Categories: Telugu TV Serials

Karthika Deepam: జ్వాల గురించి తప్పుగా మాట్లాడిన నిరూపమ్ మీద ఆవేశంతో విరుచుకుపడ్డ హిమ..!

Share

Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.గత ఎపిసోడ్‌లో హిమ, నిరుపమ్‌లు ఇద్దరు అమ్మవారికి ముడుపు కట్టడం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ కూడా అదే సీన్ తో. కంటిన్యూ అవుతుంది. అయితే జ్వాల కూడా పాసెంజర్ ను ఎక్కించుకుని అదే గుడికి వస్తుంది. ఇక నిరూపమ్ మాత్రం మన పెళ్లికి ఏ ఆటంకం రాకూడదని ముడుపు కడతాను అని అంటే.. హిమ మాత్రం ‘నీకూ జ్వాలకి పెళ్లి కావాలని నేనూ మొక్కుకుంటూ ముడుపు కడతాను’ అని అంటుంది. ఆ మాట విని నిరూపమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. నా కోరిక చాలా బలమైనది అని హిమ అంటుంది.అదే సమయంలో గుడిలోకి వచ్చిన జ్వాల వాళ్లిదరిని చూసి షాక్ అవుతుంది.ముడుపు కడుతున్నావా తింగరి.. ఏమి కోరుకున్నావే మనసులో.? నా జీవితాన్ని నాశనం చేసి.. మీరు కలవాలని మొక్కున్నావా? రాత్రి కూడా ఎంత నాటకం ఆడావే?’ అనుకుంటూ హిమ మీద కోపంతో రగిలిపోతుంది. అయితే జ్వాలని వాళ్లిద్దరూ కూడా చూడరు

Karthika Deepam: హిమను నిజంగానే పేషంట్ ను చేసిన నిరూపమ్ :

సీన్ కట్ చేస్తే ఆనందరావు, సౌందర్యలు ఒక చోట కూర్చుని హిమ, సౌర్యలను కలపడం గురించి మాట్లాడుకుంటారు.ఇక మరోవైపు హిమ తీవ్రంగా ఆలోచిస్తూ ఆసుపత్రిలో పేషెంట్స్ కూర్చునే ప్లేస్‌లో కూర్చుంటుంది. అది చూసిన నిరుపమ్ సరదాగా కాసేపు హిమను పేషంట్ లాగా ట్రీట్ చేస్తాడు. నేను నిజంగానే పెషెంట్‌నే కదా బావా అంటుంది హిమ కాస్త దిగులుగా దాంతో నిరుపమ్ ముఖం మారిపోతుంది.వెంటనే పైకి లేచి.. సారీ చెబుతాడు.
హిమ నువ్వు ఇలా ఉండడానికి కారణం ఆ జ్వాలే అనిపిస్తోంది.. అసలు జ్వాల ఎవరు? తనని పెళ్లి చేసుకోమని నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావ్? తనకెందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నావ్?’ అంటాడు నిరుపమ్.

జ్వాలను పెళ్లి చేసుకో అని నిరూపమ్ ను అడిగిన హిమ :

బావా తను ఒక స్వచ్ఛమైన మంచి మనసున్న అమ్మాయి.. తను నిన్ను ప్రేమిస్తోంది’ అంటుంది హిమ. కానీ నేను తనని ప్రేమించడం లేదు అంటాడు. అయినా నువ్వే ఇంత దాకా తీసుకొచ్చావ్’ అంటాడు నిరుపమ్. నేను ఇంక ఎన్నాళ్లు ఉంటానో తెలియదు బావా.. తనే నీకు సరైన జోడీ.. జ్వాలకి నువ్వంటే ప్రాణం బావా’ అంటుంది హిమ. ‘నాకు నువ్వంటే ప్రాణం హిమా.. తనకి కూడా ఆ మాట చెప్పేశాను.. అలా కొన్ని రోజులు బాధపెడుతుంది. తర్వాత మరిచిపోతుందిలే అంటాడు నిరుపమ్.

నిరూపమ్ మీద సీరియస్ అయిన హిమ :

‘తను అలాంటిది కాదు బావా అంటుంది హిమ.లేదు హిమ కొన్నాళ్ళకు నన్ను మర్చిపోయి తన స్థాయికి తగ్గవాడ్ని పెళ్లి చేసుకుని.. అదే ఆటో నడుపుకుంటూ అలానే బతికేస్తుంది’ అంటాడు నిరుపమ్. నిరూపమ్. మాటలకూ కోపం వచ్చిన హిమ గట్టిగా అరుస్తుంది.‘ఏం అయ్యింది హిమా’ అంటాడు.‘జ్వాలకు అంత కర్మేం పట్టలేదు బావా’ అంటుంది హిమ. ‘ఏంటి హిమా నువ్వు? అసలు ఏం అర్థం కావు..నువ్వు తన గురించి జాలిపడతావేంటీ? అసలు తను ఎవరు హిమా?’ అంటాడు నిరుపమ్..తను నా ఫ్రెండ్.. నన్ను పిరితనం నుంచి కాపాడి, ధైర్యాన్ని అందించిన నా గురువు,నా ఆత్మీయురాలు అంటుంది హిమ కోపంగా.

పెళ్లి చేస్తా అన్నా ఆనందరావు మీద కోపంతో ఉగిపోయిన జ్వాల :

సీన్ కట్ చేస్తే జ్వాల గుడిలో జరిగింది తలుచుకుని హిమ మీద కోపంతో రగిలిపోతుంది ఇంతలో ఆనందరావు, సౌందర్యలు వస్తారు. నేల మీద పగిలిన అద్దంను చూసి ‘ఏంటమ్మా ఇదంతా?’ అంటాడు ఆనందరావు బాధగా. ‘నా మనసు యంగ్ మెన్.. నా మనసు కూడా ఈ అద్దంలానే ముక్కలైపోయింది’ అంటుంది జ్వాల బాధగా.ఇక సౌందర్య మాత్రం నీ దోస్త్‌గా ఒక్క మాట చెబుతాను విను’ అంటుంది.ఏంటి నీతిబోధలా?సీసీ అని జ్వాల అంటే ‘నీతి బోధలు నీకెందుకు చెబుతామే? నువ్వు మాకు ఏం అవుతావని…ఏదో మనసు ఉండబట్టలేక నీ దగ్గరకు వచ్చాం అంతే’ అంటుంది జ్వాలకు. అనుమానం రాకుండా. ఇక ఆనందరావు మాత్రం చూడమ్మా జ్వాల నీకు నా మనవరాలి వయసే ఉంటుంది కాబట్టి ఆ చనువుతోనే ఓ మాట చెబుతాను.. నీకు ఓ గొప్ప సంబంధం చూస్తాం..’ అంటూ ఆనందరావు చెప్పడం పూర్తి చేయకుండానే జ్వాల ఆవేశంగా ‘యంగ్ మెన్’ అంటూ అరుస్తుంది.వెంటనే తమాయించుకుని ‘సారీ యంగ్ మాన్ అంటుంది.‘పర్వాలేదమ్మా అని ఆనందరావు అనడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.


Share

Recent Posts

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం సీరియల్లో…

15 mins ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

48 mins ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

49 mins ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

2 hours ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

2 hours ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

3 hours ago