Telugu TV Serials

మోనిత పని పట్టే పనిలో డాక్టర్ అన్నయ్య, దీప….!!

Share

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1457 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు సెప్టెంబర్ 13 న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరగనుందో ముందుగా తెలుసుకుందాం.గతం ఎపిసోడ్‌లో మోనితకి ఊహించని షాక్ ఇస్తుంది దీప.పూజలో కార్తీక్ పక్కన కూర్చోకుండా ప్లాన్ వేసి కార్తీక్ ఒక్కడే పూజ చేసేలా చేస్తుంది.మరోపక్క దీప చేసిన పనికి మోనిత కోపంతో రగిలిపోతుంది. ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా ముందుకు సాగిందనే చెప్పాలి.పూజ పూర్తి కాగానే దీప వెళ్లిపోతుంది. మోనిత మాత్రం కార్తీక్‌ని నువ్వు ఆ వంటలక్కని ఎప్పుడు కలిశావ్? తనకి మాటెప్పుడు ఇచ్చావ్? అంటూ నిలదీస్తుంది. దాంతో కార్తీక్ జరిగింది గుర్తు చేసుకుని దీపని కలిసిన సీన్ చెబుతాడు మోనితకి.

మోనితకు చుక్కలు చూపించిన దీప :

నువ్వు నాతో దీప మనింట్లో పూజకు రాను అందని చెప్పావు కదా ఏందుకు రాను ఆందో కనుకుందామని దీప వాళ్లింటికి వెళ్లాను’ అంటూ జరిగింది చెబుతాడు.దీప దిగులుగా కూర్చుని ఉంటే ఏంటి వంటలక్కా రాను అన్నావంట. ఆ ఇంట్లో పూజకు అని అడుగుతాడు. రావచ్చుకదా అంటాడు. ‘అయ్యో మీరు వచ్చి పిలిచారు కదా డాక్టర్ బాబు నేను తప్పకుండా వస్తాను అయితే నాకో మాటివ్వాలి అని రేపు పూజ ఫలితం మీ ఒక్కరికే దక్కాలి అందుకే మీరు ఒక్కరే కూర్చోని పూజ చెయ్యాలి అంటుంది అలాగే పూజలో మీరు ఏం కోరుకోవాలంటే.. నా భార్య బిడ్డలతో నా జీవితం బాగుండాలి. నాకు గతం గుర్తు రావాలని కోరుకోండి డాక్టర్ బాబు అంటుంది దీప.సరే అంటాడు కార్తీక్. ఎందుకైనా మంచిది ఓ పెన్ను పేపర్ తీసుకునిరా రాసుకుని ఆ స్లిప్ జేబులో పెట్టుకుంటాడు ఆ సీన్ మొత్తం గుర్తు చేసుకుంటూ అది మోనితా జరిగింది అంటాడు.


మోనితపై అరిచిన కార్తీక్ :

అంతా విన్న మోనిత రగిలిపోతుంది. అసలు దాన్ని కలవడం ఏంటీ.? దానికి మాటివ్వడం ఏంటీ? అంటూ కోపంతో ఉగిపోతుంది.అంటే తను నన్ను ఇంటికి తీసుకొచ్చింది మోనితా లేదంటే ఆ రోజు నేను ఏం అయిపోయే వాడ్ని? నాకు సాయం చేసిన ఆవిడకి మాటిస్తే తప్పేంటీ? అంటాడు కార్తీక్.ఆపు కార్తీక్ అంటూ కార్తీక్ మీద ఫైర్ అయిపోతుంది మోనిత. దాంతో కార్తీక్ అక్కడే ఉన్న ప్లేట్ ఎత్తి కిందపడేసి ఏంటి నువ్వు ప్రతి దానికి ఏదోటి చెప్తావ్.. ఏదోక గొడవ చేస్తావ్ అంటాడు.నా నుంచి ప్రేమ కావాలి ప్రేమ కావాలి అంటావ్ నువ్వు ఇలా చేస్తుంటే నీ మీద ఇంకా నాకు ప్రేమ ఎక్కడ వస్తుంది అని అరిచి వెళ్లిపోతాడు కార్తీక్.

కార్తీక్ ను చూస్తా అంటున్న డాక్టర్ అన్నయ్య:


ఇక ఇంటికి వెళ్లిన దీపని కలవడానికి డాక్టర్ అన్నయ్య వస్తాడు. జరిగింది అంతా డాక్టర్ కు చెబుతుంది దీప.‘మంచి పనే అయ్యింది అమ్మా నాకొకసారి మోనితని, నీ భర్త డాక్టర్ బాబుని చూడాలని ఉందమ్మా అంటాడు డాక్టర్.ఎందుకు అన్నయ్యా అంటే వాళ్లిదరిని చూస్తే నాకు ఓ ఐడియా వస్తుంది అని అంటే దీప సరే అంటుంది. మరోవైపు హిమ, సౌందర్య, ఆనందరావులు కూడా వినాయక పూజ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు కూడా హిమ.. సౌర్య గురించే బాధపడుతుంది.

మళ్ళీ కొత్త నాటకం మొదలుపెట్టిన మోనిత :


ఇక మోనిత తనలో తానే కార్తీక్ అన్నా మాటలన్నీ తలుచుకుంటూ రగిలిపోతుంది.కార్తీక్ కు నా మీద ప్రేమ ఎలా రప్పించాలి? అని ఆలోచన చేసి నాకు హెల్త్ బాలేదు అంటే కార్తీక్ నన్ను దగ్గర ఉండి ప్రేమగా చూసుకుంటూ ఉండిపోతాడు అనుకుని వెంటనే మంచం ఎక్కి దుప్పటి ముసుగుపెట్టుకుని పడుకుంటుంది. ఇంతలో కార్తీక్ వచ్చి.. ‘ఏమైంది మోనితా? ఒంట్లో బాలేదా?’ అంటాడు. బాలేదు కార్తీక్ ఉన్నట్టుండి జ్వరం, చలి, ఒళ్లు నొప్పులు ఏదోలా ఉంది’ అంటుంది మోనిత. అయ్యో ఇంత సడన్‌గా ఏంటీ ఇందాక నేను తిట్టాను కదా అందుకేనా? అయ్యో అనవసరంగా తిట్టాను అంటూ మోనిత మీద జాలి పడతాడు.సరే డాక్టర్ ను తీసుకుని వస్తాను అని చెప్పి శివా శివా అంటూ డ్రైవర్‌ కోసం వెతుకుతుంటే దీప, తనని కాపాడిన డాక్టర్ ఇద్దరూ ఎదురుపడతారు ‘వంటలక్కా.. మా శివని చూశావా?’ అంటాడు కార్తీక్. ఏమైంది డాక్టర్ బాబు అంటే మోనితకు ఆరోగ్యం బాలేదని చెప్తాడు. వెంటనే దీప ‘అయ్యో డాక్టర్ బాబు మీకు డాక్టరే కదా కావాల్సింది ఇదిగో మా అన్నయ్య కూడా డాక్టరే అంటుంది. ‘అవునా అయితే రండి’ అంటాడు. ఈయన మా అన్నయ్య అని మోనితకు చెప్పకండి అంటే సరే అంటాడు.

మోనితను చూడడానికి వచ్చిన డాక్టర్ :


ఒక్క నిమిషం అంటూ దీప వాళ్ల అన్నయ్య కారు దగ్గరకు వెళ్లి.. తన బ్యాగ్ తీసుకుని వస్తుంది. ఇక మోనిత శివకు కాల్ చేస్తుంది డాక్టర్‌ని ఎవరినీ తీసుకుని రావద్దు అని చెప్పడానికి. ‘కార్తీక్ ఎక్కడా? నువ్వు ఎక్కడా?’అని మోనిత ఫోన్‌లో శివని అడుగుతుంది. ‘మేడమ్ నేను చిన్న పని ఉండు బయటికి వచ్చాను అంటే శివను తిట్టి రమ్మని చెప్తుంది. ఇంతలో రండి డాక్టర్ అని కార్తీక్ మాట వినిపించగానే మోనిత దొంగ నాటకం స్టార్ట్ చేస్తుంది. ‘మోనితా డాక్టర్ వచ్చారు లే అంటే ఇప్పుడేం వద్దు కార్తీక్ నాకు బాగానే ఉందిలే తగ్గిపోతుంది అంటుంది. ఏం కాదు మోనితా ఒక సారి చూడనీ అంటాడు కార్తీక్. వెంటనే దీప వాళ్ల అన్నయ్య ‘అవను మీరు కూడా డాక్టరే కదా’ అంటాడు కార్తీక్‌తో డాక్టర్ అలా ఆనండంతో మోనిత ఒక్కసారిగా షాక్ అవ్వడంతో. ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది


Share

Related posts

Intinti Gruhalakshmi: అభికి తులసి లాస్య ప్లాన్ చేప్పేసిందా..!? ప్రేమ్ ఆల్బమ్ చేయడానికి డబ్బులు ఎక్కడివి..!?

bharani jella

Intinti Gruhalakshmi: నందు విశ్వరూపం చూసిన లాస్య..! తులసి ముందే ప్రేమ ఓడిపోయానని ఒప్పుకున్నాడు..

bharani jella

Intinti Gruhalakshmi 6 August 704: తులసికి నందు, లాస్యలతో సారీ చెప్పించిన సామ్రాట్..!

bharani jella