Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. గత ఎపిసోడ్ లో జ్వాలకి మంచి చెయ్యాలి అని హిమ అనుకుంటే అది కాస్త బెడిసి కొట్టి హిమ మరింత దూరం అయింది. హిమలానే ఈ తింగరి కూడా నా శత్రువే అని రగిలిపోతుంది జ్వాల. మరోవైపు సౌర్య, జ్వాల ఒక్కరే అని సౌందర్యకు తెలియడంతో ఈరోజు ఎపిసోడ్ మరింత రసవత్తరంగా సాగిందనే చెప్పాలి.ఈ క్రమంలో నేటి కథనం ఉత్కంఠగా మారింది.హిమ జరిగిన విషయం అంతా సౌందర్యకు చెప్తుంది. నేనే హిమ అనే విషయం తెలియకుండా తింగరిగా జ్వాలకు దగ్గర అయ్యాను అని సౌందర్యకు హిమ చెబుతుంది.
మనం ఇన్నాళపాటు సౌర్య కోసం బాధపడుతున్నాం.. నిన్ను అంటే తను గుర్తు పట్టలేదు సరే.. నన్ను గుర్తు పట్టి కూడా నాన్నమ్మ అని పిలవకుండా, ఇంటికి రాకుండా ఉందంటే లోపల ఎంత బాధను అనుభవిస్తుందో కదా? పాపం అంటుంది సౌందర్య బాధగా ఏడుస్తూ.‘సౌర్యకి నా మీద ఎంత కోపం ఉందో నీకు తెలియదు నాన్నమ్మా.. తన ముందు ఈ పచ్చబొట్టు దాచుకుంటూ ఇబ్బంది పడుతున్నాను.. తనేమో ఆ పచ్చబొట్టుని చూస్తూ మరింత కోపం పెంచుకుంటుంది’ అంటుంది హిమ బాధగా.ఎలా అయినా నిరుపమ్ బావా సౌర్య ఒకటి కావాలని కోరుకుందాం’ అంటుంది హిమ.
ఇక సీన్ కట్ చేస్తే.. నిరుపమ్ తనలో తనే సంబరపడుతూ జ్వాలను తలుచుకుని.‘సారీ జ్వాలా.. ఇందులో నా తప్పేం లేదు.. అంతా నువ్వే ఊహించుకున్నావ్ అంటాడు. ‘ఏది ఏమైనా నాకు హిమకు పెళ్లి కావడానికి ఏ అడ్డంకి లేదు’ అని అనుకుంటాడు. ఇక సౌందర్య సౌర్య ఇంటికి వస్తుంది.సౌందర్యను చూసి‘హాయ్ సీసీ.. ఏంటి ఇలా వచ్చావ్?’ అంటుంది సౌర్య. ‘నిన్ను ఆశ్రమంలో చూశాను అని.చెప్పి ఆ అబ్బాయికి నీకు గొడవ ఏంటి అని అడుగుతుంది.సౌందర్య. అవునా అని మాట మారుస్తూ.‘సారీ సీసీ.. ఇంట్లో ఎవ్వరూ లేరు.. ఊరు వెళ్లారు.నేను నీకు మర్యాదలేం చెయ్యలేను’ అంటుంది సౌర్య.
‘నాకేం మర్యాదలు అవసరం లేదులేవే.. నేను దూరం నుంచి విన్నాను.. మీ ఇద్దరి మధ్య గొడవేంటీ? అని మళ్ళీ అడుగుతుంది. తను ఒక డాక్టర్ తనని ప్రేమించాను. మా మధ్య ఒక విలన్ వచ్చింది.. అయినా నా రేంజ్ మరిచిపోయి నేను ఓ డాక్టర్‌ని ప్రేమించడమేంటీ? నా కర్మ కాకపోతే..? అంతా అయిపోయిందిలే సీసీ అని చెప్పి బాధను దిగమింగుకుని నా కథ చెప్పి బోర్ కొట్టిస్తున్నానా? సినిమాకి వెళ్దామా?’ అంటుంది సౌర్య. నీకు నవ్వుఎలా వస్తుందే?’ అంటుంది సౌందర్య. ‘సీసీ.. ఈ ప్రేమ ఉంది చూడు.. ఎవరినైనా ఆట ఆడించేస్తుంది కదా? నా లవ్ వన్ సైడ్ సీసీ అంటుంది సౌర్య బాధని కంట్రోల్ చేసుకుంటూ.
నీ బాధ నాకు చెప్పుకోవే అంటుంది సౌందర్య ప్రేమగా. ఒక కత్తి ఉంది సీసీ.. నా తోక పట్టుకుని తిరుగుతూ నన్నే మోసం చేసింది అని హిమను ఉద్దేశించి అంటుంది జ్వాల. దాన్ని వదిలిపెట్టను.. డాక్టర్ సాబ్‌ని నాకు కాకుండా చేసింది’ అంటూ రగిలిపోతుంది సౌర్య. అది హిమే అని తెలిసిన సౌందర్య.. ‘అది నీకు మంచి చెయ్యాలనే అనుకుందే అని మనసులో అనుకుంటుంది.నేను డాక్టర్ సాబ్‌ని ఎంతగా ప్రేమించానో తెలుసా?’ అంటూ రక్తంతో గీసిన నిరుపమ్ బొమ్మని తెచ్చి సౌందర్యకు చూపిస్తుంది. దాంతో సౌందర్య బాధను తట్టుకోలేక.. ‘ఎంత కష్టం వచ్చిందే నీకు’అంటూ ఒక్కసారిగా సౌర్యని హత్తుకుని ఏడ్చేస్తుంది.
సీన్ కట్ చేస్తే స్వప్న ఇంటికి వచ్చిన శోభ..ఆంటీ ఎప్పుడూ ఈ ఇంటికి వచ్చినా కూడా పరాయి దానిలానే ఫీల్ అవుతుంటాను.. ఈ ఇంటికి కోడలిగా ఎప్పుడు వస్తానా అని నా మనసు నన్ను అడుగుతూనే ఉంటుంది’ అంటుంది.ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు శోభా’ అంటుంది స్వప్న. హిమకి నిరుపమ్‌ని పెళ్లి చేసుకోవడం పెద్దగా ఇష్టం లేదు.. అలాంటప్పుడు నిరుపమ్‌కి బలవంతంగా పెళ్లి చేయడం అవసరమా ఆంటీ? మీరు నిరుపమ్‌కి సర్దిచెప్పొచ్చు కదా ఆంటీ అంటుంది శోభ.స్వప్న కోపంగా చూస్తూ ఏమి చేయాలో నాకు తెలుసు నాకు. సలహాలు ఇవ్వకు అని శోభకు వార్నింగ్ ఇస్తుంది.ఆంటీ మూడ్ బాలేనట్లు ఉంది.ఇప్పుడు హిమకు క్యాన్సర్ లేదనే విషయం చెప్పకపోవడమే మంచిది అని అనుకుని సైలెంట్ అయిపొతుంది శోభ.ఇక సౌందర్య.. సౌర్య ఇంట్లోనే వంట చేస్తూ ఉంటుంది. ‘నీ చేతి వంట తిని ఎన్నాళ్లు అయ్యింది నాన్నమ్మా’ అని సౌర్య మనసులో అనుకుంటే ‘నీకు వండి పెట్టి ఎన్నేళ్లు అయిపోయిందే రౌడీ’ అని సౌందర్య మనసులో అనుకోవడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Pawan Kalyan: రాష్ట్రంలో బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. జనసేనతోనే మా పొత్తు ఇంక ఏ పార్టీతోనూ మాకు పొత్తు లేదు…
Shriya Saran: అందాల భామ శ్రియ సరన్ గురించి పరిచయాలు అవసరం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…
CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…
Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగర్`. డాషింగ్ అండ్ డైనమిక్…
Udaipur Murder: రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్నయ్య కుమార్ ను దారుణంగా హత్య చేసిన నిందితులపై జైపూర్…
Mahesh Babu: టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు ఇటీవల `సర్కారు వారి పాట`తో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న…