Telugu TV Serials

దీప గొంతు గుర్తుపట్టిన సౌర్య.. ఆనంద్ ను తీసుకుని రావడానికి రంగం సిద్ధం చేసిన మోనిత..!

Share

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1459వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది.ఇక ఈరోజు సెప్టెంబర్ 16 న ప్రసారం కానున్న కార్తీకదీపం సీరియల్లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.. ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్లో ప్లాష్ బ్యాక్ స్టోరీ నడుస్తోంది. గత ఎపిసోడ్ లో ఇద్దరు మహిళలు మోనిత దగ్గరకు వచ్చి మా ఆశ్రమంలో చికిత్స చేపించుకుంటే మీ భర్తకు గతం గుర్తుకు వస్తుంది అని చెబుతారు.అయితే వీళ్ళ మాటలను దీప చాటుగా వింటుంది. అదే సీన్ ఈరోజు ఎపిసోడ్ లో కూడా కంటిన్యూ అవుతుంది.

మోనిత ఉచ్చులో దీప :మా ప్రకృతి ఆశ్రమంలో ఇచ్చే మందుల వలన మీ ఆయనకు పోయిన గతం గుర్తుకు వస్తుంది అని వాళ్ళు చెప్పడంతో మోనిత వాళ్లపై మండిపడుతుంది.ఇలాంటి కబుర్లు చెప్పి డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తారని తెలుసు మీరు వెళ్లండని వాళ్ళని పంపించేస్తుంది మోనిత. ఇదంతా విన్న దీప వాళ్లతో మాట్లాడి ఆ మందు తీసుకునేందుకు తాను వస్తానంటుంది. మరి ఆ మందు కావాలంటే మీరు రెండు రోజులు అక్కడే ఉండాలని చెబుతారు. సరేనన్న దీప వాళ్ల దగ్గర ఫోన్ నంబర్ తీసుకుంటుంది.

ఆశ్రమం గురించి డాక్టర్ అన్నయ్యకు చెప్పిన దీప :జరిగినవిషయం అంతా దీప వాళ్ల అన్నయ్య దగ్గరకువెళ్లి చెబుతుంది.ఆయుర్వేదం మంచిదే కదమ్మా వినియోగించడం కూడా మంచిదే అంటాడు.మరి ఆ హాస్పిటల్ ఎక్కడ అని అడిగితే ఫోన్ నంబర్ ఇచ్చారని చెబుతుంది దీప. కాల్ చేసిన డాక్టర్ ఇదెక్కడి హాస్పిటల్ అని అడిగితే హాస్పిటల్ కాదు ప్రకృతి చికిత్సాలయం అని చెప్పి మేము. ఇచ్చే మందుకి సూర్యరశ్మి తగలకూడదని అందుకే రెండు రోజులు అక్కడ ఉండాలని చెబుతారు. సరే అని దీపను వెళ్ళమని అంటాడు డాక్టర్.

మోనిత బాబు మీద ప్రేమ పెంచుకుంటున్న కార్తీక్ :కార్తీక్ వచ్చి ఒంట్లో ఎలా ఉందని అడుగుతాడు మోనితను. ట్యాబ్లెట్ వేసుకున్నా కదా బావుంది అంటుంది. ఇక దొంగ ఏడుపు మొదలుపెడుతూ
నేను నా బాబుని కూడా దూరం చేసుకుని నీకోసమే బతుకుతున్నా కానీ నువ్వు గతం గుర్తుచేసుకునేందుకు ప్రయత్నించి ఏదోలా అయిపోతున్నావ్..నీకేమైనా అయితే నేనేం అయిపోవాలి కార్తీక్ అని దొంగ ఏడుపు ఏడుస్తుంది. నీకు గతం ఎందుకు మన బిడ్డ కూడా వస్తే మనం ముగ్గురం చాలు అని గతం తాలూకా జ్ఞాపకాలను ఆలోచించడం మానెయ్ అంటాడు కార్తీక్.నువ్వు ఏడవకు మోనిత ఆలోచించను. బాబు చెన్నైలో ఉన్నాడన్నావ్ ఎప్పుడు తీసుకొస్తావ్ అంటాడు.శివని నీ దగ్గర పెట్టి వెళతాను అంటుంది మోనిత

ఆశ్రమంకు వెళ్లనున్న దీప :మరోవైపు దీప ఆ ఆడవాళ్లు చెప్పిన మాటలను నమ్మి ఇంటికి తాళం వేసి బ్యాగ్ సర్దుకుని ఆశ్రమంకు వెళ్లడం చూసి మోనిత నవ్వుకుంటుంది.అంత తెలివైనదానివి ఇంత తెలివైనదానివి అంటావ్ ఇంత ఈజీగా ఫూల్ అయిపోయావ్ ఏంటి అని మనసులో అనుకుని నువ్వెళ్లి వచ్చేలోగా నేనువెళ్లి ఆనంద్ ని తీసుకొచ్చేస్తాను అనుకుంటుంది. అలా దీప, మోనిత మధ్య కాసేపు మాటల యుద్ధం జరుగుతుంది.

ఇంద్రుడు ఆటో ఎక్కి సౌర్యతో మాట్లాడిన దీప : ప్రకృతి ఆశ్రమానికి బయలుదేరిన దీప..ఆటో వెనుక శౌర్య రాసిన..అమ్మా-నాన్న ఎక్కుడున్నారని రాసి ఉన్న ఆటో చూసి శౌర్యని గుర్తుచేసుకుంటుంది. ఇంతలో ఇంద్రుడికి కాల్ చేసిన సోర్య పిన్ని సరుకులు చెప్పింది లిస్ట్ రాసుకో అంటుంది. నీకు జలుబు తగ్గలేదమ్మా గొంతుకూడా గుర్తుపట్టలేకుండా ఉందంటాడు.ఇంతలో ఆ లిస్టు నేను రాస్తాను మీరు ఆటో తియ్యండి అంటుంది దీప. ఆ ఫోన్ దీప తీసుకుంటుంది. ఇది అమ్మ గొంతులా ఉందే అనుకుంటూ ఎవరితో మాట్లాడుతున్నావ్ అని అనుకుని ఎవరామె అని అడుగుతుంది. అది దీప గొంతే అని శౌర్య గుర్తుపట్టేస్తుంది కాని ఆటో సౌండ్ వలన సరిగా మాట్లాలేదు.

ఇదంతా మోనిత నాటకం అని తెలుసుకున్న దీప :

ఆ తర్వాత బస్టాండ్ దగ్గర దిగుతుంది దీప ఏ ఊరు వెళుతున్నారమ్మా అని అడుగుతాడు ఇంద్రుడు.. దీప ప్రకృతి వైద్యశాల గురించి చెబుతుంది. ఇదంతా విన్న ఇంద్రుడు…మీకెవరో తప్పుడు సమచారం ఇచ్చారు అని చెప్పగానే దీప ఆలోచనలో పడి ఇదంతా మోనిత ప్లాన్ అని అర్ధం చేసుకుని ఇంటికి వెళ్తుంది.అటు శౌర్య మాత్రం..తనతో ఫోన్లో మాట్లాడింది అమ్మేనా అనుకుంటూ మళ్లీ ఇంద్రుడికి కాల్ చేస్తుంది. ఇందాక నీతో మాట్లాడిన ఆవిడ ఫొటో పంపించవా అని అడిగితే ఆమె దింపేశానమ్మా అంటాడు.ఆవిడే మా అమ్మ అనిపించింది బాబాయ్ అని అందుకే అడిగానంటుంది. ఈసారి కనిపించినప్పుడు అడుగుతలేమ్మా అని సర్ది చెబుతాడు.


Share

Related posts

Intinti Gruhalakshmi: నందు కూడా ఇలా తయారయ్యాడేంటి.!? లాస్య, గాయత్రి ప్లాన్ గోవిందా.!

bharani jella

తులసి మళ్ళీ సామ్రాట్ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందా.!? తులసి బిజినెస్ ప్రపోజల్ నందు యాక్సెప్ట్ చేస్తాడా.!?

bharani jella

Intinti Gruhalakshmi: ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నెక్స్ట్ వీక్ ఏం జరుగుతుందంటే.!?

bharani jella