NewsOrbit
Telugu TV Serials

Karthika Deepam: అనుకున్నంతా అయిపొయిందిగా.. హిమ మెడలో బలవంతగా తాళి కట్టిన నిరీపమ్..!

Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. మంచి కుటుంబకథనంతో ముందుకు సాగుతున్న కార్తీక దీపం సీరియల్లో. ఈరోజు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో చూద్దామా. జ్వాల హాస్పిటల్ కు వచ్చి ఐ లవ్ యూ అంటూ డాక్టర్ సాబ్ అంటూ అన్న మాటల గురించి డాక్టర్ నిరుపమ్‌ తీవ్రంగా ఆలోచిస్తాడు. జ్వాల మనుసులో ప్రేమ ఉందని తెలిసినప్పుడు హిమ తమ గురించి చెప్పాల్సింది. మరి అలా కాకుండా హిమ ఎందుకు ఇలా చేస్తుంది అనుకుంటాడు.అనవసరంగా హిమ మాటల వలన జ్వాల నా మీద ప్రేమ పెంచుకుంది అని అనుకుంటాడు. హిమ అతి మంచితనం వల్లే ఇదంతా జరిగిందా? అదేంటో గానీ.. జ్వాలకు నేను తనని ప్రేమించడం లేదని చెప్పడానికి కుదర్లేదు. జ్వాలాను పెళ్లి చేసుకోవాలని హిమ విచిత్రమైన కోరికను కోరుతున్నది. ఇవేం నాకు అర్ధం కావడం లేదు అని నిరుపమ్ ఆలోచిస్తాడు.

karthika deepam latest episode
karthika deepam latest episode

మోనిత కొడుకుని కలిసిన జ్వాల :

సీన్ కట్ చేస్తే మోనిత కొడుకు అయిన రవ్విడ్లీ వద్దకు జ్వాల వెళ్తుంది.అయినా మోనిత కొడుకు అయినంత మాత్రాన రవ్విడ్లీని ఎందుకు దూరం పెట్టాలి అంటూ తన మనసులో అనుకుంటుంది.ఇక జ్వాలను చూడగానే రవ్వ ఇడ్లీ సంతోషపడతాడు.ఏంటి. జ్వాల అసలు నా దగ్గరకు రావడం లేదు అంటే జ్వాల మాత్రం ఇదిగో డబ్బు తీసుకో నీ చదువుకు ఉపయోగించుకో అని జ్వాల ఇవ్వబోతుంటే.. ఏంటి జ్వాల డబ్బు ఇవ్వడానికే వచ్చావా? అని రవ్విడ్లి అంటాడు.. దాంతో జ్వాల అలాంటి మాటలు మాట్లాడకుండా డబ్బు తీసుకో అని అంటుంది.ఇంతలో హిమ ఫోన్ చేసి ఎక్కడున్నావ్ జ్వాల అనడంతో రవ్విడ్లీ దగ్గర ఉన్నాను అని అంటుంది.నీవు కూడా రవ్వ ఇడ్లీకి డబ్బులు ఇస్తున్నట్టు తెలిసింది అని జ్వాలా అంటుంది.

karthika deepam latest episode
karthika deepam latest episode

పెళ్లి విషయంలో నిరూపమ్ కు ఎలాంటి క్లారిటీ వచ్చిందంటే..?

సరే జ్వాల ఒకసారి నీవు ఆశ్రమానికి రా అంటుంది. హిమ.కానీ జ్వాల మాత్రం నువ్వే రవ్విడ్లీ వద్దకు రా. ఇద్దరం కలిసి ఆశ్రమంకు వెళ్దాం అని అంటుంది. మరో వైపు నిరూపమ్ హిమ గురించి మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాడు.జ్వాలా విషయంలో హిమ ఇలా ఎందుకు చేస్తున్నది. అసలు మా మధ్య ఉన్న ప్రేమను జ్వాలాకు చెబితే తాను నా మీద ఆశలు పెంచుకోదు కదా..మా బావను నేను ప్రేమిస్తున్నానని సూటిగా జ్వాల చెప్పవచ్చు కదా. చెప్తే బావను జ్వాల కాసేపు బాధపడుతుంది అనుకుంటాడు.ఇవన్నీ కాదు అసలు నేను ఎందుకు హిమను పెళ్లి చేసుకోకూడదు.ముహుర్తాలు పక్కన పెట్టి హిమను తీసికెళ్లి నేను తాళి కడితే అన్ని సమస్యలు తీరతాయి అని నిరుపమ్ తన మనసులో అనుకుంటాడు.

karthika deepam latest episode
karthika deepam latest episode

హిమ మెడలో తాళి కట్టేసిన నిరూపమ్:

సీన్ కట్ చేస్తే హిమను గుడికి రమ్మని చెప్తాడు. అక్కడకు వచ్చిన హిమను బలవంతంగా గుడిలోకి తీసుకుని వెళ్లి అమ్మవారి విగ్రహం ముందు ఉన్న పసుపు కుంకుమనుహిమ నుదుటిపైన పెడతాడు.అక్కడే ఉన్న తాళిని తీసుకొని పూజారిని పెళ్లి మంత్రాలు చదవమని హిమ వద్దని చెప్పినా హిమ మెడలో తాళి కట్టేస్తాడు. ఆ తరువాత హిమ రెండు చేతులు పట్టుకొని అమ్మవారికి మొక్కించాడు. ఈ రోజు నుంచి నా భార్యవు. నా శరీరంలో సగభాగానివి. ఇక నుంచి నువ్వు నేను ఒక్కటే..మనల్ని ఎవ్వరూ విడదీయలేరు అని అంటాడు.అసలు ట్విస్ట్ ఏంటంటే ఇదంతా డాక్టర్ శోభ కలగంటుంది.కల నుంచి బయటపడిన శోభ ఒక్కసారిగా లేచి ఒకవేళ నిరుపమ్, హిమ పెళ్లి చేసుకొంటే… ఎలాగయినా వారిద్దరిని విడదీసి మళ్ళీ నేను నిరుపమ్ ను పెళ్లి చేసుకోంటానని డాక్టర్ శోభ మనసులో అనుకొన్నది.

హిమ గురించి ఆలోచనలో పడ్డ జ్వాల :

ఇక జ్వాల మాత్రం హిమ పేరుతో వచ్చిన ఫోన్ కాల్ గురించి రకరకాలుగా ఆలోచిస్తుంది.హిమ ఎందుకు ఇలా ఫోన్ చేస్తున్నది. హిమ కావాలనే చేస్తున్నదన్నమాట. నేను ఏడిపించానని.. నానమ్మకు చెప్పిందా? నానమ్మకు తెలిసినా నటిస్తుందా?అయినా నానమ్మ అలాంటి పనులు చేయదు. నానమ్మకు నటించడం తెలియదు.నానమ్మకు హిమ నా గురించి చెప్పలేదా? అయినా హిమకు ఎందుకింద పొగరు అని జ్వాల హిమ మీద కోపంతో రగిలిపోతుంది. ఇక నిరూపమ్ మాత్రం సత్య, స్వప్నలను పిలిచి హిమను పెళ్లి చేసుకోవాలనుకొంటున్నాను అనే విషయం చెప్తాడు పెళ్లి పనులు మొదలుపెట్టండి అంటాడు. స్వప్న మాత్రం హిమ అంటే నిరుపమ్‌కు ఇంత పిచ్చా అని మనసులో అనుకుంటుంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

bharani jella

Nindu Noorella Saavasam: ఆ పెళ్లి జరగనివ్వను మీ అమ్మగా మాట ఇస్తున్నాను అంటున్న భాగామతి 

siddhu

Mamagaru: గంగాధర్ కి ఫోన్ చేసి రమ్మంటూ సుధాకర్, అప్పిచ్చిన వాళ్లని బురిడీ కొట్టించిన మహేష్..

siddhu

Krishna Mukunda Murari April 20 2024 Episode 450: ముకుంద ప్లాన్ సక్సెస్.. మీరా తో ఆదర్శ్ పెళ్లి.. కృష్ణ శాశ్వతంగా పిల్లలకు దూరం..

bharani jella

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu