NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Karthika Deepam April 22th 2024: అందరి ముందు పారిజాతానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన దీప.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన బంటు..!

Karthika Deepam April 22th 2024: అనసూయ తన ఇంటిని వేలానికి వెయ్యోద్దని ఊరి ప్రెసిడెంట్ ని బ్రతిమాలు కొంటూ ఉంటుంది. ఒక వారం రోజులు టైం ఇవ్వమని బాధపడుతుంది. ఒకవేళ రాకపోతే అప్పుల వాళ్ళం అందరం కలిసి ఇల్లు వేలం వేసుకుంటాం. దీనికి సరే అంటేనే వెళ్లాలి లేదంటే ఇల్లు వేలం వేస్తామని మల్లేష్ అంటాడు. అనసూయ కన్నీళ్ళతో అందుకు సరే అని ఒప్పుకుంటుంది. అలా అని చెప్పి కాగితాల మీద అనసూయతో వేలు ముద్ర వేయించుకుంటాడు. ఇక అనసూయ కి డబ్బులు ఇచ్చి హైదరాబాద్ పంపించమని ప్రెసిడెంట్ చెబుతాడు. దీప, సుమిత్ర అందరూ కలిసి గుడికి వెళ్తారు. దీప పేరు మీద కూడా అర్చన చేయించమని సుమిత్ర చెబుతుంది. గోత్రం వివరాలు చెప్పమని పూజారి అడిగితే తనకు అవేవీ తెలియదని అంటుంది.

Karthika Deepam April 22th 2024
Karthika Deepam April 22th 2024

తల్లిదండ్రుల పేర్లు చెప్పమంటే తన తండ్రి పేరు కుబేర అని చెబుతుంది. అబ్బో పేరు గొప్ప ఊరు దిబ్బ అంటే ఇదేనేమో ఏమి లేకపోయినా పేరు పెట్టుకున్నారా అంటూ పారిజాతం తన నోటు దులుసును చూపిస్తుంది. దీప కోపంగా పారిజాతం గారు అని అరుస్తుంది. మా నాన్న ధనానికి పెద్దవాడు కాకపోవచ్చు కానీ నా మీద ప్రేమ పంచడంలో ఎప్పుడు కుబేరుడే.‌ నన్ను అనండి పడతాను కానీ మా నాన్న గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం క్షమించేదే లేదు అని పారిజాతానికి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది దీప. ఇది పైకి ప్రశాంతంగా కనిపించే అగ్నిపర్వతం అనిపిస్తుంది. ఇది పడుతున్న బాధలు తెలుసుకుని సాయం చేయాలని సుమిత్ర మనసులో అనుకుంటుంది.

గుడిలో గంట కొట్టేందుకు శౌర్య ఎగురుతుంటే కార్తీక్ ఆటపట్టిస్తాడు. తను చిటికే వేస్తే అందుతుందని శౌర్య అంటుంది. చిటికే వేస్తూ కార్తీక్ అని పిలుస్తుంది. వెంటనే కార్తీక్ వచ్చి తనని ఎత్తుకుని గంట కొట్టిస్తాడు. దీప గుడిలో ప్రదక్షిణాలు చేస్తుంటే సుమిత్ర మీద దాడి చేసిన వాడు కనిపిస్తాడు. వాడితో బంటు మాట్లాడుతూ ఉండడం దీప చూస్తుంది. పరుగున సుమిత్ర వాళ్లు దగ్గరకు వెళ్లి గుడిలో మిమ్మల్ని చంపాలనుకున్న వాడిని చూసానని చెబుతుంది. బంటు మాట్లాడుతుంటే చూసానని అంటే కార్తీక్ వెంటనే బయటకు వస్తాడు. కానీ అక్కడ బంటు మాత్రమే ఉంటాడు. కార్తీక్ ని చూసి ఫోన్ మాట్లాడుతున్నట్టు నటిస్తాడు. ఇప్పటివరకు నీతో మాట్లాడిన వాడు ఎక్కడని బంటు ని కార్తీక్ కోపంగా అడుగుతాడు. గుడిలో అమ్మాయిగారిని కొట్టబోయిన మనిషి వాడే, వాడితో నువ్వు మాట్లాడవు కదా అని దీప అంటుంది. వాడు వెళ్లిపోయాడని బంటు చెబుతాడు.

Karthika Deepam April 22th 2024
Karthika Deepam April 22th 2024

అంటే నువ్వు మాట్లాడవని అర్థం వాడికి నీకు ఏంటి సంబంధం అని కార్తీక్ బంటును కాలర్ పట్టుకుని అడుగుతాడు. పారిజాతం కావాలని కార్తీక్ ని తప్పించి బంటు చంప పగలగొడుతుంది. ఫోన్ మాట్లాడుతూ బయటకు వచ్చాను హాస్పిటల్ ఎక్కడని అడిగాడని అబద్ధం చెబుతాడు. వీడు చెప్పేది నిజం అయితే వాడు మనల్ని ఫాలో చేస్తున్నాడు. మన శత్రువులు ఎక్కడో లేరత్త మన చుట్టూ ఉన్నారని కార్తీక్ వెంటనే వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతాడు. దీప బంటును అనుమానంగా చూస్తుంది. ఈ దీప ఉంటే నాకు ఎప్పటికైనా ప్రమాదమేనని కంగారు పడతాడు. ఇంటికి వచ్చిన తరువాత పారు.. బంటు మీద చిందులేస్తుంది. కాసేపు వాడిని తిడుతుంది. నేను ఏం చేసినా మీ పెదవులు మీద చిరునవ్వు కోసమేనని అంటాడు. మీకోసం సుమిత్రాన్ని వేసేయాలని అనుకున్నాను. ఎవ్వరు లేని ఆ దీపని వేసేయడం ఎంతసేపు అంటాడు. దీంతో పారు వణికిపోతుంది. ఇప్పటికీ చేసింది చాలు దీని గురించి ముందు బయట పడాలని అంటుంది. దీప కష్టం ఎలాగైనా తెలుసుకోవాలని సుమిత్ర ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడితో నేటి ఎపిసోడ్ కంప్లీట్ అయింది.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri