బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1439 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈ రోజు ఆగస్టు 24 న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి. జరిగిందో ముందుగా తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో దీప పెళ్లిరోజు వేడుకను డాక్టర్ ఇంట్లో సెలెబ్రేట్ చేస్తారు. మరోపక్క. దీప కార్తీక్ ఫోటోను తీసుకుని కార్తీక్ ను వెతికే పనిలో పడుతుంది. ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ లో దీపకు అనూహ్యంగా మోనిత కంట పడుతుంది. ఈరోజు సీరియల్ ప్రారంభంలోనే ఓ పార్క్ కి వెళ్లి కార్తీక్ ఫోటో పట్టుకుని చూపిస్తూ అందర్నీ అడుగుతుంటుంది. ఎవ్వరూ చూడలేదని చెబుతారు. మరోవైపు మోనిత కూడా కార్తీక్ ఫొటో పట్టుకుని వెతుకుతూ అనుకోకుండా దీపకి చూపించి ఇతను మీకు తెలుసా అని అడుగుతుంది. ఇద్దరూ ఒకర్నొకరు చూసుకుని షాక్ అవుతారు.
దీపకు ఎదురుపడిన మోనిత :
దీపను చూసిన మోనిత నువ్వు బతికే ఉన్నావా అంటే నా కార్తీక్ కూడా బతికే ఉండి ఉంటాడు.ఎక్కడున్నాడు
అని దీపను అడుగుతుంది. మోనితను చూసిన దీప నా డాక్టర్ బాబుని హాస్పిటల్ నుంచి తీసుకెళ్లింది నువ్వేకదా ఎక్కడున్నాడు అంటుంది. నాకేమి. తెలుసు… నాకు తెలియదు అంటుంది మోనిత.నీ నాటకాలు చాలు..డాక్టర్ బాబు కోసం హాస్పిటల్ కి వెళ్లి అడిగితే తన భార్య వచ్చిందని చెప్పారు. నిన్ను చూస్తేనే డాక్టర్ బాబు అసహ్యించుకుంటారు కదా అందుకే నువ్వు కాదని సరిపెట్టుకున్నాను. నువ్విక్కడ కనిపించావంటే డౌటే లేదు.. నువ్వే డాక్టర్ బాబుని తీసుకెళ్లావ్..ఎక్కడున్నారో చెప్పు అని కోపంతో దీప ఉగిపోతుంది. నిజంగానే కార్తీక్ నాదగ్గరుంటే ఈ ఫోటో పట్టుకుని ఎందుకు తిరుగుతాను. కార్తీక్ చనిపోయాడని చెబుతున్నా..యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచీ ప్రతి వీధి దగ్గరా కార్తీక్ కోసం వెతుకుతూనే ఉన్నాను.
కార్తీక్ మోనిత దగ్గర లేడా..?
ఇక కార్తీక్ లేడని నిరాశపడతుండగా నువ్వు కనిపించావ్. నా ఆశని బతికించావ్.అయినాగాని నువ్వుండి నీ దగ్గర కార్తీక్ లేకపోవడం ఏంటి..ఎవరో తీసుకెళ్లారు అంటున్నావ్..ఎవరది..కార్తీక్ ని ఎవరు తీసుకెళ్లారు అంటుంది మోనిత.దీప మాత్రం నీ కంటికి ఎలా కనిపిస్తున్నానే నువ్వు చెప్పే సోది. అంతా నమ్మే పిచ్చిదానిలా కనిపిస్తున్నానా..నువ్వు తప్ప డాక్టర్ బాబుని తీసుకెళ్లే అవసరం ఎవరికీ లేదు. నాటకాలు ఆడకుండూ డాక్టర్ బాబు ఎక్కడున్నారో చెప్పు అంటుంది. కార్తీక్ నాతో ఉంటే ఎంత సంతోషంగా ఉంటానో..లేకపోతే ఎంత బాధగా ఉంటానో తెలియదా..కార్తీక్ కోసం పిచ్చిదాన్ని అయిపోతున్నాను దీపా..అవేవీ అర్థం చేసుకోకుండా నన్నే అనుమానిస్తున్నావ్ న్యాయంగా ఉందా దీపా..ముందు కార్తీక్ ఏమయ్యాడో ఆలోచించు..నీకూ కనిపించలేదు నాకూ కనిపించలేదు… అంటే ఏమైనట్టు.ఎవరు తీసుకెళ్లినట్టు.. అని చెప్పేసి కార్తీక్ ఫొటో పట్టుకుని మళ్లీ వెతకడం ప్రారంభిస్తుంది మోనిత
సౌర్య కోసం హిమ తపన :
సీన్ కట్ చేస్తే అమ్మ నాన్నల ఫోటో దగ్గర హిమ బాధపడుతూ ఉంటే సౌందర్య వస్తుంది. చనిపోయిన మా అమ్మా నాన్నలను తిరిగి తేలేరు.కనీసం శౌర్యని అయినా తిరిగి తేవచ్చు కదా నానమ్మ అంటుంది.
తను రావడం లేదు అంటే నన్నేం చేయమంటావు. శౌర్య అంటే నీ ఒక్కదానికే ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నావు అంటుంది. ఇక
ఆనందరావు కూడా వచ్చి మాకు శౌర్య అంటే ఇష్టమే కానీ అది మొండికేసింది. రానంటే రానంటోంది అంటాడు.ఇప్పుడు శౌర్య ఎక్కడుందో తెలిసింది కదా వెళ్లి తీసుకొద్దాం అంటుంది.ఇప్పటికీ శౌర్య అక్కడే ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ ఇంటికి రావాలనిపిస్తే ఫోన్ నెంబర్ ఉంది కదా..ఫోన్ చేసేది కదా… అంటే శౌర్య రాలేనట్టే కదా అంటుంది సౌందర్య.
భార్యపై కార్తీక్ ఫ్రస్ట్రేషన్ మాములుగా లేదుగా?
ఆ తర్వాత సీన్ లో కార్తీక్, శివ కార్లో వెళ్తూ మధ్యలో దిగుతారు. అప్పుడు కార్తీక్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడిగితే మిమ్మల్ని ఎలా ఇంటి నుంచి బయటకు తీసుకు వచ్చాను అలాగే ఇంటికి వెళ్లి మేడంకి అప్పగించాలి సార్ అంటాడు. ఎందుకయ్యా నన్ను ఇంతలా పంజరంలో చిలకలాగా ఉంచుతున్నారు.అసలు అది నా భార్యే కాదు అంటాడు కార్తీక్.భార్య కాకపోవడం ఏంటి సార్ అని అడుగుతాడు శివ.మరి లేకపోతే భర్తను ఎవరైనా ఇలా స్వతంత్ర్యం లేకుండా చూసుకుంటారా అని ఫైర్ అవుతాడు కార్తీక్.
మోనిత ఇంటికి వెళ్లిన దీప :
సౌందర్య…దీప-కార్తీక్ ఫొటో దగ్గర నిల్చుని..శౌర్య రానంటే రాను అన్న మాటలు గుర్తుచేసుకుని ఏడవడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో దీప మోనిత మాటలను నమ్మదు. మోనితను ఫాలో అవుతూ తన ఇంటికి వెళ్తుంది.మోనిత నాటకాలు ఆడుతుంది.అవసరం అయితే ఈరోజు దాన్ని చంపేసి అయినా డాక్టర్ బాబుని తీసుకెళతాను అనుకుంటూ లోపల అడుగుపెట్టగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది దీప.