NewsOrbit
Telugu TV Serials న్యూస్

Karthikadeepam serial today episode, october 31: మనసు మార్చుకున్న ఇంద్రుడు… సౌర్యకు అమ్మా నాన్నలను దగ్గర చేయనున్నాడా..??

karthika-deepam-serial-2022-today-episode-review-october-31-highlights-with-hd-pictures

Karthikadeepam serial today episode review October 31: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1497వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది.ఇక ఈరోజు అక్టోబర్ 30న ప్రసారం కానున్న Karthika Deepam serial,1497 వ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో సౌర్యను చూస్తున్న అనే ఆనందంలో కార్తీక్, దీపలు ఉంటారు. మరో పక్క మోనిత వేసిన ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో కోపంతో రగిలిపోతుంది మోనిత. ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ మరింత ఆసక్తిగా ముందుకు సాగిందనే చెప్పాలి.శౌర్యని చూడాలని దీప, కార్తీక్ చాలా ఆత్రంగా ఎదురుచూస్తూ ఉంటారు. ఇక దీప సంతోషానికి అయితే అవధులు లేవు.డాక్టర్ బాబు ఎక్కువ సేపు నాతోనే ఉంటున్నారు, మోనితని కొద్ది కొద్దిగా పట్టించుకోవడం మానేస్తున్నారు అని సంతోష పడుతుంది. డాక్టర్ బాబుకు శౌర్యని చూడగానే గతం గుర్తుకు రావాలి అని దీప ఆశపడుతుంది.

indrudu chandramma reaction
indrudu chandramma reaction

 

జ్వాల కోసం ఇంద్రుడు, చంద్రమ్మ ఆరాటం :

తర్వాత సీన్ చంద్రమ్మ, ఇంద్రుడు దగ్గర ఓపెన్ అవుతుంది. చంద్రమ్మ చాలా సేపటి నుంచి ఇంద్రుడు గురించి ఎదురు చూస్తూ ఉంటే అప్పుడే వస్తాడు.రాగానే చంద్రమ్మ ఒకవేళ జ్వాలమ్మ నీకు దూరం అయిపోతే ఏమై పొతావ్ అని అంటాడు. ఆ మాటకి చంద్రమ్మ ఎందుకు అలా అంటున్నావ్ నాదగ్గర ఏదో దాస్తున్నావ్ అని అంటుంది. జ్వాలమ్మ మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళదు అని చంద్రమ్మ అంటుంది.లేదు జ్వాలమ్మ మనల్ని వదిలి వెళ్ళిపోతుంది.జ్వాల కోసం కాసేపటిలో వాళ్ళ అమ్మానాన్నలు ఇక్కడికి వస్తారు అనుకుని… నేను వాళ్ళ దగ్గరకి వెళ్లను నా బిడ్డని వాళ్ళకి అప్పగించను అని ఇంద్రుడు మనసులో అనుకుంటాడు.

karthik deepa happy to see  sourya
karthik deepa happy to see sourya

బిడ్డను చూడబోతున్న ఆనందంలో కార్తీక్, దీపలు :

సీన్ కట్ చేస్తే కారులో శౌర్య కోసం వెళ్తు దీప చాలా సంతోషంగా ఉంటుంది. జరిగిన సంఘటనలు అన్నీ గుర్తు చేసుకుని దీప ఎమోషనల్ అవుతుంది. ఆరోజే శౌర్య కనిపించినప్పుడే వెళ్తే దొరికేది కదా అని కార్తీక్ అంటాడు. ఆ రోజు నేను మీరు కనిపించడంలో అనే కంగారులో ఉన్నా అని అంటుంది దీప.నేను ఎక్కడికి వెళ్తాను వస్తాను కదా అని నోరు జారతాడు కానీ మళ్ళీ ఏదోలా కవర్ చేసుకుంటాడు. కార్తీక్ మాటలు విన్న దీప డాక్టర్ బాబులో చిన్నగా మార్పు వస్తుంది అని సంతోషపడుతుంది.

indrudu with sourya
indrudu with sourya

 

అమ్మ కోసం సౌర్య పడే బాధ చూసి కరిగిపోయిన ఇంద్రుడు :

మళ్ళీ చంద్రమ్మ దగ్గర సీన్ ఓపెన్ అవుతుంది.ఏమీ లేదు పాప వెళ్ళిపోతే నువ్వు బ్రతకగలవా అని చంద్రమ్మను అడుగుతాడు ఇంద్రుడు. తను పెద్దమనిషి మాత్రమే అయింది పెళ్లి చేసి పంపించేయట్లేదు ఎందుకు అలాగా బాధ పడిపోతున్నావ్ అని అడుగుతుంది చంద్రమ్మ.బిడ్డ వెళ్ళిపోతే చంద్రమ్మ బ్రతకలేదు నేను బిడ్డను ఇవ్వను అని అనుకుంటాడు ఇంద్రుడు. సరే అని పాపని రెడీ చేయడానికి వెళ్తుంది చంద్రమ్మ. కానీ శౌర్య మాత్రం వంటలు జరిగే దగ్గరకి వచ్చి నిలబడి దీపని గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంటుంది.వంటలు చేసే దగ్గర అమ్మ ఉంది నేను వెళ్ళాలి అని ఏడుస్తుంటే ఇంద్రుడు వచ్చి అక్కడ అమ్మ లేదమ్మా అని అంటాడు. అమ్మ కావాలి బాబాయ్, అమ్మని చూడాలని అనిపిస్తుందని శౌర్య ఏడుస్తుంది.శౌర్య బాధ చూసి ఇంద్రుడు తన మనసు మార్చుకుంటాడు. నువ్వు ఎడవకు తల్లి.నీ కళ్ళలో ఆనందం చూడాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

mounitha fire
mounitha fire
కోపంతో రగిలిపోతున్న మోనిత :

మరోపక మోనిత కోపంతో ఇంట్లో అన్నీ సామాన్లు పగలగొడుతూ ఆవేశంతో ఊగిపోతు ఉండగా శివ వచ్చి ఆపుతాడు. ఏమైంది మేడమ్ అని అడుగుతాడు కానీ మోనిత పట్టించుకోకుండా దీపని తిడుతూ ఉంటుంది. నా కార్తీక్ ని వదలవా నిన్ను చంపేస్తాను వంటలక్కా అని గన్ తెచ్చి శివ తలకి గురి పెడుతుంది.ఇక శివ బతిమలాడుతూ ఉంటాడు.

karthik deepa happy to see
karthik deepa happy to see
కార్తీక్, దీపలను ఇంటికి తీసుకువస్తున్న ఇంద్రుడు :

ఇక కార్తీక్, దీప ఇంద్రుడు చెప్పిన చోటుకి వచ్చి తనని వెతుకుతూ ఉంటారు. అక్కడ ఇంద్రుడు ఆటో లేకపోయేసరికి దీప కంగారుపడుతుంది.అప్పుడే ఇంద్రుడు ఆటో వేసుకుని వస్తాడు. వెంటనే వాళ్ళని తీసుకుని బయల్దేరతాడు. అటు ఇంద్రుడు కోసం శౌర్య, చంద్రమ్మ ఎదురు చూస్తూ ఉంటారు. ఇంద్రుడు శౌర్యతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుని ఏడుస్తాడు.నిన్ను పంపించకూడదనే అనుకున్నా కానీ నువ్వు అమ్మానాన్న కోసం అలా ఏడుస్తుంటే చూసి భరించలేకపోయాను. బిడ్డ కనిపించకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు అదే బాధ మీ అమ్మానాన్నకి కూడా ఉంటుంది కదా. అందుకే మీ అమ్మానాన్నల్లో మమ్మల్ని చూసుకుని నిన్ను ఇచ్చేస్తున్నా అని ఇంద్రుడు బాగా ఎమోషనల్ అవుతాడు. కార్తీక్ వాళ్ళు ఆటోని ఫాలో అవుతూ రావడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.మరి కార్తీక్, దీపలను సౌర్య చూస్తుందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం..

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N