Telugu TV Serials

ఇదేమి ట్విస్ట్ రా బాబూ…కార్తీక్ ను దాచేసింది ఆ మోనితేనా..??

Share

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ 1441వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగష్టు 26 న ప్రసారం కానున్న కార్తీకదీపం సీరియల్లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం..ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్లో ఫ్లాష్ బ్లాక్ స్టోరీ నడుస్తుంది. గత ఎపిసోడ్ లో దీప… మోనితను ఫాలో అవుతూ తన ఇంటికి వెళ్తుంది. కానీ అక్కడ కార్తీక్ లేకపోవడంతో మళ్ళీ వచ్చేసి కార్తీక్ ఫోటో పట్టుకుని అందరిని. ఎంక్వయిరీ చేస్తుంది. ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా ముందుకు సాగిందనే చెప్పాలి.. ఇక ఈరోజు ఎపిసోడ్ లో దీప ఐస్ క్రీమ్ తింటున్న శివని పట్టుకుని కార్తీక్‌ గురించి అడుగుతూనే ఉంటుంది.ఎక్కడున్నారు నా డాక్టర్ బాబు అంటూ శివ కాలర్ పట్టుకని నిలదీస్తుంది.

శివను పట్టుకున్న దీప :

‘ఎవరు మేడమ్.. మీరు నన్ను ఎందుకు పట్టుకుంటున్నారు మేడమ్ అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు శివ. ‘ఆ రోజు నా డాక్టర్ బాబు నీ పక్కనే ఉన్నారు కదా?’ అంటూ గట్టిగానే వాదిస్తుంది దీప. శివని ఎటూ కదలకుండా.. పారిపోకుండా పట్టుకునే ఉంటుంది. ‘నాకు తెలిసినా నేను చెప్పలేను మేడమ్..చెప్తే నన్ను చంపేస్తారు..’ అంటాడు శివ దీపకు దన్నం పెడుతూ. ఆ మాటలకు దీప మరింత షాక్ అవుతుంది.చంపేస్తారా? ఎవరున్నారు దీని వెనుక?’ అంటూ ఆరా తీస్తుంది దీప ఆవేశంగా. శివ చెప్పకపోవడంతో నా చైన్ నువ్వే కొట్టేసావని చెప్పి నిన్ను పోలీసులకి అప్పగిస్తాను..అక్కడ నీ చేత నిజం కక్కిస్తాను అంటూ దీప బెదిరిస్తుంది. దాంతో శివ ఆ పని చేయొద్దు మేడమ్ నిజం చెప్పేస్తాను మేడమ్..’ అంటూ ఏదో చెప్పడానికి సిద్ధపడతాడు. సరిగ్గా అప్పుడే మోనిత వచ్చి నా భర్త ఎక్కడ ఉన్నాడురా చెప్పు అని శివని డైవర్ట్ చేసి దీపను పక్కకు తోసేసి కారులో. శివను ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిపోతుంది. అది చూసిన దీప ఏడుస్తూ మళ్ళీ ఈ రాక్షసిని మా జీవితంలోకి ఎందుకు పంపావు దేవుడా అంటూ ఏడుస్తుంది..

సౌర్యను వెతుకుంటూ వచ్చిన సౌందర్య :

సీన్ కట్ చేస్తే సౌర్యను వెతుకుంటూ సౌందర్య, హిమ, ఆనందరావులు వస్తారు. అప్పుడే సౌర్య ఇంట్లో నుంచి అన్నం పళ్లెం తీసుకుని. బయటకు వచ్చి కూర్చుంటుంది. అది చూసి సౌందర్య ఎమోషనల్ అయ్యి సౌర్య దగ్గరకి వెళ్ళబోతుంటే ఆగు నానమ్మ అని హిమ సౌందర్యను ఆపేస్తుంది. తాతయ్య వెళ్తారులే అనడంతో సౌందర్య, హిమలు. సౌర్యకు కనపడకుండా దూరంగా దాక్కుంటారు. సౌర్య దగ్గరకు వెళ్లిన ఆనందరావును ఎందుకోచ్చావ్ తాతయ్య అంటుంది సౌర్య.. నువ్వు ఒక్కడివే వచ్చావా వాళ్ళని కూడా వెంట తెచ్చావా అంటుంది. లేదమ్మా అని చెప్పి ఇంటికి రామ్మా అంటే నేను. రాను అంటుంది సౌర్య..

కార్తీక్ ను దాచింది మోనితే:

 

సీన్ కట్ చేస్తే మోనిత కార్తీక్‌కి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది. అంటే కార్తీక్ మోనిత దగ్గరే ఉన్నాడు అని అర్ధం అయిపోతుంది.మోనిత ప్రేమగా తినిపిస్తుంటే కార్తీక్ బుద్దిగా తింటూ ఉంటాడు.కార్తీక్ నువ్వు బయట ఎక్కువగా తిరగకు అనడంతో ఎందుకు అలా నన్ను ఇంట్లోనే పెట్టి దాచాలనుకుంటున్నావ్.. ఇంతకీ నీ పేరు ఏంటి అని కార్తీక్ అనడంతో మోనిత షాక్ అవుతుంది. చూడు కార్తీక్ ఈ ప్రపంచంలో ఎవరిని అన్నా మర్చిపో కానీ నన్ను మాత్రం మర్చిపోకు… నేను నీ భార్యను.. నీ. మోనితను అంటుంది. కార్తీక్ అయోమయంగా చూస్తూ ఉంటాడు. ఇక మోనిత మాత్రం తన కన్నింగ్ బ్రెయిన్ తో కార్తీక్ తన భర్త అని భ్రమలో కార్తీక్ ను పడేస్తుంది.. కార్తీక్ గతం మర్చిపోవడంతో మోనిత తనే కార్తీక్ భార్య అంటూ కార్తీక్ ను నమ్మిస్తుంది.. మరి దీప ఎలా మోనితకు చెక్ పెట్టి కార్తీక్ కు గతం గుర్తొచ్చేలాగా చేస్తుందో అనేది రాబోయే ఎపిసోడ్ లో చూద్దాం..!


Share

Related posts

Intinti Gruhalakshmi: సామ్రాట్ ఇంటి నుంచి తులసి వెళ్లిపోమన్న నందు.. లాస్య ప్లాన్ వర్కౌట్ అవుతుందా !?

bharani jella

తులసి పై హనీకి ఇంత ప్రేమ ఉందా.!? శృతి ఇంట్లో పనిచేస్తున్న విషయం తెలుసుకున్న ప్రేమ్..!?

bharani jella

వసు, రిషిల విడదీయాలనే దేవయాని ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా..?

Ram