Subscribe for notification
Categories: Telugu TV Serials

Karthika Deepam: శోభ చేసిన ప్లాన్ తో ఒక్కటయిన స్వప్న, సత్యలు.. షాక్ లో జ్వాల..!

Share

Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.గత ఎపిసోడ్‌లో జ్వాలను అందరి ముందు అవమానించాలని చూసిన శోభకు హిమ అనుకోని షాక్ ఇస్తుంది.శోభతో అందరి ముందు జ్వాల పిన్ని, బాబాయ్‌లకు సారీ చెప్పిస్తుంది హిమ. ఇక ఈరోజు సీరియల్ కూడా అదే ఎపిసోడ్ తో కంటిన్యూ అవుతుంది. నిరూపమ్ అన్నా మాటలు తలుచుకుని జ్వాల ఓ చోట బాధగా నిలబడి ఉంటే నిరుపమ్ వచ్చి జ్వాలకు సారీ చెబుతాడు. ‘అయ్యో డాక్టర్ సాబ్ మీరు నాకు సారీ చెప్పడం ఏంటీ అంటుంది. మీకు నన్ను ఏదైనా అనే హక్కుంది.. మీరు అలా అన్నప్పుడు కాస్త చివుక్కుమంది కానీ ఆ తర్వాత బాధ అంతా పోయింది అంటుంది. ఇంతలో హిమ అక్కడకు రావడంతో జ్వాల హిమని హత్తుకుని థాంక్స్ చెబుతుంది.నిరుపమ్ కూడా హిమని పొగిడే పనిలో పడతాడు.

karthika deepam latest episode

శోభను తిట్టిన స్వప్న :

ఇక స్వప్న మాత్రం కోపంగా శోభని తిడుతుంది. ‘నీ పరువుతో పాటు నా పరువు పోయింది అంటూ శోభపై అరుస్తుంది. సీన్ కట్ చేస్తే నిరుపమ్ ఇంటికి. వచ్చాక స్వప్న మళ్ళీ పెళ్లి టాపిక్ తెచ్చి శోభను పెళ్లి. చేసుకో మంటుంది.ఆ సమయంలో.పక్కనే సత్య కూడా ఉంటాడు. ‘మమ్మీ నేను శోభని పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు.నా హిమ మారుతుంది. తననే పెళ్లి చేసుకుంటా మీరు పెద్దలగా నిలబడి పెళ్లి చేయండి చాలు అంటూ అరుస్తాడు.మళ్లీ హిమా అంటావేంట్రా అని మీరేం మాట్లాడరేంటండీ అని సత్యతో కోపంగా అంటుంది స్వప్న. ఏం మాట్లాడను స్వప్నా? భర్తగా నాకేం బాధ్యతను ఇచ్చావ్? పిల్లలకు తండ్రిగా మాత్రమే మిగిలిపోయాను కదా అంటాడు సత్య. అయినా ఇష్టం లేని పెళ్లి జరిగితే మనలా నిరూపమ్ జీవితం కూడా నాశనం అవుతుంది’ అంటాడు సత్య.ఇక సత్య మాటలకూ స్వప్న ఇంకా కోపడుతుంది. చూడు నిరుపమ్ నేను శోభ వాళ్ల పేరెంట్స్‌తో మాట్లాడాను.వచ్చే నెల రెండో వారంలో నీ పెళ్లి. నా మాట విని శోభని పెళ్లి చేసుకో.. లేదంటే ఈ అమ్మ ప్రాణాలతో ఉండదు గుర్తించుకో అని బెదిరించి వెళ్ళిపోతుంది స్వప్న. దాంతో నిరుపమ్ ఆవేశంగా అక్కడున్న ఫ్లవర్ వాజ్ పగలగొట్టి, అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

karthika deepam latest episode

హిమను అపార్ధం చేసుకున్న ప్రేమ్ :

సీన్ కట్ చేస్తే.. ప్రేమ్ ఆసుపత్రిలోని హిమ దగ్గరకు వస్తాడు. హిమ మాత్రం ప్రేమ్ తో నార్మల్‌గా నవ్వుతూ మాట్లాడుతుంది. అయితే ప్రేమ్ మాత్రం కనీసం నా వీడియో చూసే తీరక కూడా లేదా ఈ హిమకి అంటూ తనని తప్పుగా అనుకుని నేను హిమ మనసులో లేను అనుకుంటూనే మౌనంగా బాధగా వెళ్తాను అని వెళ్లిపోతుంటాడు. అప్పుడే ఒక అబ్బాయి వచ్చి ‘మేడమ్ మీ ఫోన్ బాగైంది.. ఫోన్ రీసెట్ కొట్టడంతో ఫొటోలు, వీడియోలు అన్నీ పోయాయి మేడమ్’ అంటాడు. అది విన్న ప్రేమ్ అంటే హిమ నేను పంపిన వీడియో చూడలేదు అన్నమాట అని నవ్వుకుంటూ.. ‘హిమా కాఫీ తాగుదామా’ అంటాడు. హిమ సరేనంటుంది.

karthika deepam latest episode

అమ్మను వదిలి తండ్రి చెంతకు చేరిన నిరూపమ్ :

ఇక జ్వాల సత్య ఇంటికి క్యారేజ్ తీసుకుని వెళ్లడంతో అక్కడ నిరూపమ్ కూడా ఉంటాడు.డాక్టర్ సాబ్ ను చూసి జ్వాల మురిసిపోతుంది మీకా నిరూపమ్ మాత్రం హాయ్ జ్వాలా.. నేను ఇంట్లోంచి వచ్చేశాను ఇక ఇక్కడే ఉంటాను’ అంటాడు. దాంతో జ్వాల చాలా సంతోషిస్తుంది. ఇంతలో సత్య వచ్చి నువ్వు ఇక్కడ ఉంటే అక్కడ ‘అమ్మ ఒక్కర్తే అయిపోతుంది కదా అంటాడు. నిరుపమ్ బాధగా చూస్తే ఉంటే అప్పుడే ప్రేమ్ వస్తాడు.రేయ్ మొత్తానికీ వచ్చావ్.. చాలా సంతోషంరా’ అంటాడు ప్రేమ్ నిరుపమ్‌తో. ‘మీ మమ్మీ కూడా మనతో కలిసి ఉంటే బాగుంటుంది కదరా’ అంటాడు సత్య. ‘అవును అంకుల్ అంతా కలిసే ఉంటారు’ అంటూ ఎంట్రీ ఇస్తుంది శోభ. అంతా కూడా షాక్ అవుతూ చూస్తుంటారు.ఏం మాట్లాడుతున్నావ్ అమ్మా.. స్వప్న మాతో కలవాలంటే భూమి ఆకాశం కలవాలి’ అంటాడు.

మరో ప్లాన్ వేసిన స్వప్న, శోభ:

అంత అవసరం లేదు లెండీ అంటూ స్వప్ నవ్వుతూ వచ్చి ప్రేమ్, నిరుపమ్‌ల మధ్యకు వచ్చి ప్రేమగా వాళ్ళను పట్టుకుంటుంది. ‘ఏంటి మమ్మీ ఇది కలా నిజమా?’ అంటాడు ప్రేమ్. ‘రేయ్ నువ్వు మీ డాడీ ఒక చోట.. నేను నిరుపమ్ మరో చోట బాలేదు రా అంటుంది.నిరుపమ్ నా మీద కోపంతో ఇల్లు వదిలి వచ్చేశాక ఈ శోభ చెప్పిన మాటలు నాలో కొత్త ఆలోచనలు పుట్టేలా చేశాయి అంటుంది స్వప్న.ఇక అందరు కూడా శోభకు థాంక్స్ చెబుతారు.ఇక శోభ మాత్రం అంకుల్ మీ లగేజ్ ప్యాక్ చేసుకోండి ఆ ఇంటికి వెళ్లాలి కదా.. ఈ ఇంట్లో కొంత పర్నీచర్ ను పేదవాళ్లకి ఇచ్చేస్తే బెటర్ అంటూ జ్వాల వంక చూస్తూ అంటుంది శోభ. వెంటనే స్వప్న జ్వాల దగ్గరకు వచ్చి ఈ రోజు దాకా నీకు రావాల్సిన డబ్బులు మొత్తం తీసుకుని వెళ్లు.ఇక టిఫిన్స్ మోయడం,మాటలు మోయడం మానేసెయ్ అనడంతో ఈరోజు సీరియల్ అయిపోతుంది.


Share
Ram

Recent Posts

Charan Hrithik Roshan: సంచలన దర్శకుడు డైరెక్షన్ లో వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ లో చరణ్, హృతిక్ రోషన్..??

Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…

43 mins ago

Thaman: బాలయ్య బాబు అంటే నాకు ఎమోషనల్.. కారణం అదే తమన్ సంచలన వ్యాఖ్యలు..!!

Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…

59 mins ago

Uday Kiran: అప్పట్లో హీరో ఉదయ్ కిరణ్ కి పోటీ నేనే అంటూ ఆ హీరో సెన్సేషనల్ కామెంట్స్..!!

Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…

2 hours ago

Nayanthara: భ‌ర్త‌ను కౌగిట్లో భందించి ఊపిరాడ‌కుండా చేసిన న‌య‌న్‌.. ఫొటో వైర‌ల్‌!

Nayanthara: లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. ఓ మ‌ల‌యాళ చిత్రంతో సినీ కెరీర్‌ను…

4 hours ago

Pavitra Lokesh Naresh: నరేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవిత్ర లోకేష్ భర్త..!!

Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…

4 hours ago

Gopichand-NTR: ఎన్టీఆర్ ఒకే చేసిన క‌థ‌తో గోపీచంద్ సినిమా.. ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే?

Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రిత‌మే `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి…

5 hours ago