Categories: Telugu TV Serials

Karthika Deepam: స్వప్న మనసులో శోభ పెట్టిన చిచ్చు… ఊరు వదిలి వెళ్ళిపోనున్న జ్వాల..!

Share

Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. ఇంతకీ నిరూపమ్ పెళ్లి శోభ, సౌర్య, హిమలలో ఎవరితో జరిగిద్దో అనే టెన్షన్లో ప్రేక్షకులు ఉన్నారు. ఎవరికీ వారు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ నిరూపమ్ ను దక్కించుకోవాలని చూస్తున్నారు. శోభ అయితే ఎలాయినా నిరూపమ్ ను పెళ్లి చేసుకోవాలని చూస్తుంది. ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ ఎంతో ఆసక్తిగా ముందుకు సాగిందనే చెప్పాలి. పెళ్లి ఆపడానికి స్వప్న మనసులో అలజడి రేపుతుంది శోభ.. అసలు నిజాలను తన నోటితో చెప్పకుండా స్వప్న తెలుసుకొనేలా తనలో అనుమానాలను రేకేత్తిస్తుంది.

Karthika Deepam:  హిమపై అనుమానం రికేత్తించిన శోభ :

ఈ తరుణంలోనే ఆంటీ హిమ ఏదో మన దగ్గర దాస్తుందని నాకు అనిపిస్తోంది అని అంటుంది.అసలు ఆ రోజు పెళ్లి పీటల మీద నుంచి లేచి వెళ్లిపోవడానికి కారణం ఏంటో ఇప్పటికి ఎవరికీ తెలీదు.. హిమ కూడా ఎంతమంది అడిగినా చెప్పలేదు. హిమ నేను నిరుపమ్‌ని పెళ్లి చేసుకోను అని అంటుంటే మీరయినా వదిలిపెట్టేయొచ్చుగా ఆంటీ..ఎవరికో ఇచ్చి నిరుపమ్ కు పెళ్లి చేయడం ఏంటీ? అసలు ఎవరికీ ఇచ్చి పెళ్లి చేస్తా అంటుంది..ఏదో తేడా కొడుతుంది ఆంటీ? అని స్వప్నలో అనుమానం పెంచుతుంది. మీరు తన మీద ఓ కన్నువేసి ఉంచడం మంచిది అంటుంది.

అడ్డంగా స్వప్నకు బుక్ అయిన సౌందర్య, హిమలు :

హిమపై అనుమానం వచ్చిన స్వప్న నేరుగా సౌందర్య ఇంటికి బయలుదేరుతుంది.హిమ ఏమో సౌర్య కోసం రవ్వఇడ్లీ చేసి బాక్స్‌లో పెట్టి నానమ్మ తాతయ్యలకు ఇచ్చి సౌర్యకు రవ్వ ఇడ్లీ అంటే చాలా ఇష్టం నాన్నమ్మా అందుకే నేనే స్వయంగా చేశాను తీసుకుని వెళ్లి తనకు ఇవ్వండి అంటుంది హిమ. సరిగ్గా అప్పుడే గుమ్మం దగ్గరుకు వచ్చిన స్వప్న ఎవరికీ?ఇచ్చేది అంటుంది.అందరు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి బిత్తరపోయి అలానే చూస్తూ ఉండిపోతారు.అప్పుడే జ్వాల కూడా సౌందర్యకు కాల్ చేస్తుంది.సౌందర్య కంగారు పడుతూనే ఫోన్ లిఫ్ చేసి హా జగదీశ్వరీ.. వస్తున్నామే’ అంటూ ఫోన్ కట్ చేసి నా ఫ్రెండ్ జగదీశ్వరీ అనీ,తన కోసం వెళ్తున్నాం అంటూ స్వప్నకు చెబుతుంది. లేదు నాకు ఏదో తేడా కొడుతుంది.

సౌందర్యను నిలదీసిన స్వప్న :

మీరు ఏదో నా దగ్గర దాస్తున్నారు అంటుంది.కొత్తగా మీరేం ప్లాన్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు.నిశ్చితార్థం రోజు మీ మనవరాలు లేచి వెళ్లినట్లుగా, పెళ్లి పీటల మీద నుంచి లేచి వెళ్తే మా పరువు మొత్తం పోతుందో అని భయంగా ఉంది’ అంటుంది స్వప్న. దాంతో సౌందర్య అలా ఎందుకు జరుగుతుంది’ అంటుంది. వెంటనే హిమ.. చూడు స్వప్న అత్తా…బావ పెళ్లి జరుగుతుంది నేను మాటిస్తున్నాను’ అని చెప్పి లోపలికి వెళ్లిపోతుంది.

శోభకు పెళ్లికొడుకుని చూసిన నిరూపమ్ :

సీన్ కట్ చేస్తే నిరుపమ్ తన ఇంట్లో తన పెళ్లి కార్డు చూసుకుని సంతోషపడుతూ ఉంటాడు. ఇంతలో శోభ కాల్ చేస్తుంది. నిరుపమ్ నీ పెళ్లికి ఏం గిఫ్ట్ కావాలి?’ అంటుంది శోభ. ‘శోభా నీకే నేను గిఫ్ట్ ఇస్తాను అంటాడు నిరూపమ్.. ఏంటి అని శోభ అంటే నీకు మాంచి మొగుడ్ని గిఫ్ట్‌గా ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పి వర్మా అని నా ఫ్రెండ్.. కెనడాలో ఉంటాడు. త్వరలోనే ఇండియా వచ్చి సెటిల్ అవుతాడట. నీ ఫొటోస్ ఆల్ రెడీ తనకి పంపిచాను.. త్వరలోనే గుడ్ న్యూస్ వింటాం అని చెప్పడంతో శోభ మనసులోనే రగిలిపోతూ సరే అని అంటుంది. ఇక ఫోన్ పెట్టేసాక నిరుపమ్ నువ్వు ఏం అనుకుంటున్నావో తెలియదు కానీ.. కచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకుని తీరతాను’ అని తనలో తనే రగిలిపోతుంది శోభ.

ఊరు వదిలి వెళ్ళిపోతాను అంటున్న జ్వాల :

ఇక హిమ చేసిన టిఫిన్ తీసుకుని సౌర్య దగ్గరకు వెళ్తారు సౌందర్య, ఆనందరావులు.టిఫిన్ తింటునే ఆ తింగరి నన్ను అలా మోసం చేసింది.. ఇలా మోసం చేసింది’ అంటూ చెబుతూనే ఉంటుంది జ్వాల. ఇక. సౌందర్య ఉన్నటుండి చూడు జ్వాల.. ఆ తింగరీ కూడా నీ కంటే ముందు మీ డాక్టర్ సాబ్‌ని ప్రేమించి ఉంటుందేమో కధ అంటుంది. అది విన్న జ్వాల ఒకవేళ అదే నిజమైతే.. నాకు చెప్పి ఉంటే.. నేనే దగ్గర ఉండి వాళ్ల పెళ్లి చేసేదాన్ని కదా.. ఇంత దాకా రానిచ్చేదాన్ని కాదుగా అంటుంది జ్వాల. ఇక జ్వాలపై సౌందర్య చూపించే ప్రేమ చూసి వీళ్లకి నేనే సౌర్యను అనే నిజం తెలిసిపోయిందా అనే అనుమానం వస్తుంది.వెంటనే జ్వాల ‘నా మనసు విరిగిపోయింది సీసీ.. ఇక్కడ నుంచి వెళ్లిపోతాను. ‘మా పిన్నీ, బాబాయ్ రాగానే అంతా వాళ్లకి చెప్పేసి ఊరు వదిలి వెళ్లిపోతాను అంటుంది సౌర్య.ఆ మాటలకూ సౌందర్య, ఆనందరావు ఒక్కసారిగా షాక్ అవుతారు.అలా ఎలా వెళ్లిపోతావే.. అలా వెళ్తే మేమేం కావాలి’ అనేస్తుంది సౌందర్య కంగారుగా.ఇక ఆ మాటలకు జ్వాల అనుమానం బలపడినట్లుగా చూస్తుంది. ఇక సౌందర్య అనుమానం రాకుండా ఎలా కవర్ చేస్తుంది అనేది నెక్స్ట్ఎపిసోడ్ లో చూడాలి.


Share

Recent Posts

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

34 mins ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

1 hour ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

2 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

3 hours ago

కడుపు ఉబ్బరం సమస్యకు ఇలా చెక్ పెట్టేయండి..!

ఆహారం లేకుండా జీవించాలంటే చాలా కష్టం.ఆహా అయితే ఒక రెండు మూడు రోజులు ఉండగలం. కానీ ఆహారం లేకుండా మాత్రం మనిషి మనుగడ లేదు.గుప్పెడు అన్నం మెతుకుల…

3 hours ago

లాల్ సింగ్ చడ్డా సినిమా కోసం నాగచైతన్య ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడంటే..!

  అక్కినేని నాగచైతన్య మరో రెండు రోజుల్లో (ఆగస్టు 11న) థియేటర్స్‌లో రిలీజ్ కానున్న 'లాల్‌ సింగ్‌ చడ్డా' సినిమాతో బాలీవుడ్‌ డెబ్యూ ఇవ్వనున్నాడు. ఆమిర్‌ ఖాన్‌…

3 hours ago