NewsOrbit
Telugu TV Serials న్యూస్

Karthikadeepam serial today episode review October 28: సౌర్యను నిజంగానే దీప చూస్తుందా… లేక మోనిత చేసే కుట్రకు బలికానుందా..?

karthika-deepam-serial-2022-today-episode-review-october-28-highlights-with-hd-pictures

Karthikadeepam serial today episode review,28 October 1495 episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1495వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది.ఇక ఈరోజు అక్టోబర్ 28న ప్రసారం కానున్న Karthika Deepam serial నేటి ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.Karthika Deepam Today Episode Written Update.

Karthika Deepam Serial Today Episode Review October 27:గత ఎపిసోడ్ లో దీప, కార్తీక్ లే సౌర్య అమ్మా నాన్నలు అనే విషయాన్ని ఇంద్రుడు తెలుసుకుని వాళ్ళని ఇంటికి రాకుండా ఎలా గోలా మేనేజ్ చేసి అక్కడ నుండి తప్పించుకుని వెళ్ళిపోతాడు. ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా ముందుకు సాగిందనే చెప్పాలి.

indrudu feel about sourya
indrudu feel about sourya

Karthikadeepam సౌర్య గురించి బాధపడుతున్న ఇంద్రుడు :


ఇక ఈరోజు ఎపిసోడ్ లో సౌర్యని వాళ్ళ తల్లిదండ్రులు తీసుకెళ్లిపోతారేమో అని ఇంద్రుడు బయపడతాడు.పిల్లలు లేక చాలా సంవత్సరాల నుంచి నేను, చంద్రమ్మ ఏడుస్తునే ఉన్నాము. అలాంటి మకు జ్వాలమ్మ తోడుగా వచ్చింది.ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి జ్వలమ్మను తీసుకెళ్లి పోతే చంద్రమ్మ చనిపోతుంది. పాపని ఎప్పటికీ వాళ్లకి ఇవ్వను. పాపని తీసుకొని వేరే ఊరు వెళ్లిపోతాం అని అనుకుంటాడు ఇంద్రుడు.

karthik deepa happy  with sourya
karthik deepa happy with sourya

సౌర్య ఆచూకీ తెలియడంతో సంతోషంలో కార్తీక్, దీపలు :


ఇక ఇంద్రుడు వెళ్లిపోవడంతో కార్తీక్, దీపలు కూడా కారులో ఇంటికి బయలుదేరతారు.కార్తీక్ దీపా ఇద్దరు సౌర్య గురించే ఆలోచిస్తూ ఉంటారు.రేపు మన పాపని చూస్తాను అన్న ఊహ చాలా ఆనందంగా ఉంది డాక్టర్ బాబు అని అంటుంది దీప. అయినా మనం అతన్ని వదిలేసాం, అతని వెనక ఫాలో అయ్యి ఇంటికి వెళ్ళవలసింది డాక్టర్ బాబు అని దీప అంటుంది. అవును నువ్వు పడుతున్న బాధ చూసి అతని ఫాలో అయి అతని ఇంటికి వెళ్దాం అని అనిపించింది. తీరా వెళ్ళాక నువ్వే శౌర్య వాళ్ళ అమ్మవి అని తెలిసిపోతుంది అని ఊరుకున్నాను అని అంటాడు. తెలిస్తే ఏమిటి ఆమె నా బిడ్డే కదా ఇవ్వకుండా ఉంటారా ఏమిటి అని అంటుంది దీప. అలా అని కాదు పాప ఫంక్షన్ కోసం అంత హడావుడి పడుతున్నాడు అంటే ఆమె వాళ్ళ కన్నబిడ్డ అయి ఉండాలి లేదంటే సౌర్యను వాళ్ళ కన్నబిడ్డ లాగా అయినా చూసుకొని ఉండాలి అని అంటాడు కార్తీక్..
నాకు తెలిసి ఆ పాప వాళ్ల కన్నబిడ్డ కాదు తను మన శౌర్యనే కాకపోతే వాళ్ల మన బిడ్డను వాళ్ళ కన్నబిడ్డ లాగా పెంచుతున్నారు అని నమ్మకంగా అంటుంది దీప. అయినా అతన్ని ఫాలో అవ్వకుండా తిరిగి వచ్చేస్తున్నందుకు మీ మీద కోపం వచ్చింది డాక్టర్ బాబు.కానీ మీ మాటలు విన్నాక మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను మన్నించండి అని అంటుంది దీప.
మన బిడ్డ గురించి నేను ఆలోచించకుండా ఎలా ఉంటాను అనుకుంటాడు కార్తీక్ మనసులో

indrudu reveals secret to chandramma
indrudu reveals secret to chandramma

ఇంద్రుడు అసలు నిజాన్ని చంద్రమ్మకు చెబుతాడా.. లేదా..?


ఇక ఇంటికి వచ్చిన ఇంద్రుడిని చూసి ఎందుకు అలా ఉన్నావ్ అని చెప్పిన సామాన్లు అన్నీ తెచ్చావా అంటుంది చంద్రమ్మ.ఇక ఇంద్రుడు ఏదో ఆలోచిస్తూ తెచ్చిన సామానులను చంద్రమ్మ చేతిలో పెడతాడు. ఇవన్నీ దొంగతనం చేసావా అని నిలదీస్తుంది చంద్రమ్మ.అలా ఏం లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంద్రుడు. సీన్ కట్ చేస్తే మోనిత కావేరితో ఫోన్లో మాట్లాడుతుంటుంది. నువ్వు పంపించిన వాణి ఏమీ చేయటం లేదు అని అంటుంది మోనిత. తనని తక్కువ అంచనా వేయకు అనుకున్న పని పూర్తి చేస్తుంది అంటుంది కావేరి. ఏమో నాకు టెన్షన్ గా ఉంది అన్న మోనిత మాటలు విన్న కార్తీక్ ఎందుకు టెన్షన్ గా ఉంది అని అడుగుతాడు.

karthik listen mounitha discussion
karthik listen mounitha discussion
కావేరితో మోనిత మాట్లాడిన మాటలు కార్తీక్ విన్నాడా..?


మోనిత షాక్ అయ్యి ఏమీ లేదు కార్తీక్ ఊరికే మా ఫ్రెండ్ కావేరితో మాట్లాడుతున్నాను అని అంటుంది. ఇప్పుడు ఆవిడతో నీకేం పని అని అంటాడు కార్తీక్. ఫ్రెండ్ పని ఉంటేనే ఫోన్ చేస్తామా దుర్గతో మాట్లాడితే అనుమాన పడతావ్ ఈమే తో మాట్లాడినా కూడా అనుమాన పడతావా అని అంటుంది మోనిత. నువ్వు చేసిన పనులు అలా ఉన్నాయి కాబట్టే నీ మీద అనుమానం వచ్చింది అంటాడు కార్తీక్.నువ్వు దీపతో తిరిగి వచ్చావు.నేను నిన్ను ఎక్కడ నిలదీస్తాను అని నా మీద రివర్స్ అవుతున్నావు అని అంటుంది మోనిత.

karthik fire on durga
karthik fire on durga
దుర్గను వెళ్ళిపో అని సీరియస్ గా చెప్పిన కార్తీక్ :

సరిగ్గా అప్పుడే ఏదో మాట్లాడ్డానికి వచ్చిన దుర్గను చూసిన కార్తీక్ మేము చాలా సీరియస్ గా మాట్లాడుకుంటున్నాము మీరు వెళ్ళండి అని అంటాడు కార్తీక్. సరే అని దుర్గ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దుర్గ వెళ్ళగానే చూడు మోనిత నేను నీ భర్తని అని పక్క ఆధారాలతో నిరూపించు లేకపోతే నోరు మూసుకొని కూర్చోఅని అక్కడ నుండి కోపంగా వెళ్ళిపోతాడు కార్తీక్.శౌర్య పెద్దమనిషి అయిందని చాలా సంతోషంగా ఉంది కానీ ఈ సమయంలో నేను దగ్గర ఉండి తన బాగోగులు చూసుకోవాలి కానీ ఈరోజు చుట్టం చూపులాగా వెళుతున్నాను అని బాధపడుతుంది. తనకోసం పిండి వంటలు చేస్తుంటుంది.
deepa speak about sourya
deepa speak about sourya


వాణికి సౌర్య గురించి చెప్పేసిన దీప:

అప్పుడే అక్కడికి వచ్చిన వాణి ఎందుకు వదిన ఇవన్నీ చేస్తున్నారు అని అడుగుతుంది. దీప జరిగినది మొత్తం వాణికి చెబుతుంది.మా పాపను చూసిన డాక్టర్ బాబుకి గతం గుర్తుకు వస్తే ఇక నా జీవితానికి అది చాలు అని సంతోషంగా వాణికి చెప్తుంది. అంతా విన్న వాణి ఈ విషయం ఎలాగైనా మౌనితకి చెప్పాలి అని కంగారుగా మోనిత దగ్గరకు వెళ్లి అంతా చెప్పేస్తుంది.
mounitha reaction about deepa
mounitha reaction about deepa


వాణి చెప్పిన మాటలు విని మోనిత ఎలాంటి ఘోరం చేస్తుందో..?

వాణి మాటకలు విన్న మోనిత అలా ఎప్పటికీ జరగకూడదు.ఇన్ని సంవత్సరాల ప్రయత్నం వృధా అవుతుంది అని అంటుంది.చూడు వాణి వాళ్ళు పొద్దునే సూర్యోదయం చూడకూడదు అని అంటుంది మోనిత. అలాగే మీకెందుకు పని అయిపోయినట్టే క్యాష్ రెడీ చేసుకోండి అని ధీమాగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వాణి. మరి తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Jagadhatri April 19 2024 Episode 209: కౌశికి హార్డ్ డిస్క్ పట్టుకునే ప్రయత్నంలో ల్యాండ్ ని కోల్పోతుందా..

siddhu

Trinayani April 19 2024 Episode 1217: నైనిని చంపడానికి తిలోత్తమ వేసిన ప్లాన్, ఉసిరి దీపాలను ఎగరగొట్టిన సుమన.

siddhu

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

bharani jella

Brahmamudi April 19 2024 Episode 388: బాబుకి ప్రమాదం.. నిజం చెప్పక ఇంటికి దూరం కానున్న రాజ్ .. నిజం బయట పెడతానన్నా సుభాష్.. అంతా తెలుసుకున్న కావ్య..

bharani jella

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu