NewsOrbit
Telugu TV Serials

Karthika Deepam: హిమకు క్యాన్సర్ అని తెలిసి నిరూపమ్ ఏమి చేయనున్నాడు..?

Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. గత ఎపిసోడ్ లో శోభ నిరూపమ్ ను. పెళ్లి చేసుకుంటా అంటూ జ్వాల, హిమలకు చెప్పడంతో సీరియల్ మరింత ఆసక్తికరంగా మారిందనే చెప్పాలి. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందామా.జ్వాలతో మాట్లాడాలని తనని రమ్మని చెప్తాడు నిరూపమ్.అయితే జ్వాలతో పాటుగా హిమ కూడా రావడంతో నిరూపమ్ కాస్త అసహనంగా ఉంటాడు. ఇక జ్వాల మాత్రం చూడు తింగరి వద్దు అంటే నాతో వచ్చావ్ డాక్టర్ సాబ్ మొహం చూడు ఎంత కోపంగా పెట్టాడో అని అంటుంది జ్వాల.

karthika deepam latest episode
karthika deepam latest episode

కళ్లుతిరిగి పడిపోయిన హిమ :

ఇక నిరూపమ్ మాత్రం నేను అమెరికా వెళ్లిపోతున్నా అనడంతో హిమ, జ్వాల ఇద్దరు కూడా ఒకేసారి షాక్ అవుతారు.బావ అమెరికా వెళితే మరి సౌర్య పరిస్థితి ఏమిటి? అని హిమ ఆలోచిస్తూ ఉంటుంది. జ్వాల మాత్రం డాక్టర్ సాబ్ నన్ను పెళ్లి చేసుకుని తనతో పాటుగా నన్ను కూడా అమెరికా తీసుకుని వెళ్తాడు అని మనసులో అనుకోని తెగ మురిసిపోతుంది.ఈ టెన్షన్ లో హిమ అక్కడే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది.

karthika deepam latest episode
karthika deepam latest episode

హిమను దెప్పి పొడుస్తున్న సౌందర్య:

సీన్ కట్ చేస్తే హిమ తన ఇంటికి వెళ్లగానే సౌందర్య వెటకారంగా రావమ్మా మహాలక్ష్మీ అంటూ హిమను దెప్పిపొడుస్తుంది.ఆ తర్వాత కూతుర్ని అల్లుడిని శోభ కలిపడంతో స్వప్న నా పెద్ద కోడలు శోభనే అంటూ తనను ఆకాశానికి ఎత్తేస్తుంది అని సౌందర్య దంపతులు అంటారు. ఇక అందరూ ఒక్కటై శోభను నెత్తిన పెట్టుకొని ఊరేగుతారు అని సౌందర్య హిమ కు చెబుతుంది. ఇప్పటికైనా నోరు విప్పి మాట్లాడు. నీ మనసులో ఏముందో చెప్పు అని అడుగుతారు. ఇక హిమ మాత్రం మీ అందరి ప్రశ్నలకి ఇందులో సమాధానాలు ఉన్నాయి అని మెడికల్ రిపోర్ట్స్ చూపిస్తుంది.

karthika deepam latest episode
karthika deepam latest episode

హిమకు క్యాన్సర్ అని తెలుసుకున్న సౌందర్య దంపతులు :

అందులో హిమకు క్యాన్సర్ అని తెలియడంతో సౌందర్య దంపతులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి వెక్కి వెక్కి ఏడుస్తారు.ఈ క్రమంలోనే నిరూపమ్ అక్కడకు వచ్చి క్యాన్సర్ రిపోర్ట్ చూసి ఏడుస్తూ ఉంటాడు.ఇక నీకేం కాదు హిమ అంటూ ఆ రిపోర్ట్ ను కోపంతో చించేస్తాడు. లాభం లేదు బావ చేయి. దాటిపోయింది అంటుంది హిమ. ఈ విషయం జ్వాలకు చెప్పొద్దూ అని నిరుపమ్ ను ప్రామిస్ చేయమని అడుగుతుంది. ఇక నాకు ఇలా క్యాన్సర్ అని తెలిస్తే తను తట్టుకోలేదు బావ అంటూ బాగా ఏడుస్తుంది. అలాగే మన ప్రేమ విషయం కూడా తనకు చెప్పకు బావ అని అంటుంది. నిరుపమ్ మాత్రం ఇప్పుడు అవన్నీ ఎందుకు అని కోపం పడతాడు.

జ్వాలకు నిజం చెప్పొద్దు అన్న హిమ :

ఇక హిమ మాత్రం నన్ను మర్చిపో బావ అని,నేను చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకో అపుడే నా ఆత్మ శాంతిస్తుంది అని అంటుంది. ఇక ఆ మాటతో నిరుపమ్ షట్ అప్ అంటూ విరుచుకు పడతాడు. నిన్ను నేను ఎలా అయినా కాపాడుకుంటాను అని హిమ చేతులు. పట్టుకుని ఎమోషనల్ అవుతాడు నిరూపమ్.మరోవైపు సత్య ప్రేమ్ లు హిమ క్యాన్సర్ గురించి తెలిసి బాధ పడుతూ ఉంటారు.ఇక తరువాయి భాగంలో సౌర్య చేతికి హెచ్ అనే అక్షరం చూసి శోభ ఎవరి పేరు ఇది అని అడుగుతుంది. అది నా శత్రువు పేరు అని సమాధానం చెప్పడంతో సీరియల్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారిందనే చెప్పాలి.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Jagadhatri April 19 2024 Episode 209: కౌశికి హార్డ్ డిస్క్ పట్టుకునే ప్రయత్నంలో ల్యాండ్ ని కోల్పోతుందా..

siddhu

Trinayani April 19 2024 Episode 1217: నైనిని చంపడానికి తిలోత్తమ వేసిన ప్లాన్, ఉసిరి దీపాలను ఎగరగొట్టిన సుమన.

siddhu

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

bharani jella

Brahmamudi April 19 2024 Episode 388: బాబుకి ప్రమాదం.. నిజం చెప్పక ఇంటికి దూరం కానున్న రాజ్ .. నిజం బయట పెడతానన్నా సుభాష్.. అంతా తెలుసుకున్న కావ్య..

bharani jella

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu

Karthika Deepam 2 April 18th 2024 Episode: దీపని చావగొడతానన్న నరసింహ… కార్తీక్ మంచివాడు అంటూ శౌర్య ఎమోషనల్..!

Saranya Koduri

Guppedanta Manasu April 18  2024 Episode 1053: మహేంద్ర ఇవ్వబోతున్న ఇన్విటేషన్ ఏంటో అని ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేవయాని .

siddhu

Manasu Mamatha: ఎట్టకేలకు విడాకులపై నోరు విప్పిన ప్రియతమ్ చరణ్.. బయటపడ్డ అసలు నిజాలు..!

Saranya Koduri