NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Karthika Deepam 2 May 31th 2024: తన గానంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న దీప.. భర్త అంటే మీలా ఉండాలి అని శ్రీధర్ ను మెచ్చుకున్న కార్తీక్..!

Karthika Deepam 2 May 31th 2024: శ్రీధర్ కావేరీ తో ఫోన్ మాట్లాడుతూ ఉండగా కార్తీక్ రావడంతో కాల్ కట్ చేస్తాడు. ఎవరితో మాట్లాడుతున్నావు అని ఫోన్ తీసుకునేసరికి శ్రీధర్ టెన్షన్ పడుతూ ఉంటాడు. నువ్వు మాట్లాడిన నెంబర్ కి ఫోన్ చేసి మాట్లాడతానని కాసేపు ఆటపట్టిస్తాడు కార్తీక్. బిఫోర్ మ్యారేజ్ ని లైఫ్ లో ఎటువంటి లవ్ ట్రాక్ లేదా అని కార్తీక్ అడుగుతాడు. ఉందని చెప్తాడు శ్రీధర్. కాంచన అని మీకు వరుసకు అమ్మ అవుతుందని చెప్పి తప్పించుకుంటాడు. అమ్మకి ఫోన్ చేసి భోజనం చేసిందేమో కనుక్కోమని అంటాడు. భర్త అంటే మీలా ఉండాలి.

Karthika Deepam 2 May 31th 2024
Karthika Deepam 2 May 31th 2024

నేను ఇంతవరకు మీ అంత మంచి భర్తని చూడలేదు. నేను కూడా నా భార్య మీద ఇలాంటి ప్రేమ చూపించలేను ఏమోనని తండ్రిని మెచ్చుకుంటాడు కార్తిక్. నేను చేసిన తప్పు తెలిస్తే లైఫ్ లో నాలాంటి భర్తను చూడలేదని అనుకుంటావు ఎప్పటికీ నీకు నిజం తెలియకూడదని శ్రీధర్ అనుకుంటాడు. దీపశౌర్య కి ప్రేమగా అన్నం తినిపిస్తూ ఉంటుంది. తాతయ్య కూడా ఇలాగే నీకు బువ్వ తినిపించేవాడా అని శౌర్య అడుగుతుంది. అవును చాలా ప్రేమగా చూసుకునేవాడు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది దీప. తాతయ్య లేకపోతే ఏమి నేను నిన్ను తాతయ్య లాగా చూసుకుంటానని చెప్పి తల్లికి అన్నం తినిపిస్తుంది శౌర్య. కూతురి ప్రేమకు మురిసిపోతుంది దీప.

స్కూల్లో ఆటలు మరియు పాటల పోటీలు పెడుతున్నారు అంట ‌ మా మిస్ చెప్పింది అంటే ఆటల పోటీకి పేరు ఇచ్చావా అంటే లేదు ఈ బుజ్జి బొజ్జతో పరిగెత్తలేను కదా అని అంటుంది. పాటల పోటీకి పేరు ఇచ్చానని పాట నేర్పించమని అడుగుతుంది. నువ్వు వంట చేసినప్పుడు పాడే పాట నేర్పించు. అది పాడితే నేను పోటీలో గెలుస్తానని శౌర్య తల్లిని బ్రతిమాలుతుంది. కొత్త పుస్తకాల మీద పేరు రాయమని దీపని అడుగుతుంది. రైటింగ్ బాగుందని శౌర్యం మెచ్చుకుంటుంది. గుండ్రంగా రాసే వాళ్లకు మంచి మనసు ఉంటుందని దీప అంటుంది. అయితే కార్తీక్ కి మంచి మనసు ఉంది. స్కూల్ అప్లికేషన్ రాసేటప్పుడు చూసానని చెప్తుంది.

దీంతో దీప నరసింహ పాప తండ్రి కార్తీక్ అన్న విషయం తలుచుకుని కోపంగా ఉంటుంది. శౌర్య ఏమైందని అడిగితే ఏం లేదని మాట దాటేస్తుంది. ఇక స్కూల్లో పాట పాడేందుకు పాట నేర్పించమని అడుగుతుంది. దీప పాట పాడే టైంకి కార్తీక్ వస్తాడు. దీప పాటలు కూడా పాడుతుందా అని తనని అలానే చూస్తూ ఉండిపోతాడు. గొంతు చాలా బాగుంది సందర్భం వచ్చినప్పుడు తనని మెచ్చుకోవాలని అనుకుంటాడు. జ్యోతన అత్త కాంచన దగ్గర కూర్చుని సరదాగా మాట్లాడుతుంది. కాంచన ఆవకాయ పచ్చడి పెట్టాలని సుమిత్రాను అడుగుతుంది.

Karthika Deepam 2 May 31th 2024
Karthika Deepam 2 May 31th 2024

దీపను పిలిపించి పచ్చడి పెట్టమని అడుగుతుంది. తనని చూసి జో అసహ్యించుకుంటుంది. ఎవరిని ఎలా బుట్టలో పడేయాలో నీకు బాగా తెలుసు దీప అని జోక్ తిట్టుకుంటుంది. కార్తీక్ తల్లిని ఇంటికి వెళ్దామని అడుగుతాడు. బావ నిన్న ఎందుకు అలా ఉన్నాడు. వచ్చేటప్పుడు బాగానే ఉన్నాడు కానీ తర్వాత బాగా టెన్షన్ పడ్డాడు. ఏమైందని దశరథ కార్తీక్ ని అడుగుతాడు. ఆయన వెళ్లిపోయింది నా గురించి రెండో భార్య గురించి ఎక్కడ చెప్తానోనని వెళ్లిపోయారని దీపా అనుకుంటున్నాను. ఇక్కడే ఉంటే ఆయన రహస్యం ఎక్కడ బయట పడుతుందోనని వెళ్లిపోయారని హార్దిక్ సరదాగా అంటాడు. దీంతో దీప వెంటనే తన వైపు చూస్తుంది. అక్కడితో నేటి ఎపిసోడ్ కంప్లీట్ అయింది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella