Karthika deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. గత ఎపిసోడ్ లో జ్వాలకి నిజం తెలిసి ఇంటికి వచ్చి చాలా ఎమోషనల్ అవుతుంది. కోపంలో ఆటోని పక్కకు పడేసి..తింగరే హిమ కావడం మోసం’ అంటూ ఏడుస్తుంది. ఇక సౌందర్య వాళ్లు జ్వాల కోసం ఇంటికి రావడంతో నేటి కథనం మరింత ఉత్కంఠగా మారింది.
జ్వాల ఇంటికి వచ్చిన సౌందర్య వాళ్లకు ఇంటి ముందు ఆటో తిరగబడటం, వదిలేదేలే స్టిక్కర్ ముక్కలై ఉండటం చూసి షాక్ అవుతారు. ‘ఇక్కడే ఇలా ఉందంటే లోపల సౌర్య పరిస్థితేంటో నాన్నమ్మా.. భయంగా ఉంది’ అంటుంది హిమ. వెంటనే లోపలికి వెళ్తారు ముగ్గురు. ‘సౌర్యా’ అంటూ దగ్గరకు వెళ్లబోతుంది హిమ. ‘హేయ్ ఆగు’ అంటుంది కోపంగా సౌర్య.అప్పటికి బ్యాగ్‌లో బట్టలు సద్దుకుంటూ ఉంటుంది సౌర్య.ఎవరు మీరు? నా ఆటో బాలేదు.. నాకు బాలేదు.. కిరాయికి రాలేను’ అంటుంది సౌర్య. ‘మేము ఆటో కోసం వచ్చామనుకుంటున్నావా?’ అంటుంది సౌందర్య కాస్త ఎమోషనల్‌గా. ‘మరి దేని కోసం వచ్చారు? నా పేరు జ్వాల. ఆటో జ్వాల అంటుంది.
ఎందుకే మమ్మల్ని ఇలా గుండె కోత కోస్తావ్?’ అంటుంది సౌందర్య. అరెరే గుండె కోత? అది గుండె ఉన్నవారికి కదా? మీకు ఎలా వర్తిస్తుంది.? అంటుంది జ్వాల హిమ వైపు చూస్తూ.మీరంతా ప్లాన్ చేసుకుని, కూడబలుక్కుని.. నా దగ్గరకు వచ్చారా? ఇంకేం మిగిలిందని? జీవితమే మటాష్ కదా? అందుకే బట్టలు సద్దుకుంటున్నా’ అంటుంది సౌర్య. ‘ఎక్కడికి వెళ్తున్నావ్’ అంటాడు ఆనందరావు కంగారుగా. ‘మోసాలు కుట్రలు లేకుండా మనుషులు ఎక్కడైనా ఉన్నారేమో వెతికి.. అక్కడికి వెళ్తాను.. నవ్వుతూ గొంతు కోసే నంగనాచి మనుషులు లేని చోటికి వెళ్తాను అంటుంది జ్వాల.
‘మేమంతా ఇక్కడ ఉండగా నువ్వు ఎక్కడికి వెళ్తావే’ అంటుంది సౌందర్య బాధగా. ‘మీరు ఎక్కడ ఉన్నారనే వెళ్తున్నానండి’ అంటుంది సౌర్య.ఈ తాతయ్య అంటే నీకు ఇష్టం కదా? మరి వదిలేసి మళ్లీ వెళ్తావా?’ అంటాడు ఆనందరావు కళ్లనిండా నీళ్లతో. ‘తాతయ్యా… నాన్నమ్మా… వినడానికి, అనడానికి ఎంతో బాగున్నాయి కదా ఈ బంధాలు..? మరి నేను లంచ్ బాక్స్‌లు ఆటోలో తెస్తుంటే.. చూస్తూ పట్టనట్టే ఉన్నారుగా ఇన్నాళ్లు అంటుంది జ్వాల. ముగ్గురుకి ముగ్గురు గొప్పగా పోటీ పడి నటించారు. సౌర్యా.. అసలు జరిగిందేంటో నీకు తెలియదు.. నీకు అంతా రివర్స్‌లో అర్థమైంది’ అంటూ హిమ బాధపడుతూనే చెబుతుంది. ‘మాట్లాడొద్దు అని గట్టిగా అరుస్తుంది జ్వాల..నేను వెళ్తాను.. తప్పుకోండి’అంటూ బ్యాగ్ అందుకుంటుంది. అలా మాట్లాడకు అని సౌందర్య అంటే.. ఆహా నన్ను సౌర్య అని గుర్తు పట్టి కూడా సౌర్యా అని అప్పుడే పిలిచి ఉంటే ఎంత సంతోషించేదాన్ని?’ అంటుంది జ్వాల ఆవేశంగా. ‘మమ్మల్ని అంటున్నావ్ కదా.. అదే పని నువ్వు ఎందుకు చెయ్యలేదు..? నాన్నమ్మా తాతయ్యా అని తెలిసి కూడా ఎందుకు పిలవలేదు?’ అంటుంది సౌందర్య.
సమాధానం చెప్పలేక ఇలా ప్రశ్నలు వేస్తున్నావా? నేను పిలవకపోవడానికి కారణం ఇదే’ అంటూ చేతి మీదున్న హెచ్ చూపిస్తుంది. ముగ్గురు షాక్ అవుతారు. ‘మిమ్మల్ని నాన్నమ్మా తాతయ్యా అని పిలిస్తే మీరు తట్టుకోలేరు.. నేనూ తట్టుకోలేను.. తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? ఇంటికి రావాలి.. ఇంటికి వస్తే దీన్ని(హిమ) చూడాలి.. దీన్ని చూస్తే నాకు కోపం ఆగదు.. ఏం చేస్తానో నాకే తెలియదు అంటుంది సౌర్య ఎమోషనల్‌గా. అసలు ఇన్నేళ్లలో నాకోసం ఎన్ని రోజులు వెతికారు? ఏ ప్రయత్నాలు చేశారు? చెయ్యలేదు కదా? అని అంటుంది. మీకు నా ప్రేమ లేదు.. మీ మనవరాలికేమో నా మీద ప్రేమ కదా? నేను కోరుకున్న డాక్టర్ సాబ్‌ని తను పెళ్లి చేసుకుంటోంది..’ అంటుంది సౌర్య.
ఈ రోజుతో నేను మీకు కనిపించను.. అందరూ హాయ్‌గా ఉండండి.. చల్లగా ఉండండి’ అని అరుస్తుంది సౌర్య. ఏ సంబంధం లేకపోయినా ప్రేమగా చూసుకున్నారు పిన్నీ బాబాయ్ వాళ్లు అసలు వాళ్లు.. వాళ్లది ప్రేమ అంటే.. ఏసీ రూమ్‌లో కూర్చుని, సౌర్య కనిపించడం లేదని, సంవత్సరానికి ఒకసారి బాధపడటం కాదు ప్రేమ అంటే..’ అనేసి బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్లబోతుంది సౌర్య. ముగ్గురు ఆగు అంటూ వెంటబడతారు. సౌర్యా మీ అమ్మా నాన్నల(దీప, కార్తీక్) మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా.. వాళ్ల ఆత్మలు ఘోషించకుండా ఉండాలన్నా నువ్వు వెళ్లొద్దు.నువ్వు వెళితే మీ అమ్మా నాన్నల ఆత్మలు ఘోషిస్తాయి.. చిన్నదానివైనా నీకు దన్నం పెడతాను’ అంటూ దన్నం పెట్టి ఏడుస్తుంది సౌందర్య. దాంతో చేతిలోని బ్యాగ్ కిందకు వదిలేసి ‘సరే నేను ఇక్కడే ఉంటాను.. కానీ మీరు ఇక్కడ నుంచి వెళ్లిపొండి.. చచ్చిపోయిన అమ్మానాన్నల ఆత్మలని అడ్డు పెట్టుకుని ఆపుతున్నారు.. వెళ్లండి అంటూ లోపలికి వెళ్లి తలుపు పెట్టుకుంటుంది సౌర్య.
ఇంద్రుడు, చంద్రమ్మలకి జ్వల నిజం చెబుతుందా.?
సీన్ కట్ చేస్తే.. ఇంద్రుడు, చంద్రమ్మలు ఊరి నుంచి ఇంటికి వచ్చేసరికి.. ఇంటి ముందు ఆటో తిరగబడి ఉండటం చూసి షాక్ అవుతారు. లోపలికి వెళ్ళగానే జ్వాల బాధగా కూర్చోవడం చూసి కంగారుగా జ్వాల దగ్గరకు వచ్చి ఏం అయ్యింది అని అంటాడు ఇంద్రుడు. ‘మాట్లాడమ్మా ఏం అయ్యింది? ఊరు నుంచి రాగానే ఏదైనా శుభవార్త చెబుతావేమోనని ఆశగా వస్తే నువ్వు ఏంటమ్మా ఇలా ఉన్నావ్ అంటే
అన్నీ వార్తలే ఉన్నాయి పిన్నీ.. శుభవార్తలు లేవు.. ఇప్పుడేం అడగొద్దు అంటూ కుమిలికుమిలి ఏడుస్తూ..‘పిన్నీ’ అంటూ.. చంద్రమ్మ గుండెలపై వాలిపోతుంది జ్వాల.
తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…
వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…
ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జగన్నాథ్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జగన్నాథ్.. ఆ తర్వాత…
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ త్వరలోనే `లైగర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్…
"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…