Categories: Telugu TV Serials

Karthika Deepam: పెళ్లి పత్రికతో హిమ ఇంటికి వచ్చిన నిరూపమ్.. జ్వాలకు దగ్గర అవుతున్న సౌందర్య..!

Share

Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. గత ఎపిసోడ్ లో సౌందర్యకు సౌర్య గురించి తెలియడం, సౌందర్య శోభకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. అలాగే శోభ ఒక మాస్టర్ ప్లాన్ వేసి హిమను జ్వాలకు చూపించాలని అనుకోవడంతో కధ మరింత ఆసక్తిగా మారిందనే చెప్పాలి. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం. ఈరోజు ఎపిసోడ్ లో హిమ రోడ్డు మీద నిలబడి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి జ్వాల వస్తుంది. హిమను అక్కడ చూసి నీ ముఖం నాకు చూపించకు అంటూ జ్వాల చిరాకు పడుతుంది.

Karthika Deepam: హిమపై ఫైర్ అయిన జ్వాల :

అప్పుడు హిమ జ్వాలతో మాట్లాడాలని ఎంత ప్రయత్నించినా కూడా జ్వాల మాట్లాడే ప్రయత్నం చేయదు.నువ్వు తింగరివి కాదు మోసకారివీ అంటూ హిమను అపార్థం చేసుకుంటుంది. అప్పుడు జ్వాల ఉన్నట్టుండి నీ పేరు ఏంటో చెప్పవే..నీ పేరు కూడా పచ్చబొట్టు పొడిపించుకుంటాను.. ఒకటి అమాయకపు మాటలతో మా అమ్మా నాన్నలను పొట్టన పెట్టుకుంది. నువ్వు నంగనాచిలా నన్ను నమ్మించి నా జీవితాన్నే లాగేసుకున్నావ్ అని చెప్పి అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతుంది.

శుభలేఖతో హిమ ఇంటికి వచ్చిన నిరూపమ్ :

సీన్ కట్ చేస్తే మరుసటి రోజు హిమ మాత్రం జ్వాల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది.దీనికంతటికీ కారణం ఆ శోభనే అని శోభ పై కోపంతో రగిలి పోతూ ఉంటుంది.ఇంతలో అక్కడికి ఆనంద్ రావ్ వచ్చి హిమతో మాట్లాడుతూ ఉండగా నిరుపమ్, స్వప్న వచ్చి శనివారం పెళ్లి అని పెళ్లి పత్రిక తీసుకొని వచ్చి హిమకు చూపించడంతో హిమ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ తరువాత పెళ్లి పత్రిక ను ఆనంద్ రావుకు ఇచ్చి అక్కడనుంచి వెళ్ళి పోతారు.

జ్వాల ఇంటికి వెళ్లిన సౌందర్య:

మరొకవైపు సౌందర్య, జ్వాల ఇంటికి వెళ్తుంది.సౌందర్య జ్వాల ఇంటికి వెళ్లడాన్ని శోభ దగ్గర పని చేసే శాంతాభాయ్ చూసి. ఈ విషయం శోభమ్మకు చెప్పాలా వద్దా అని ఆలోచనలో పడుతుంది.సౌందర్య జ్వాలా ఇంటికి వెళ్లి చూడగా అక్కడ ఇల్లంతా చిందరవందరగా ఉంటుంది. అలాగే హిమ, నిరుపమ్ ఫోటోలు కూడా చింపివేసి ఇల్లంతా పడి ఉంటాయి.అప్పుడు జ్వాల పడుకొని ఉండగా సౌందర్య నిద్రలేపకుండా ఇళ్లు మొత్తం క్లీన్ చేసి జ్వాల ఇంటి ముందు ముగ్గు వేస్తుంది. జ్వాల నిద్రలేచి చూసే సరికి సౌందర్య ఇల్లు మొత్తం క్లీన్ చేయడంతో ఆశ్చర్యపోతుంది. ఏంటి సీసీ ఇది అని జ్వాల అనడంతో మన ఇద్దరం ఇప్పుడు ఫ్రెండ్స్ అయ్యాం కదే అని ఇద్దరు ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు.

డాక్టర్ సాబ్ కు ఆటో ఇచ్చేసిన జ్వాల:

మరొకవైపు ఆనంద్ రావు, హిమలు పెళ్లి విషయం తలుచుకుని బాధ పడుతూ ఉంటారు.అప్పుడు శోభ గురించి ఆనంద్ రావ్ కి చెబుతుంది. ఎలా అయిన జ్వాలకి బావకి పెళ్లి చేయాలి తాతయ్య అని అంటుంది హిమ. ఇక రేపటి ఎపిసోడ్ లో జ్వల ఆటోనీ తీసుకొని వెళ్లు నిరుపమ్ ఇంటి ముందు పెట్టి ఆటో తాళాలు నిరూపమ్ చేతిలో పెడుతుంది.


Share

Recent Posts

గుండెకు హత్తుకునే సినిమాలు చేయాలి అంటున్న బండ్ల గణేష్..!!

మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…

14 mins ago

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

1 hour ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

2 hours ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

3 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

4 hours ago

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…

5 hours ago