NewsOrbit
Telugu TV Serials

కొడుకు కోసం వెళ్లిన మోనిత..కార్తీక్ కు దగ్గర అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్న దీప..!!

Share

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1458 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు సెప్టెంబర్ 17 న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరగనుందో ముందుగా తెలుసుకుందాం..గత ఎపిసోడ్ లో మోనిత మాటలను నమ్మిన దీప ఆశ్రమానికి వెళ్ళడానికి రెడీ అవుతుంది. అయితే చంద్రుడు దీపకు అక్కడ ఆశ్రమం లేదు అని చెప్పడంతో షాక్ అయ్యి మోనిత మోసాన్ని గ్రహిస్తుంది దీప. తిరిగి తన అన్నయ్య ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్నీ చెబుతుంది.ఇదే క్రమంలో ఈరోజు ఎపిసోడ్ ముందుకు కొనసాగనుంది.దీపకు దైర్యం చెప్పి ముందు నువ్వు ఇంటికి వెళ్లమ్మ అని చెబుతుంది.ఒకవేళ నిజంగానే కార్తీక్‌ని తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తుంటే మాకు చెప్పు మేము వచ్చి ఎక్కడీకి తీసుకుని వెళ్లకుండా ఆపొచ్చు అంటారు ఇద్దరూ. దాంతో సరేనని దీప అక్కడికే బయలుదేరుతుంది.

శివను కొట్టిన మోనిత :

ఇక మోనిత బ్యాగ్ తీసుకుని ఊరు వెళ్ళడానికి బయలుదేరుతుంది.వెళ్తూ వెళ్తూ శివతో మీ సార్‌ని బాగా చూసుకో అని చెప్పి వెళ్తుంది. మేడమ్ మీరు అసలు సార్‌ని వదిలిపెట్టి ఉండలేరు కదా మరి ఆయన్ని తీసుకోని వెళ్లకుండా వెళ్తున్నారేంటి అంటే మోనిత వేరే వాళ్ళకి ఫోన్ చేసి హలో ఈ మధ్య మా డ్రైవర్‌కి క్యూరియాసిటీ ఎక్కువతుంది గాని నాకు కొత్త డ్రైవర్ కావాలి అంటుంది. వెంటనే శివ.. మోనిత కాళ్ల మీద పడి నా జాబ్ తీయొద్దు మేడమ్ అంటే సరే అనేసి మోనిత బ్యాగ్ తీసుకుని వెళ్లిపోతుంది.

అమ్మ చేతి వ్రాత గుర్తుపట్టిన సౌర్య:

ఇక ఇంద్రుడు సరుకులు తీసుకుని ఇంటికి వస్తాడు.పక్కింటి వాళ్లు ఇంట్లో ఫంక్షన్ అందుకే ఇన్ని సరుకులు తెప్పించాను అంటుంది చంద్రమ్మ. సరుకులను చేసి సౌర్యకు దీప గుర్తు వస్తుంది. చంద్రమ్మ చేతిలోని సరుకుల లిస్ట్ ఉన్న బుక్ చూసి షాక్ అవుతుంది ఇది మా అమ్మ రాతే.. ఇలానే రాస్తుంది ఇది ఎవరు రాశారు’ అంటుంది. ‘ఇందాక ఆటో ఎక్కిన ఆవిడ రాశారమ్మా’ అంటాడు ఇంద్రుడు. ‘గొంతు, రాత ఒకేలా ఉన్నాయి అంటే ఆవిడే మా అమ్మ తను బతికే ఉందిఅంటూ ఎమోషనల్ అవుతుంది.

ఆనంద్ కోసం వచ్చిన హిమ, సౌందర్య:

మరునాడు ఉదయం హిమ ఎలాగైనా ఆనంద్‌ని మనింటికి తెచ్చేసుకుందాం అని సౌందర్య, ఆనందరావు, హిమలు కలిసి కారులో లక్ష్మణ్ ఇంటికి బయలుదేరతారు. అప్పటికే మోనిత లక్ష్మణ్ ఇంట్లో తన కొడుకు ఆనంద్‌ని ఎత్తుకుని కూర్చుని వాళ్లతో మాట్లాడుతూ ఉంటుంది. ‘బాబుని మాకే ఇచ్చేసి.. ఇప్పుడు మళ్లీ తీసుకుని వెళ్తానంటారేంటమ్మా అని బాధపడతారు.దాంతో మోనిత బాబుని తీసుకుని వెళ్తున్నా అని మీరేం భయపడకండి ఆస్తినేం తీసుకుని వెళ్లనులే’ అంటుంది.అమ్మా ఆస్తికంటే బాబుతో మాకు పెరిగిన అనుబంధమే వందరెట్లు ఎక్కువ అంటారు. మీకు బాబుని చూడాలనిపిస్తే చెప్పండి నేనే తీసుకొచ్చి చూపిస్తాను’ అంటూ ఆనంద్‌ని తీసుకుని వెళ్లిపోతుంది.

బిడ్డను తీసుకుని వెళ్లిన మోనిత :

మోనిత కారు అలా వెళ్లగానే ఇలా ఆనందరావు, సౌందర్యల కారు వచ్చి ఆగుతుంది లక్ష్మణ్ ఇంటి ముందు. మా మనవడు ఎక్కడా అని లక్ష్మణ్ ను అడగగా ఇప్పుడే మోనిత వచ్చి తీసుకుని వెళ్లింది అనగానే ముగ్గురూ షాక్ అవుతారు. ‘అసలు ఏం చేస్తోందండి ఈ మోనితా’ అంటుంది సౌందర్య. ‘తన కొడుకుని తను తీసుకుని వెళ్లింది అంతే కదా ఎక్కువగా ఆలోచించకు సౌందర్యా’ అంటాడు ఆనందరావు.

కార్తీక్ కోసం వచ్చిన దీప :

ఇక కార్తీక్ సోఫాలో కూర్చుని ఎన్నెన్నోజన్మల బంధం అంటూ పాట పాడుతూ ఉంటాడు. వెంటనే శివ నవ్వుతూ మీకు పాత విషయాలు గుర్తు లేకపోయినా పాత పాటలు భలే గుర్తున్నాయి సార్’ అంటాడు. సార్ మేడమ్ ఊరులో లేరు కదా సార్ మీకు గతమేంటీ? గత జన్మ గుర్తొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటాడు శివ. వెంటనే శివని లాగిపెట్టి కొట్టి వెళ్ళిపో అంటాడు. దాంతో శివ అక్కడ నుంచి లేచి వెళ్లిపోతాడు.ఎదురుగా దీప రావడం చూసిన శివ దీపకు అడ్డుపడి మేడమ్ ఊరిలో లేరు నా ఉద్యోగం పొగొట్టొద్దు ప్లీజ్ వెళ్లు వంటలక్కా అంటాడు.మా మేడమ్ చెన్నై వెళ్లింది.రేపు మార్నింగ్ వస్తారు’ అంటూ దీపని అక్కడ నుంచి బలవంతంగా పంపిస్తాడు.


Share

Related posts

Intinti Gruhalakshmi: తులసికి భర్తైన సామ్రాట్.. సైన్ కూడా పెట్టేసాడా.!? రేపటికి సూపర్ ట్విస్ట్.!

bharani jella

Karthikadeepam: దీపను కలవరిస్తున్న కార్తీక్… మోనిత నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఎంట్రీ ఇచ్చిన దుర్గ..!

Ram

Ardhangi: జెమినీలో సరికొత్త ధారావాహిక అర్ధాంగి.. ఆ సీరియల్ రీమేక్.. 

bharani jella