Telugu TV Serials

Karthika Deepam: నిజం తెలుసుకున్న జ్వాల… చంపేస్తా అంటూ హిమకు వార్నింగ్..!

Share

Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్. రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం..హిమ, నిరూపమ్ ఇద్దరు కొబ్బరి బొండం తాగడానికి వెళ్తారు. ఈ క్రమంలోనే ఇంకొకటి తాగుతావా?’ అంటాడు నిరుపమ్. ‘వద్దు బావా చాలు’ అంటుంది హిమ. ‘ఏదైనా సరే నీకు ఎక్కువ ఇవ్వాలని తాపత్రయపతాను హిమా’ అంటాడు నిరుపమ్. ‘ఏది ఎక్కువైనా ప్రమాదమే బావా’ అంటుంది హిమ. వెంటనే పర్స్ తీసి ఐదువందల నోట్ చూస్తూ ‘ఇది జ్వాల ఇచ్చింది.. దీన్ని ఎప్పుడు వదిలించుకుందాం అనుకున్నా.. కుదరట్లేదు.. ఈసారైనా వదిలించుకోవాలి’ అని మనసులో అనుకుంటూ కొబ్బరి బోండాలు అమ్మే వ్యక్తికి ఇవ్వబోతాడు. ‘అంత పెద్ద నోట్ ఇస్తే ఎలా సార్ అంటాడు ఆ వ్యాపారి. ‘అయితే ఉంచేసుకో పర్లేదు’ అంటాడు నిరుపమ్.

karthika deepam latest episode
karthika deepam latest episode

జ్వాలను ద్వేషిస్తున్న నిరూపమ్ :

నా కష్టంతో వచ్చిన డబ్బులే నేను తీసుకుంటాను’ అంటాడు ఆ వ్యక్తి. దాంతో నిరుపమ్ చిల్లరి తీసి ఇస్తాడు.అంతా హిమ చూస్తుంది.కారువైపు నడుస్తున్న నిరుపమ్‌తో.. అతడి చేతిలోని ఐదువందల నోట్ చూస్తూ.. ‘అదేంటి బావా చిల్లర ఉన్నా ఇదెందుకు ఇచ్చావ్’ అంటుంది హిమ. ‘దీన్ని ఎంత వదిలించుకుందామన్నా వీలు కావట్లేదు హిమా.. ఇది జ్వాల ఇచ్చింది.. కొందరు మనుషులు కూడా అంతే కదా.. ఎంత వదిలించుకుందాం అనుకున్నా వదిలిపెట్టరు అని అంటాడు నిరూపమ్.

karthika deepam latest episode
karthika deepam latest episode

శోభకు షాక్ ఇచ్చిన బ్యాంక్ మ్యానేజర్ :

సీన్ కట్ చేస్తే.. శోభకి బ్యాంక్ మ్యానేజర్ ఫోన్ చేసి మీరు లోన్ క్లియర్ చేయట్లేదు.. ఇది ఇలానే కంటిన్యూ అయితే మీ హాస్పెటల్‌ని సీజ్ చెయ్యాల్సి ఉంటుంది’ అంటాడు. దాంతో శోభ నేను కట్టేస్తాను’ అని వాడికి నచ్చజెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ‘నిరుపమ్‌ని ఎలాగైనా పెళ్లి చేసుకుని ఆ లోన్ మొత్తం ఒకేసారి కట్టెయ్యాలి అనుకుంటుంది.మరోవైపు జ్వాలకు అవార్డ్ ఇవ్వలనుకున్న హైదరాబాద్ క్లబ్ దగ్గరకు అవార్డులు అందుకునేవారు, చూసేవారు ఇలా చాలా మంది వస్తారు.ఇక కార్యక్రమం ప్రారంభం కావడంతో ఆనందరావు, సౌందర్యలు ముఖ్య అతిథులుగా స్టేజ్ మీదకు వెళ్తారు.

karthika deepam latest episode
karthika deepam latest episode

ఫంక్షన్ లో అతిధులుగా వచ్చిన సౌందర్య దంపతులు, హిమ :

హిమ మనసులో మాత్రం ఇలాంటి అవార్డ్‌లన్నీ అందరి కంటే ధైర్యంగా ఉండే సోర్యకే దక్కాలి అనుకుంటుంది మనసులో. ఇంతలోనే జ్వాల ఆ కార్యక్రమానికి ఎంట్రీ ఇస్తుంది. రావడం రావడమే స్టేజ్ మీదున్న సౌందర్య, ఆనందరావులను చూసి షాక్ అవుతుంది.అప్పుడే సైడ్‌కి చూస్తే తింగరి కనిపిస్తుంది జ్వాలకు. ‘తనొచ్చిందేంటీ? తనకి ఏదైనా అవార్డ్ వచ్చి ఉంటుందా?’ అనుకుంటూ వెనక్కి వెళ్లిపోవాలి అనుకుంటుంది. మళ్లీ ఒక్క క్షణం ఆగి.. ‘నేనేం తప్పు చేశానని తనని చూసి పారిపోవాలి?’ అనుకుంటూ అక్కడే జనాల మధ్యలో కుర్చీ ఉంటే కూర్చుంటుంది.

karthika deepam latest episode
karthika deepam latest episode

అవార్డు ఫంక్షన్ కి వచ్చిన జ్వాల:

ఇక అవార్డ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు.ఒక్కొక్కరిగా పేర్లు చెబుతూ వారు చేసిన గొప్ప పనులు చెబుతూ చాలా మందిని ఆహ్వానిస్తారు. అందరికీ సౌందర్య అవార్డ్‌లు ఇస్తూ ఉంటుంది. ఇక ‘దోపిడీ దొంగలను ఎంతో ధైర్యంతో పోలీసులకు అప్పగించిన జ్వాల అని చెప్పేసరికి జ్వాల వచ్చిందన్న విషయం హిమకు తెలుస్తుంది. అప్పుడు కూడా జ్వాల హిమని కోపంగా చూస్తూ పైకి వెళ్తుంది. సౌందర్య జ్వాలని చూస్తూ మనసులో.. ‘నా మనవరాలు అని చెప్పుకోలేని పరిస్థితి తెచ్చావా ఈశ్వరా’ అనుకుంటూ ఆనందరావు, సౌందర్యలు జ్వాలకు కంగ్రాట్స్ చెబుతారు.

తింగరే హిమ అని తెలుసుకున్న జ్వాల:

వెంటనే మైక్‌లో సౌందర్య మాట్లాడటం మొదలుపెడుతుంది. ‘ఈ అమ్మాయి నాకు బాగా తెలుసు.. ఒక రకంగా మేమిద్దరం స్నేహితులం.. ఇలాంటి ధైర్యం ఉన్న యంగ్ ఫ్రెండ్ నాకు ఉన్నందుకు చాలా గర్వపడుతున్నా’ అంటుంది సౌందర్య.
హిమ సంబరంగా చప్పట్లు కొడుతుంది. అది చూసిన జ్వాల మధ్యలో దీనికి ఇంత ఆనందం ఏంటో చప్పట్లు కొడుతుంది అనుకుంటుంది.ఇక సౌందర్య జ్వాలకు అవార్డ్ ఇవ్వబోతుంటే నిర్వాహకుల్లో ఒకరు వచ్చి ఈమెకు అవార్డ్ మీరు ఇవ్వడం లేదు.. మరొకరు ఇస్తారు అని మైక్ తీసుకుని ‘యంగ్ డాక్టర్ స్టేజ్ మీదకు రావాలని కోరుతున్నా’ అంటు హిమను పిలవగానే హిమ షాక్ అయిపోతుంది.

హిమ చెంప. పగలకొట్టిన జ్వాల:

హిమ పైకి వెళ్లగానే.. ‘ఈమె ఎవరో కాదు.. స్వయానా సౌందర్య గారి మనవరాలు డాక్టర్ హిమ’ అనేసరికి సౌర్యకు మైండ్ బ్లాక్ అవుతుంది. ఇక జ్వాల మాత్రం సౌందర్య, ఆనందరావుల వైపు షాక్ అవుతూ చూస్తుంది కోపంతో.మరోపక్క హిమ మనసులోనే అల్లాడిపోతుంది. ఇన్నాళ్లు ఏం జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది..’ అని బాధపడుతుంది. క్షణాల్లో సౌర్య హిమ చెంప పగలగొడుతుంది. అంతా షాక్ అయిపోతారు. సౌందర్య, ఆనందరావుల వైపు కోపంగా చూస్తూ.. ‘నువ్వు హిమవా?ఇన్నాళ్లు నాకు ఎందుకు చెప్పలేదు అని అరుస్తుంది.సౌర్య అది అని హిమ సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుంటే ‘చంపేస్తాను.. నిన్ను చంపేస్తాను.. ఇంత మోసం చేస్తావా? నా పక్కనే ఉన్నావ్,,నా ప్రేమని లాగేసుకుంటావ్.. నా డాక్టర్ సాబ్‌ని దూరం చేస్తావ్.. పెళ్లి చేసుకుంటావ్.. నువ్వు నువ్వు మహా మోసగత్తెవే..’ అని అరవడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.


Share

Related posts

Intinti Gruhalakshmi: ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నెక్స్ట్ వీక్ ఏం జరుగుతుందంటే.!?

bharani jella

నందుకి సవాల్ విసిరిన తులసి.. వసుధార, సాక్షికి బోనం గురించి చెప్పిన తులసి..!

bharani jella

డాక్టర్ బాబు బతికే ఉన్నాడా… ఉంటే ఎక్కడ ఉన్నట్టు అని ఎమోషనల్ అవుతున్న దీప..!

Ram