika Deepam 2 May 18th 2024 Episode
Karthika Deepam 2 May 18th 2024 Episode

పాత పరిచయాలు కూడా ఉన్నాయన్నమాట మరి తెలియనట్టు నాటకాలు ఎందుకో అని దెప్పిపడుతుంది పారు. జాతరకేనా పోయిన జాతరకు కూడా వచ్చాడా అని అడుగుతుంది. మీకు కావాలంటే అడగాల్సిన వాళ్ళని అడగండి లేదంటే నాలుక సరిచేసి పంపిస్తానని దీప వార్నింగ్ ఇస్తుంది. పారు బంటుని కలుస్తుంది. దీప ఊరు వెళ్లావు కదా ఏం జరిగిందో చెప్పమని అడుగుతుంది. బంటు తెలిసిన విషయాల గురించి చెబుతాడు. కార్తీక్ కి దీపకి ఇక్కడికి రాకముందే పరిచయం ఉందని సైకిల్ బహుమతిగా కూడా ఇచ్చాడని పారు చెబుతుంది. ఇవన్నీ మీకు ఎలా తెలుసు మీరు వాళ్ళ ఊరు వెళ్లారా అంటాడు బంటు. అంటే నువ్వు వెళ్లలేదా అని బంటు ని అంటుంది. నరసింహ అన్నది నిజమే కార్తీ, దీప కు మధ్య సంబంధం ఉంది. ఈ విషయం తెలిస్తే జ్యోత్స్న బాధపడుతుంది. అది కోపంతో బావని పెళ్లి చేసుకోకపోతే నష్టం తనకేనని చెబుతుంది.

ముత్యాలమ్మ గూడెం వెళ్లి కార్తీక్ మరియు దీప గురించి మొత్తం తెలుసుకుని రమ్మని చెబుతుంది. వాళ్ల కథ ఏంటో తెలిస్తేనే కార్తీక్ శౌర్యని సొంత కూతురులా చెయ్యి పట్టుకుని ఎందుకు తీసుకెళ్తున్నాడో తెలుస్తుందని అంటుంది. కార్తీక్ శౌర్యని తీసుకుని స్కూల్కి వెళ్తాడు. స్కూల్లో పిల్లలు చేరాలంటే వాళ్ళ పేరెంట్స్ బాగా చదువుకుని ఉండాలని ప్రిన్సిపల్ మళ్ళీ చెప్తాడు. కార్తీక్ ప్రిన్సిపల్ తండ్రిని తీసుకుని వస్తాడు. మీ నాన్న ఏం చదువుకోలేదు కదా అయితే మీకు ప్రిన్సిపల్ అయ్యే అర్హత లేదని అంటాడు. దీంతో ప్రిన్సిపల్ సౌర్యని స్కూల్లో అడ్మిషన్ ఇస్తానని అంటాడు. జాలిపడి సీటు ఇవ్వద్దు అందరి పిల్లలకు పెట్టినట్లు టెస్ట్ పెట్టి స్కూల్లో జాయిన్ చేసుకోమని చెబుతాడు. స్కూల్లో శ్రీవాణి అనే మేడం కార్తీక్ ని చూసి జ్యోత్స్న బావ అని గుర్తు పడుతుంది. వెంటనే జ్యోత్స్న కి ఫోన్ చేసే ఈ విషయం చెబుతుంది. కోపంగా పారు దగ్గరకు వెళ్లి నువ్వు అన్నట్లు నిజమైంది.

Karthika Deepam 2 May 18th 2024 Episode
Karthika Deepam 2 May 18th 2024 Episode

శౌర్యని స్కూల్లో జాయిన్ చేయడానికి తీసుకెళ్లాడని చెబుతుంది. పారు జ్యోత్స్న నీ తీసుకుని స్కూల్ దగ్గరికి వస్తుంది. ఆవేశంగా పెళ్లి అడుగుదామని జ్యోత్స్న అంటే వద్దని వస్తుంది. అప్పుడే స్కూల్ దగ్గరకు నరసింహ కూడా వస్తాడు. కార్తీక్ ని చూస్తాడు. ఇక అప్పుడే సవ్య సంతోషంగా కార్తీక్ దగ్గరకు వస్తుంది. టెస్ట్ రాశాను పాస్ అయ్యానని చెబుతుంది. దీంతో కార్తీక్ సంతోషంగా శౌర్యకు ముద్దు పెడతాడు. నా పెళ్ళానికి నీకు ఉన్న సంబంధాన్ని బయట పెట్టానని దీన్ని స్కూల్లో చేర్పించడానికి వచ్చావా అనుకుని నరసింహ ఆవేశంతో ఊగిపోతాడు. అటెండర్ వచ్చి ప్రిన్సిపల్ దగ్గరకు వెళ్లకుండా ఆపుతాడు. శౌర్య గురించి మాట్లాడుతాడు. పాప నిన్న వాళ్ళ అమ్మతో వచ్చింది. పాప తండ్రి అనుకున్నా కానీ కాదని చెప్తాడు. ప్రిన్సిపల్ దగ్గర ఏం జరుగుతుందో తెలుసుకుని చెప్పమని పురమయిస్తాడు నరసింహ. కార్తీక్ అప్లికేషన్ ఫామ్ లో ఫాదర్ గా తన పేరును రాస్తాడు. అక్కడితో నేటి ఎపిసోడ్ కంప్లీట్ అయింది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella