Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. మంచి కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.గత ఎపిసోడ్ లో నిరూపమ్ ఎలాగయితేనే జ్వాలకు తనని ప్రేమించడం లేదు అనే విషయం తెగేసి చెప్పేస్తాడు. మరో పక్క సౌందర్యకు జ్వాలనే సౌర్య అనే విషయం కూడా తెలియడంతో ఈరోజు ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా మారిందనే చెప్పాలి.ఇక ఈరోజు ఎపిసోడ్ లో డాక్టర్ సాబ్ మాటలకు జ్వాల ఎంతగానో బాధపడుతుంది.
మీ మాటలు అబద్ధం మీరు అబద్ధం, ఆ తింగరి కూడా అబద్ధమే అంటూ ఎంతగానో ఎమోషనల్ అవుతుంది. దీంతో నిరుపమ్ అక్కడనుంచి వెళ్ళి పోతాడు.అప్పుడు సౌందర్య పదవే సౌర్య దగ్గరికి వెళ్దాం అని అనగా నాన్నమ్మ నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయ్ అంటూ ఎమోషనల్ అవుతుంది హిమ.ఆ తరువాత అన్ని తలుచుకుని రోడ్డు పై నడుచుకుంటూ వెళ్తుంటే వెనకనుండి కారు వచ్చి హిమకు డాష్ ఇవ్వబోతుండగా ఇంతలో ప్రేమ్ వచ్చి కాపాడతాడు.ఏంటి హిమ చచ్చిపోతావా ఏంటి ముందు వెనుక చూసుకోవా అంటూ అరుస్తాడు.ఇక హిమ కూడా చాలా ఎమోషనల్ అవుతూ మాట్లాడుతుంది
మరొకవైపు జ్వాల జరిగిన విషయాన్ని తలచుకొని హిమపై కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆ తింగరికి అన్ని నేనే నేర్పాను. నేను తయారు చేసిన కత్తి ఇప్పుడు నా మీదనే తిరగబడింది అని హిమ మీద చాలా కోపంతో రగిలిపోతుంది.ఆ తింగరిని వెనకాలే తిప్పుకొని ధైర్యం నేర్పించినందుకు నాకు తగిన శాస్తి జరిగింది అనుకుంటూ ఉంటుంది జ్వాల. ఇంతలోనే హిమ, జ్వాలా కి ఫోన్ చేయగా జ్వాల ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది.మళ్ళీ హిమ ఫోన్ చేయడంతో జ్వాల ఫోన్ లిఫ్ చేసి ఇంత మోసం చేస్తావు అనుకోలేదు అంటూ హిమ పై విరుచుకుపడుతుంది. అప్పడు జ్వలా నా జీవితంలో ఒకరు కాదు ఇద్దరు శత్రువులు ఉన్నారు అని అంటుంది. ఆ మాటలకు హిమ ఎమోషనల్ అవుతుంది.
ఇక హిమ సౌర్య ఫోటో చూస్తూ చాలా ఎమోషనల్ అవుతూ ఉండగా అక్కడికి సౌందర్య వచ్చి బాధ పడుతుంది. అసలు ఏమి జరిగింది అని అనడంతో అసలు విషయం చెబుతుంది.ఇక హిమ కార్తీక్, దీప ఇద్దరు చనిపోయే అప్పుడు అన్న మాటలను గుర్తుతెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్ లోనిరుపమ్ జరిగిన విషయాన్ని తలచుకొని జ్వాలా సారీ అని మనసులో బాధ పడుతూ ఉంటాడు.మరో పక్క సౌందర్య జ్వాల దగ్గరికి వెళ్తుంది.
Rakul Preet Singh: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు నటించడం చాలావరకు తగ్గించింది. బాలీవుడ్పైనే…
Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…
Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…
Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…
God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…
Ram Pothineni Boyapati: బోయపాటి(Boyapati Srinivas) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్…