NewsOrbit
Telugu TV Serials

Karthika Deepam August 03 Episode: నిరూపమ్ ను కాదని ప్రేమ్ ప్రేమను హిమ ఒప్పుకుంటుందా..??

Karthika Deepam August 03 Episode:బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. గత ఎపిసోడ్ లో సౌర్య, నిరుపమ్ ఒకే గదిలో ఉండిపోతారు. గది బయట ప్రేమ్, హిమలు ఉండడంతో ఈరోజు ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా ముందుకు సాగిందనే చెప్పాలి.ఇక ఈరోజు ఆగస్ట్ 3వ తేదీన ప్రసారం కానున్న 1421ఎపిసోడ్ కార్తీకదీపం సీరియల్లో ఏం జరుగుతుందో ముందుగానే తెలుసుకుందాం..ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనో ఆకలి అని చెప్పడంతో ప్రేమ్ ఇద్దరికి కలిపి కేవలం ఒక భోజనం పాకెట్ మాత్రమే తెస్తాడు. అది సౌర్య తీసుకుని నిరుపమ్ కి ఇవ్వకుండా తింటుంది. మరోవైపు ప్రేమ్,హిమలు కూడా ఒక ప్లేట్ భోజనాన్ని ఇద్దరు పంచుకుంటారు.గదిలో సౌర్య నిరూపమ్ కు నోరూరిస్తూ తింటూ ఉంటుంది. చివరాకరికి ఆ భోజనంను నిరూపమ్ తో కలిపి పంచుకుంటుంది.

నిరూపమ్ తో కలిసి భోజనం పంచుకున్న సౌర్య:

Karthika Deepam August 03 Episode:
Karthika Deepam August 03 Episode

సౌందర్య దెబ్బకు బేంబేలెత్తిపోయిన హిమ, శోభ, స్వప్న… ముగ్గురు నోటా నో సౌండ్..!!

ఈ క్రమంలోనే సౌర్యకు పోలమారాడంతో నిరూపమ్. సౌర్య తలపై తట్టి నీళ్లు తాగిస్తాడు. మరో. పక్క బయట ప్రేమ్,హిమలు చల్లగాలిలో భోజనం చేస్తూ సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు.ఇక. నిరూపమ్ శౌర్యని చూసి నేను అనుకుంటున్నంత చెడ్డ పిల్ల కాదు శౌర్య అనుకుంటాడు. అదే సమయంలో శౌర్య  నిరుపమ్ ని చూస్తూ మనిద్దరం ఒకే గదిలో కలిసి భోజనం పంచుకుంటున్నాము కానీ మీతో నా జీవితం పంచుకోలేకపోయాను అని మనసులో బాధపడుతుంది.

ప్రేమ్ తనని ప్రేమిస్తున్నాడన్న విషయం తెలుసుకున్న హిమ :

Karthika Deepam August 03 Episode:
Karthika Deepam August 03 Episode Full Episode

మరొకవైపు ప్రేమ్ హిమని ఎలాగైనా పడగొట్టాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. హిమను ఇంప్రెస్ చేయడానికి ప్రేమ్ ఆ రాత్రి పూట చలిమంట పెడతాడు. చలిమంట ఎందుకు పెట్టావు బావ అనగా వాతావరణం చాలా బాగుంది అని పెట్టాను అంటాడు.అప్పుడు హిమ నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారో కానీ ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అని అంటుంది.నేను ఒకరిని ప్రేమిస్తున్నాను అని ప్రేమ్ చెప్పగా ఎవరు ఆ అమ్మాయి అని హిమ ఉత్సాహంతో అడుగుతుంది.ఇప్పుడు కాదు త్వరలోనే చెప్తాను అని అంటాడు ప్రేమ్. గదిలో నిరూపమ్,శౌర్యలు ఏం చేస్తున్నారో అని ప్రేమ్ చూడడానికి వెళ్తూ తన ఫోన్ అక్కడే వదిలేస్తాడు. ప్రేమ్ ఫోన్ తీసుకున్న హిమ అందులో తనకి ప్రపోజ్ చేస్తున్న వీడియో చూసి షాక్ అవుతుంది. ఈ లోగా ప్రేమ్ అక్కడికి  వచ్చి నాకేమైనా ఫోన్లు వచ్చాయా అని హిమని అడుగుతాడు. హిమ ఆ వీడియో చూపిస్తుంది. ప్రేమ్ జరిగిందంతా చెప్పేస్తాడు.అంతా విన్న హిమ అక్కడ్నుంచి వెళ్లిపోతుంటే హిమను ప్రేమ్ ఆపి సమాధానం చెప్పవేంటి అని అడుగుతాడు.అప్పుడు హిమ జీవితంలో మనం అనుకున్నవన్నీ జరగవు బావ… అదే జీవితం అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

సౌర్యను ఏడిపించిన నిరూపమ్ :

Karthika Deepam August 03 Episode Full Episode
Karthika Deepam August 03 Episode Full Episode Highlights

సీన్ కట్ చేస్తే నిరూపమ్ సోఫా మీద సౌర్య కింద నేల మీద పడుకుంటారు. అప్పుడే శౌర్యకు చలి వేస్తుందని గ్రహించిన నిరూపమ్ తన దుప్పటిని. సౌర్యకు ఇస్తాడు. అది చూసి బయటనుంచి హిమ ప్రేమ్ లు ఆనందపడతారు. ఈలోగా శౌర్య లేచి ఆ దుప్పటిని తిరిగి నిరూపమ్ కి కప్పుతుంది.మేము పేదవాళ్ళం ఇవన్నీ మాకు అలవాటే కానీ మీకు ఇవన్నీ అలవాటు లేదు కదా అని. ఈ దుప్పటిని మీరే తీసుకోండి అని సౌర్య అనగా నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు? ఇదే స్థితిలో హిమ ఉంటే ఇంతకన్నా దారుణమైన ప్రదేశంలో కూడా నేను సర్దుకుపోతాను.మనం ఎక్కడ ఉన్నామనేది ముఖ్యం కాదు, మనం ఎవరితో ఉన్నామనేది ముఖ్యం అని నిరుపమ్ అంటాడు.

హిమ ఊహల్లో నిరూపమ్ :

నిరూపమ్ మాటలకూ శౌర్య బాధపడుతూ నా స్థానాన్ని హిమ లాగేసుకుంది అని. మనసులో బాధపడుతూ ఏడుస్తూ పనుకుంటుంది.. నిరుపమ్ మాత్రం హిమ గురించి ఆలోచించుకుంటూ ఇదే ప్లేస్ లో హిమ ఉంటే ఈ రాత్రంతా ఎంచక్కా కబుర్లు చెప్పుకుంటూ సమయం గడిపే వాళ్ళం కదా అనుకోని పనుకుంటాడు. మరుసటి రోజు నిరూపమ్ లేచి ప్రేమ్ ని, రాయితో కొట్టి తాళం తీయమని అడుగుతాడు. ఈలోగా ప్రేమ్ రాయి తీసి ఆ తాళం కొడుతున్నట్టు నటిస్తాడు. అంతలో సౌర్య లేవడంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.

 

 

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu