Categories: Telugu TV Serials

Karthika Deepam: హిమ, నిరూపమ్ ల పెళ్లి పనులు మొదలవడంతో అటు శోభ, ఇటు జ్వాలల గుండెల్లో గుబేలు..!

Share

Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. గత ఎపిసోడ్ లో నిరూపమ్ హిమను పెళ్లి చేసుకుంటాను.. పెళ్లి పనులు మొదలుపెట్టంది అంటూ సత్య, స్వప్నలకు చెప్పడంతో ఏమవుతుందో అనే ఆసక్తి అందరిలో మొదలయింది.. మరి ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందామా. నిన్న సీన్ కంటిన్యూ అవుతుంది ఈరోజు కూడా.అమ్మా నాన్నలతో ఈ ఇంట్లో పెళ్లి పనులు మొదలు కావాలి.. హిమని నేను పెళ్లి చేసుకుంటున్నాను.వెళ్లి షాపింగ్ చేయండి అంటాడు. అలాగే మీరిద్దరూ అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లి హిమ లేని సమయంలో ఈ పెళ్లి విషయం వాళ్లకు చెప్పండి అంటాడు నిరూపమ్. సరే అన్నట్టు స్వప్న, సత్యలు అంటారు.

karthika deepam latest episode

దీప, కార్తీక్ ల పెళ్లి రోజు.. ఆనందంలో సౌందర్య:

సీన్ కట్ చేస్తే సౌందర్య ఉదయాన్నే లేచి కొడుకు., కోడల ఫొటో దగ్గరకు వచ్చి.. ‘పెళ్లి రోజు శుభాకాంక్షలు పెద్దోడా, దీపా అంటూ చెప్తుంది.ఈరోజు దీప, కార్తీక్ ల పెళ్లిరోజు. ఎన్నో రోజుల తరువాత ఈ రోజు ప్రశాంతంగా నిద్రపట్టింది అని. సౌందర్య అనుకుంటూ ఉండగా స్వప్న, సత్యలు వచ్చి నిరూపమ్, హిమల పెళ్లి విషయం సౌందర్యకు చెప్తారు. ‘ఇంట్లో పెళ్లి పనులు మొదలుపెట్టమని ఈరోజు పసుపు కొట్టమని నిరుపమ్ చెప్పాడు. మీరు హిమను తీసుకుని అక్కడికి వచ్చేయండి అని చెప్పి వెళ్లిపోతారు సత్య, స్వప్నలు. ఇక సౌందర్య, ఆనందరావులు చాలా సంతోషిస్తారు.

karthika deepam latest episode

జ్వాలను ఇంటికి రమ్మన్న నిరూపమ్.. ఎందుకంటే..?

సీన్ కట్ చేస్తే జ్వాల రవ్వ ఇడ్లీ టిఫిన్ సెంటర్‌కి వెళ్లి విసుగ్గా కూర్చుంటుంది.అది గమనించిన రవ్వ ఇడ్లీ టీ తేనా జ్వాల అని అడుగుతాడు. ఆ సమయంలోనే నిరుపమ్ ఫోన్ చేయడంతో నవ్వుతుంది జ్వాల. ఫోన్ లిఫ్ట్ చేయగానే జ్వాల నువ్వు మా ఇంటికి రావాలి’ అని అంటాడు నిరుపమ్. ‘మీరు పిలవాలే కానీ రాకుండా ఉంటానా డాక్టర్ సాబ్’ అంటుంది జ్వాల. ఇప్పుడు కాదుగాని ఓ అరగంట ఆగి మా ఇంటికి రా’ అని నిరూపమ్ అనడంతో సరే అంటుంది జ్వాల.

karthika deepam latest episode

జ్వాలకు నిజం చెప్పేయాలి అని ఫిక్స్ అయిన నిరూపమ్ :

ఇక నిరుపమ్ మాత్రం మనసులో.. ‘జ్వాలని పిలిచాను. తను రాగానే అసలు విషయం చెప్పేయాలి అనుకుంటాడు. నాకు తెలియకుండానే తనకు ఆశలు కలిపించి ఉంటే నన్ను క్షమించమని కూడా అడుగుతాను’ అని అనుకుంటాడు మనసులో. మరోవైపు శోభ నిరుపమ్ ఇంటికి వస్తుంది. జరిగిన విషయం అంతా స్వప్న శోభకు చెప్పి ఇంకా రెండే రెండు నెలలు శోభా.. హిమ పోతే నీకు అడ్డే ఉండదు అంటుంది.మొత్తానికీ హిమకు విషయం చెప్పకుండా సౌందర్య, ఆనందరావులు హిమని నిరుపమ్ ఇంటికి తీసుకొస్తారు.

karthika deepam latest episode

పెళ్లి విషయం తెలిసి షాక్ లో హిమ :

హిమ ఇంటికి రాగానే నీకు నిరుపమ్‌కి పెళ్లి అని స్వప్న చెప్పడంతో హిమ షాక్ అవుతుంది. హిమ అటు నిజం చెప్పలేక, అక్కడ నుంచి బయటపడలేక తికమక పడుతుంది.శోభ కూడా అక్కడ పరిస్థితి చూసి ఏం చెయ్యలేక తలపట్టుకుంటుంది. ‘ఇప్పుడు హిమకు ఏ జబ్బులేదు అని నిజం చెబుదామంటే.. క్యాన్సర్ లేదు కాబట్టి ఇక ఈ పెళ్లిని మరింత గొప్పగా జరుపుతాం అంటారేమో అని ఆలోచిస్తుంది. ఎలాగయినా ఈ పెళ్లి తంతును ఆపాలి అని అనుకుంటుంది జ్వాల మనసులో.ఇక జ్వాల రవ్వ ఇడ్లీ టిఫిన్ సెంటర్ నుంచి ఆటోలో నిరూపమ్ ఇంటికి రావడంతో ఎపిసోడ్ ముగుస్తుంది..


Share

Recent Posts

గుండెకు హత్తుకునే సినిమాలు చేయాలి అంటున్న బండ్ల గణేష్..!!

మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…

9 mins ago

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

1 hour ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

2 hours ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

3 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

4 hours ago

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…

5 hours ago