NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Karthika Deepam 2 May 30th 2024: నరసింహ ని హోటల్ నుంచి తరిమికొట్టిన కడియం.. కార్తీక్ మాస్టర్ ప్లాన్ అదుర్స్..!

Karthika Deepam 2 May 30th 2024: సుమిత్రాను పొరపాటున శ్రీధర్ కావేరి అని పిలుస్తాడు. కావేరి ఎవరని అనేసరికి హడావిడిగా పని ఉందని చెప్పి తప్పించుకుని వెళ్ళిపోతాడు. ఇక నరసింహ భారీ నుంచి ఎలా తప్పించుకోవాలో అని దీపా ఆలోచిస్తూ ఉండగా హోటల్ కి వస్తాడు నరసింహ. కడియం నరసింహ దగ్గరకు వెళ్లి మళ్లీ ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. హోటల్ కి ఎందుకు వస్తారని దురుసుగా మాట్లాడుతాడు నరసింహ.‌ దీప నిన్ను వెంటాడడమే పనిగా పెట్టుకున్న నిన్ను ఎవడు కాపాడతాడు చూస్తానని నరసింహ అనుకుంటాడు. కార్తీక్ కి అప్పుడే స్కూల్ నుంచి మెసేజ్ వస్తుంది. స్కూల్లో సింగింగ్ అండ్ స్పోర్ట్స్ కాంపిటీషన్ ఉందని ఆ విషయం దీపకు చెప్పడానికి హోటల్ దగ్గరకు వెళ్లాలని అనుకుంటాడు. నరసింహ హోటల్లో ఉండదా కార్తీక్ వచ్చేతానని చూస్తాడు.

Karthika Deepam 2 May 30th 2024
Karthika Deepam 2 May 30th 2024

ఎందుకు వచ్చావని దీప అడుగుతుంది. నీ కూతురు స్కూల్లో చదవడం, నువ్వు ఈ హోటల్లో పని చేయడం నాకు ఇష్టం లేదు. నువ్వు దాన్ని తీసుకుని నా కంటికి కనిపించనంత దూరం వెళ్లిపో అని చెబుతాడు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తానని వార్నింగ్ ఇస్తాను. వాడిని ఇలాగే వదిలేస్తే గొడవ చేసేలాగా ఉన్నాడని కార్తీక్ అనుకుంటాడు. కస్టమర్లు ఉన్నారు వెళ్లిపోమని దీప చెప్పిన కూడా వినిపించుకోకుండా అలాగే కూర్చుని ఉంటాడు. కార్తీక్ కడియానికి ఫోన్ చేసి ఏదో మాట్లాడుతాడు. నేను నిన్ను ఇక్కడ ప్రశాంతంగా బతకనివ్వను. స్టేషన్లో నేను పడిన దెబ్బకు నేను ఎంత బాధ పడతానో అంతకంటే నిన్ను పది రెట్లు బాధ పెడతానని చెబుతాడు. కడియం నరసింహాని వెళ్ళమని చెప్తాడు. దెబ్బ కొట్టకపోతే వినేలా లేడని నరసింహ కొట్టబోతుంటే కొట్టినట్టుగా కడియం కింద పడిపోతాడు.

వీడు ఎవడో మా దీపం అని ఏడిపిస్తున్నాడని కడియం డ్రామా వేస్తాడు. దీంతో హోటల్లో ఉన్న కస్టమర్లు నరసింహ మీద గొడవకు దిగుతారు. మళ్లీ దీపమ్మ జోలికి వస్తే మర్యాదగా ఉండదని కడియం వార్నింగ్ ఇస్తాడు. దీంతో నరసింహ తోక ముడుచుకుని వెళ్ళిపోతాడు. నావల్ల మీ వ్యాపారం దెబ్బతింటుంది ఏమో వేరే చోట పని చేసుకుంటానని చెప్పి దీపా కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడే కార్తీక్ హోటల్ లోకి వస్తాడు. ఎందుకు వచ్చారని అడుగుతుంది. మీ కోసమే అంటే నాకోసం ఇక్కడికి రావద్దు. నాకు ఏమైనా చెప్పాలనుకుంటే సుమిత్ర గారికి చెప్పమని చెప్తుంది. స్కూల్లో ఆటలు పోటీలు పాటల పోటీలు పెడుతున్నారట. రౌడి పేరు ఇచ్చిందో లేదో తెలియదు.‌ అది చెప్పడానికి వచ్చానని చెప్పేసి వెళ్ళిపోతాడు. మీకు గొడవ అంటే భయం కదా నరసింహ కొట్టకుండానే కొట్టినట్లు నాటకం ఆడి ఎలా బయటకు పంపించేసారని దీప కడియాన్ని అడుగుతుంది.

నీకు ఏమైనా జరిగితే ఊరుకుంటానా అని అంటాడు. కానీ దీప మాత్రం నమ్మదు కార్తీక్ చెప్పడం వల్లే చేశాడని అర్థం చేసుకుంటుంది. దీప నరసింహ మాటలు గుర్తు చేసుకుని బాధపడుతుంది. వాడు నన్ను ఏం చేయలేక నా మీద కోపంతో నేనే నీ తండ్రిని అని పాపకు చెప్పేస్తే పరిస్థితి ఏంటని దీప అనుకుంటుంది. శౌర్య వచ్చి రేపు స్కూలుకి వెళ్లాలని అంటుంది. ఈరోజు బూచోడు స్కూల్ కి వచ్చినట్టు రేపు వస్తే ఎలా? ఈరోజు వచ్చినట్టు రోజు నువ్వు రాలేవు కదా. నువ్వు లేనప్పుడు నన్ను ఎత్తుకెళ్లి పోతాడని శౌర్య భయపడుతుంది. సారీ తమ ఆరోజు నేను పూలు కోయడం వల్లే కదా గొడవ పడింది. నేను ఉండగా నీ దగ్గరకు ఏ బూచోడిని రానివ్వనని అంటుంది. బూచోడు మా జోలికి రాకూడదు అంటే మనం నాన్నని వెతికి తీసుకొద్దాము అప్పుడు వాడు మన జోలికి రాడని అమాయకంగా చెబుతుంది శౌర్య. జోక్ కి నాన్న ఉన్నాడు అందుకే ఎవ్వర్నీ రానివ్వడు.

Karthika Deepam 2 May 30th 2024
Karthika Deepam 2 May 30th 2024

నాకు నాన్న ఉంటే ఎవరిని రానివ్వడు కదా. చెప్పు మనం నాన్నని వెతికి తీసుకొద్దామని అడుగుతుంది. ఎక్కడికో వెళ్ళాడు అని చెప్పాను కదా అని దీపా సర్ది చెబుతుంది. అయితే బూచోడి గురించి కార్తీక్ కి చెప్తాను తనకు నేనంటే చాలా ఇష్టం కదా బూచోడిని ఊరుకోడని వెళ్లబోతుంటే దీప కూతురిని ఆపి తిడుతుంది. దీప తన పరిస్థితి తలుచుకుని బాధపడుతుంది. ఇక శ్రీధర్ కావేరితో ఫోన్ మాట్లాడుతుండగా కార్తీక్ వస్తాడు. కొడుకుని చూసి కంగారుగా ఫోన్ కట్ చేస్తాడు. ఏమైంది మాస్టారు నన్ను చూసి కంగారుగా కాల్ కట్ చేశావు. ఫోన్లో ఎవరని అడుగుతాడు. ఏదో జనరల్ కాల్ అని అంటాడు. ఎవరో నేను చూస్తానని చెప్పి కార్తీక్ తండ్రి ఫోన్ తీసుకుంటాడు. నాకు తెలియని సీక్రెట్ చేయమున్నాయి నీ దగ్గర అయితే నువ్వు మాట్లాడిన నెంబర్ కి నేను కాల్ చేసి మాట్లాడతానని కార్తీక్ అనేసరికి శ్రీధర్ షాక్ అవుతాడు. అక్కడితో నేటి ఎపిసోడ్ కంప్లీట్ అయింది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella