బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1460వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు సెప్టెంబర్ 20 న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరగనుందో ముందుగా తెలుసుకుందాం..కార్తీకదీపం సీరియల్లో ప్లాష్ బ్యాక్ స్టోరీ నడుస్తుంది.నిన్నటి ఎపిసోడ్లో మోనిత తన కొడుకుని తీసుకుని రావడానికి హైదరాబాద్ వెళ్తుంది.మోనిత లేని సమయంలో దీప కార్తీక్ కు గతం గుర్తుచేయాలనీ ప్రయత్నం చేస్తుంది. కార్తీక్ పనుకున్నాక కార్తీక్ హాస్పిటల్ రికార్డ్స్ ను తీసుకుని వెళ్ళిపోతుంది. ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా ముందుకు సాగిందనే చెప్పాలి.
ఆనంద్ ను తీసుకుని మోనిత ఎంట్రీ :
మరుసటి రోజు ఉదయం కార్తీక్ ఇంటి ముందు కూర్చుని ఉంటే.. దీప వచ్చి.. కాఫీ తెచ్చాను డాక్టర్ బాబు అంటుంది. ఇంతలో శివ పరుగున వచ్చిnవంటలక్కా మేడమ్ వచ్చే టైమ్ అయ్యింది.. వెళ్లిపో ప్లీజ్’ అంటాడు కానీ దీప పెద్దగా పట్టించుకోదు.సరిగ్గా కార్తీక్‌కి కాఫీ అందించే సమయానికి మోనిత వచ్చి దీప, కార్తీక్‌ల చేతిలోని కాఫీ కప్పుని విసిరికొడుతుంది. ‘నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావే? అయినా రెండురోజులు ఎక్కడికో వెళ్తున్నా అన్నావ్ కదా?’ అంటూ ఫైర్ అవుతోంది.దీప నన్ను ఊరిలో లేకుండా చేయడానికి వాళ్ళు వేసిన ప్లాన్ నాకు అర్ధం అయిందేలే అంటుంది… కార్తీక్ ఆశ్చర్యంగా చేస్తూ మోనితా చేతిలో ఉన్న బాబును చూసి ఈ బాబు ఎవరు?’ అంటాడు కార్తీక్.మన బాబు కార్తీక్ అంటుంది.బాబు చాలా ముద్దుగా ఉన్నాడు.. ఇలా ఇవ్వు’ అంటుంది దీప. వెంటనే మోనిత బాబుని వెనక్కి లాక్కోవడంతో బాబు ఏడవడం మొదలుపెడతాడు.శివ ఎత్తుకున్నా ఏడుపు ఆపకపోవడంతో బాబు ఈయనకి బాగా అలవాటే కదా డాక్టర్ బాబు ఎత్తుకుంటే ఏడుపు ఆపేస్తాడేమో’ అనుకుంటూ.. ‘డాక్టర్ బాబు మీరు ఎత్తుకోండి ఏడుపు ఆపుతాడు’ అంటుంది దీప.
కార్తీక్ ఎత్తుకోవడంతో ఏడుపు ఆపిన ఆనంద్ :
వెంటనే కార్తీక్ ఎత్తుకోవడంతో ఏడుపు ఆపేస్తాడు ఆనంద్. దాంతో మోనిత షాక్ అయ్యి కొంపదీసి వీడ్ని చూస్తే గతం గుర్తొస్తుందా? అయ్యో బాబుని తెచ్చి అనవసరంగా తప్పు చేశానా?’ అనుకుంటుంది మోనిత మనసులో. అయితే కార్తీక్ వాడు ఏడుపు ఆపడంతో నేను ఎత్తుకోగానే ఏడుపు ఆపాడంటే నాకిక జ్ఞాపకాలతో పనేంటీ? వీడే నా కొడుకు అనేస్తాడు. కార్తీక్ మాటలకూ దీప షాక్ అవుతుంది. మోనిత నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది.
ఇక కాసేపటికి దీప ఇంట్లో కూర్చుని ఏడుస్తుంటే డాక్టర్ అన్నయ్య వస్తాడు. అన్నయ్యా వచ్చావా అని కార్తీక్ మెడికల్ రిపోర్ట్స్ ఇస్తుంది. అలాగే జరిగిన విషయాలు డాక్టర్ అన్నయ్యకు చెబుతు ఏడుస్తుంది దీప. సరే అమ్మా నువ్వు బాధపడకు ఈ రిపోర్ట్స్ తీసుకుని వెళ్లి డాక్టర్ బాబు కండీషన్ మొత్తం తెలుసుకుంటాను ఆ తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాం అంటూ దీపకు దైర్యం చెప్పి అక్కడ నుండి వెళ్లిపోతాడు.
తప్పు చేశా అన్నయ్యా అని బాధపడుతున్న దీప:
కొద్దిసేపు అయ్యాక దీప కార్తీక్ గురించే ఆలోచించుకుంటూ కూరగాయలు కట్ చేస్తే చెయ్ కోసుకుంటుంది. సరిగ్గా అప్పుడే వచ్చిన కార్తీక్ దీప జాలి పడటంతో పాటు మోనిత కాఫీ విసిరికొట్టినందుకు సారీ చెబుతాడు. ఆ తర్వాత మాట సందర్భంలో డాక్టర్ బాబు మీ అసలు ఊరు హైదరాబాద్ అంటూ మొత్తం జరిగింది అంతా చెబుతుంది.సరిగ్గా అప్పుడే కార్తీక్‌కి తల పగిలిపోతున్నట్లుగా అనిపించి కుర్చీలోనే కళ్ళు తిరిగి పడిపోతాడు.
ఆనంద్ పేరు విని షాక్ అయిన కార్తీక్ :
ఇంతలో మోనిత, శివలు కార్తీక్‌ని వెతుక్కుంటూ వంటలక్క ఇంటికి వస్తారు.కార్తీక్ పడిపోవడం చుసిన మోనిత దీపని తోసేసి కార్తీక్ అంటూనే ఏం చేశావే నా కార్తీక్ ను అంటూ శివ మంచి నీళ్లు తే అంటూ హడావుడి చేస్తుంది.కొద్దిసేపటికి కార్తీక్ పైకి లేచి ఏమి అయింది అంటే ఏం కాలేదు కార్తీక్ మనిద్దరం వంటలక్క దగ్గరకి వచ్చాం నువ్వు ఇంతలో కళ్లు తిరిగి పడిపోయావ్’ అంటూ మాట మార్చేసి కార్తిక్ ను అక్కడనుండి తీసుకుని వెళ్తారు.మరోవైపు కాసేపటికి బాబుని ఎత్తుకుని వచ్చిన కార్తీక్.. మోనితతో మన బాబు పేరేంటీ?’ అంటాడు.మోనిత అన్ని అబద్ధాలు చెప్పడం అవసరమా ఇప్పటి నుంచే కార్తీక్ కు అన్ని పేర్లు. చెప్పి ప్రిపేర్ గా ఉంచాలి అని ఆనంద్ అని చెబుతుంది.అవునా ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉందే ’ అంటాడు కార్తీక్. మోనిత షాక్ అవ్వడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Big Boss Vasanthi: పెళ్లి తర్వాత గ్లామర్ డోస్ మరింత పెంచిన వాసంతి.. ఆ పార్ట్ చూపిస్తూ ఎక్స్పోజింగ్..!