21.2 C
Hyderabad
December 8, 2022
NewsOrbit
Telugu TV Serials న్యూస్

Karthikadeepam serial today episode, November 4: ఊహించని షాక్ లో ఇంద్రుడు, చంద్రమ్మ..బిడ్డ కనిపించలేదు అనే బాధలో దీప..!

Share

Karthikadeepam serial today episode review November 4 :బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1501వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది.ఇక ఈరోజు నవంబర్ 4 న ప్రసారం కానున్న Karthika Deepam serial,1501వ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.

సౌర్య గురించి బాధపడుతున్న దీప :

durga with deepa
durga with deepa

ఇంద్రమ్మ చెప్పిన మాటలు దీపను అయోమయంలో పడేసాయి.అసలు వాళ్లు నిజం. చెబుతున్నారా… లేదా నా దగ్గర ఏమైనా దాస్తున్నారా అని సౌర్య గురించి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక దుర్గ మాత్రం దీపను ఓదార్చుతూ ఉంటాడు.అక్కడ ఉన్నది శౌర్య అయితే వాళ్ళు మిమ్మల్ని ఫంక్షన్ కి ఎందుకు పిలుస్తారు. వేరే అమ్మాయిని మీకు చూపించాల్సిన అవసరం ఏంటి? శౌర్య వాళ్ళ దగ్గరే ఉంటే అసలు మిమ్మల్ని చూడగానే వాళ్ళు ఊరు వదిలి పారిపోతారు. ఎక్కువగా ఆలోచించకు దీపమ్మ… ముందు మనం కార్తీక్ సార్ కి గతం గుర్తుకు వచ్చేలా చేయాలి అని దుర్గ నచ్చజెపుతాడు.

మోనితను అనుమానించిన కార్తీక్ :

karthik with mounitha
karthik with mounitha

ఇక మోనిత కారు దగ్గరకి కార్తీక్ ని తీసుకుని వస్తుంది. అయితే అక్కడ మెకానిక్ ఉండడు. మెకానిక్ లేడు ఏంటి అని మోనితను అడగగా వచ్చి రిపేర్ చేసి వెళ్లిపోయాదని మోనిత అంటుంది. అయినా మోనిత మాటలు కార్తీక్ నమ్మడు. కారుని వదిలేసి ఆటో ఎందుకు ఎక్కావ్ అని మోనితను గుచ్చి గుచ్చి అడుగుతాడు.ఇక మోనిత ఏమి చేయలేక కోపంగా తన తలను కారుకేసి కొట్టుకుంటుంది. కార్తీక్ మోనితను ఆపకుండా ఎలాగైన వీళ్ళ నుంచి సౌర్యను కాపాడుకోవాలి అనుకుంటాడు. ఇక మోనిత కార్తీక్ ని చూసి ఏంటి ఇలా మారిపోయావ్..తల కొట్టుకుంటున్నా ఆపాలని కూడా అనుకోవడం లేదు ఏంటి అని అడుగుతుంది. ఎందుకు ఆపడం మెకానిక్ తెలుసు అన్నావ్ కదా కారుకు ఏదైనా అయితే వచ్చి రిపేర్ చేస్తాడులే అని చెప్పి వెళ్ళిపోతాడు. కార్తీక్ ఇలా మారిపోవడానికి కారణాం ఆ వంటలక్క అని కోపంతో దీప ఇంటికి వెళ్తుంది మోనిత.

దీప, మోనితల మధ్య గొడవ…:

deepa warns to mounitha
deepa warns to mounitha

దీపను చూసిన మోనిత ఆవేశంతో చూడటానికి అమాయకంగా కనిపించే నువ్వు ఏం నాటకాలు ఆడుతున్నావ్, ఏం మాయమాటలు చెప్పావ్ నా కార్తిక్ కు అని మోనిత అరుస్తుంది. నోరు ముయ్ నా మొగుడ్ని నువ్వు ఎత్తుకుపోయి నీ మొగుడికి నేను గాలం వేసినట్టు మాట్లాడుతున్నావ్ ఏంటే అని మోనిత మీద అరుస్తుంది దీప.ఇప్పుడు కార్తీక్ నా వాడు నా సొంతం అంటుంది మోనిత.అవునా మరి ఎందుకు గొంతు చించుకుంటున్నావ్.. సంతోషంగా ఉండకుండా నా దగ్గరకు వచ్చి అరుస్తున్నావ్.దుర్గ రెడీ గా ఉన్నాడు నిన్ను తరిమి తరిమి కొడతాడు. నిన్ను ఇప్పటికిప్పుడే అడ్డు తొలగించగలను కానీ నువ్వు నా భర్తని కాపాడి నాకు అప్పగించావ్ అని అంటుంది దీప.కార్తీక్ ని నా సొంతం చేసుకుని తీరతాను, నా ప్రాణాలు పోయినా సరే కార్తీక్ ని వదిలిపెట్టను అను దీపకు గట్టిగా చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది మోనిత.

ఊరు వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్న ఇంద్రుడు :

durga chandramma conversation
durga chandramma conversation

సీన్ మళ్ళీ చంద్రమ్మ దగ్గర ఓపెన్ అవుతుంది. ఇంట్లో ఇంద్రుడు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది చంద్రమ్మ. అంతలోనే ఇంద్రుడు కూడా చాలా టెన్షన్ గా వచ్చి శౌర్య వాళ్ళ నాన్న రోడ్డు మీద కనిపించాడు నన్ను పిలిచాడు కానీ తప్పించుకుని వచ్చేశాను అని చెప్తాడు. చంద్రమ్మ కూడా దీప ఇంటికి వచ్చిందని చెప్పడంతో ఇద్దరు కంగారు పడతారు. ఊరి వదిలి వెళ్లిపోదాం అంటే జ్వాలమ్మ ఒప్పుకోదు కదా ఏమి చేయాలి అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఆనందరావు, హిమ అక్కడికి వస్తారు.వాళ్ళను చూసి ఇద్దరు షాక్ అవుతారు.

కార్తీక్ లో వచ్చిన మార్పుకు కారణం ఏంటి అని ఆలోచనలో పడ్డ దీప :

deepa request to karthik
deepa request to karthik

సీన్ కట్ చేస్తే దీప మళ్ళీ శౌర్య గురించే ఆలోచిస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే దుర్గ వస్తాడు. నిజంగా శౌర్యమ్మ అక్కడే ఉంటే నేను వెళ్ళి తీసుకొస్తాను అని దుర్గ వెళ్లబోతుంటే కార్తీక్ వచ్చి దుర్గను ఆపి, రేపు మేము వెళ్ళి మాట్లాడతామూలే అని అంటాడు. సరే అంటాడు దుర్గ. నువ్వు శౌర్య గురించి ఆలోచించకు మనం వెతుకుదాం తప్పకుండా దొరుకుతుందని చెప్తాడు. ఇంతకముందు ఎప్పుడో గాని నా దగ్గరకి వచ్చేవారు కాదు కానీ ఇప్పుడు ఎక్కువసేపు నాదగ్గరే ఉంటున్నారు మోనిత మీద అనుమానం వచ్చిందా లేక గతం ఏమైనా గుర్తుకు వచ్చిందా అని దీప అనుమానపడుతుంది. అటు మోనిత కూడా కార్తీక్ ప్రవర్తన గురించి ఆలోచిస్తూ ఏదో జరుగుతుంది తెలుసుకోవాలి అని అనుకుంటుంది.

ఆనందరావు ఎంట్రీతో ఇంద్రుడు, చంద్రమ్మ షాక్ :

sourya hima with family
sourya hima with family

ఇక ఆనందరావు మాత్రం సౌర్యను మన ఇంటికి వెళ్దాం రమ్మని పిలుస్తాడు. శౌర్య మాత్రం నేను రాను తాతయ్య అని కోపంగా చెప్తుంది. అమ్మానాన్నలు కనిపించే వరకు నేను ఇక్కడే ఉంటాను అని అంటుంది.అంతే అమ్మానాన్నలు తప్పిపోలేదు చనిపోయారు అని ఆనందరావు చెప్తాడు. ఎంత బతిమలాడినా శౌర్య మాత్రం రానని చెప్పేస్తుంది.


Share

Related posts

Kadapa: ప్రమాద బాధిత కుటుంబాలకు పది లక్షల పరిహారం

somaraju sharma

టీ కాంగ్రెస్ లో మరో కీలక వికెట్ డౌన్..??

sekhar

Devatha Serial: మాధవ్ ను వాళ్ళ అమ్మానాన్నల దగ్గర రాధ అడ్డంగా బుక్ చేసిందా.!? దేవికి దగ్గరైన భాగ్యమ్మ..!

bharani jella