NewsOrbit
Entertainment News Telugu TV Serials

Karthikadeepam: మోనితను కొట్టిన దీప… ఆనంద్ కు తండ్రిని నేనేనా అంటూ మోనితను అడిగిన కార్తీక్..!

Karthika Deepam October18 Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1485 వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది.ఇక ఈరోజు అక్టోబర్ 18 న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.కార్తీకదీపం సీరియల్‌లో ప్రస్తుతం ఫ్లాష్ బ్యాక్ స్టోరీ నడుస్తుంది.గత ఎపిసోడ్ లో కార్తీక్ దీప ఇంటి ముందే నిద్ర పోతాడు.ఇక ఈరోజు పొద్దున లెగుస్తూనే వాకిట్లో ఉన్న డాక్టర్ బాబుని చూసి దీప కంగారుపడుతుంది. ఏంటి డాక్టర్ బాబు ఇక్కడ పనుకున్నారు నన్ను లేపవలసింది కదా అంటుంది. రోజు త్వరగా లేచేదాన్ని ఈరోజే మొద్దు నిద్ర పట్టేసింది అని అంటుంది దీప. ఇక బయట కూర్చున్న కార్తీక్ ను లోపలికి రమ్మంటుంది. కానీ కార్తీక్ మాత్రం నేను రాను నీ పని నువ్వు చూసుకో అని అంటాడు

పిల్లల గురించి ఆరా తీస్తున్న కార్తీక్ :

Karthik deepa

ఇక ఇంటి పనిచేసుకుంటున్న దీపని,నీ పిల్లలు ఎక్కడున్నారు అని అడుగుతాడు. నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళు ఇద్దరు వాళ్ళ నాన్నమ్మ వాళ్ళతో కలిసి అమెరికా వెళ్ళిపోయారు అని అంటుంది. అప్పుడు కార్తీక్ మనసులోనే లేదు దీప శౌర్య ఇక్కడే ఉంది నీకే ఆ విషయం తెలియట్లేదు అని అనుకుంటాడు.నిజం చెబుదామంటే ఇప్పుడు మోనిత ఉన్న ఆవేశంలో కామ్ గా ఉండటమే కరెక్ట్ అని అనుకుంటాడు.కాసేపు అయ్యాక కాస్త తలనొప్పిగా ఉంది దీప టీ పెట్టి ఇస్తావా అని అడుగుతాడు.హ సరే అంటుంది దీప

దీపతో కార్తీక్ ను చూసి రెచ్చిపోయిన మోనిత :

Karthik deepa monitha


సీన్ కట్ చేస్తే పొద్దున్నే లేచిన మోనిత,కార్తీక్ ఇంకా ఇంటికి రాకపోవడాన్ని చూసి చాలా కంగారు పడుతుంది.ఇంకా రాలేదు అంటే ఒకవేళ దీప ఇంటికి గాని వెళ్లాడా?అని తన ఇంటికి వెళ్తుంది. అక్కడ మంచం మీద కూర్చుని టీ తాగుతున్న దీప, కార్తీక్ ని చూసి ఆవేశంగా నా మొగుడిని రాత్రంతా ఇంట్లో పెట్టుకుంటావా అని మోనిత అనడంతో దీపకు ఒక్కసారిగా కోపం వచ్చి లాగి పెట్టి మోనిత చెంప పగలకొడుతుంది దీప. నన్ను కొడతావా నీకు ఎంత ధైర్యం అని అంటుంది మోనిత .పిచ్చివాగుడు వాగితే ఇంకా గట్టిగా కొడతాను అంటుంది దీప.

మోనితను కోట్టిన దీప :

Screenshot 20221018 110541 1


ఏంటి కార్తీక్ నువ్వు నీ భార్యని కొడుతూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా అని కార్తీక్ ని అడుగుతుంది మోనిత. ఎవరు నా భార్యా…నువ్వా దీప అని అనుమానంగా అడుగుతాడు కార్తీక్. మళ్లీ కార్తీక్ నే ఓ నువ్వే కదా, మర్చిపోయాను అని అంటాడు అమాయకంగా. కార్తీక్ అని మోనిత గట్టిగా అరవడంతో ఓహ్ నువ్వే కదా నా భార్యవి అంటాడు..అసలు ఏమి జరిగింది అని వంటలక్క నిన్ను కొట్టింది అని అంటే మోనిత అన్న మాటలు దీప చెప్పడంతో ఇక కార్తీక్ నువ్వు అన్నమాట ఇంకొక ఆడదాని దగ్గర అని ఉంటే ఆవిడ ఇంతకన్నా ఎక్కువ రియాక్ట్ అయ్యేది అని అంటాడు కార్తీక్. నువ్వు మారిపోయావ్ కార్తీక్..నీకోసం నేను పడే ఆరాటం తెలియడం లేదు రాత్రంతా నీకోసం ఎంత కంగారుపడ్డానో తెలుసా అని అంటుంది మోనిత.

నా భార్య ఎవరు అన్నా కన్ఫ్యూషన్ లో కార్తీక్ :

Karthik deepa monitha


సర్లే పదా అని అక్కడి నుంచి మొనితని ఇంటికి తీసుకెళ్ళిపోతాడు కార్తీక్. ఇంటికి వచ్చిన మోనిత దీప కొట్టిన చంప దెబ్బను గుర్తు చేసుకుంటూ ఉంటే కార్తీక్ వచ్చి ఏమైంది అంటుంది. ఇప్పుడే జరిగింది కదా అప్పుడే మర్చిపోయావా అని అడుగుతుంది మోనిత. ఓ అవును దీప నిన్ను కొట్టింది కదా అని అంటాడు. నేను నీ భార్య నే కదా నీ భార్యని ఎవరైనా చంప మీద కొడితే నువ్వు ఏం చేయాలి.ఇంతకుముందు నువ్వు ఇలా ఉండేవాడివి కాదు అంటుంది మోనిత.రాత్రంతా నీ కోసం ఎదురు చూసినందుకు పొద్దున్నే నాకు మంచి బహుమానం ఇచ్చావని అంటుంది.

మోనితను ఆట ఆడుకుంటున్న దుర్గా:

Monitha durga



అంతలోనే టిఫిన్ తీసుకుని వచ్చిన దుర్గ, అదేంటి మోనిత , డాక్టర్ సార్ ఎక్కడికో వెళ్లారు పొద్దున్న వస్తారో రారో తెలీదు మన ఇద్దరికీ రవ్వ దోస తెస్తే చాలు అన్నావు కదా అని అంటాడు.పోనీలే ఈ దోశ మీరు తినండి నేను ఎక్కడో బయట తింటాను అని అంటాడు దుర్గ. దుర్గ మీద అరుస్తుంది మోనిత. నేను నీకు ఎప్పుడు చెప్పాను అని అంటుంది. ఆ మాట విన్న డాక్టర్ బాబు వద్దులేండి మీరే తినండి నేనే వంటలక్క దగ్గరికి వెళ్లి ఏదో ఒకటి తింటాను అని అంటాడు. అంతలోనే దీప వచ్చి మీరు కనిపించడం లేదని రాత్రి అన్నం తినకుండా పడుకున్నాను. పొద్దున ఆ అన్నంని పులిహారగా చేశాను. తింటారా అని అంటుంది దీప. ఇక మోనిత చద్ది అన్నం తినే కర్మ ఆయనకేంటి అని అనే లోపు కార్తీక్ అందరికీ నీలా రవ్వ దోశలు తెచ్చేవాళ్ళు ఉండొద్దా, నాకు అదే ఎక్కువ పద దీప వడ్డించు అని చెప్పి లోపలికి తీసుకెళ్ళిపోతాడు.

ఆనంద్ కు తండ్రిని నేననా అంటూ మోనితను నిలదీసిన కార్తీక్ :

Deepa anand


ఇక దుర్గ సరే పదా మోనిత వాళ్ళిద్దరూ టిఫిన్ చేస్తున్నారు కదా మనిద్దరం కూడా టిఫిన్ చేద్దాంఅని అంటాడు దుర్గ. రేయ్ అని అంటూ దుర్గ ని కొట్టబోతుంది మోనిత. అప్పుడు దుర్గా మోనితని అడ్డుకుంటూ నీకు నన్ను ఏదో చేయాలనిపిస్తుంది కానీ ఏమి చేయలేకపోతున్నావు. నిన్ను ఇలానే టార్చర్ పెట్టి నీ నోటి వెంటే నిజం చెప్పిస్తా అంటాడు.ఈలోపు బాబు ఏడవడం చూసి దీప ఎత్తుకుంటుంది.ఆ ఏడుపు విని లోపలికి వచ్చిన మోనిత బాబుని ఎత్తుకున్న దీపని నువ్వెందుకు ఎత్తుకున్నావ్ అని కసురుకుంటుంది. నువ్వు బయట కస్టమర్స్ తో బిజీగా ఉన్నావు కదా నేను ఎత్తుకోమన్నాను అని అంటాడు కార్తీక్. అసలు వాడు నా కొడుకేనా అని కార్తీక్ అనగానే మోనిత ఏంటి కార్తీక్ అని అంటుంది. మరి లెకపోతే ఏంటి మోనిత వాడు నా కొడుకే కదా మరి నాకు హక్కు లేదా, దీప వాడిని ఎత్తుకుంటే ఏడవడం ఆపేస్తున్నాడు అని ఎట్టుకోమన్నా అంటాడు. నువ్వే ఎత్తుకో అని దీప కి చెప్తాడు కార్తీక్.ఇంతలో కార్తీక్ కు ఫోన్ రాగానే ఇప్పడే వస్తున్న అని వెళ్ళిపోతాడు. అయితే దీప, మోనిత ఇద్దరు కూడా కార్తీక్ కి ఫోన్ చేసింది ఎవరు అని ఆలోచనలో పడతారు

వారణాసి గురించి సౌర్య ఆందోళన :

Sourya tense about varanasi



సీన్ కట్ చేస్తే శౌర్య ఆటో బాబాయ్ ని వారణాసి గురించి కనుక్కుంటుంది. జాతర చూడ్డానికి వెళ్ళినప్పుడు అతన్ని ఎవరో కొట్టారు అంట బతుకుతాడని ఎవరు అనుకోవట్లేదు అని బాబాయ్. అప్పుడు శౌర్య ఏడుస్తూ వారణాసి చాలా మంచివాడు బాబాయ్ నా కోసమే ఇక్కడ ఉన్నాడు. అందరూ కలిసి ఉండవలసిన సమయంలో ఒక్కొక్కరు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు.
అయినా అతనికి శత్రువులు ఎవరూ లేరు ఎవరు కొట్టి ఉంటారు అని ఆలోచిస్తూ మౌనిత అన్న మాటలు గుర్తొచ్చి, ఆ మోనిత కొట్టించి ఉంటుంది అనుకుంటారు.ఇక హాస్పిటల్ కి వచ్చిన కార్తీక్ బెడ్ మీద ఉన్న వారణాసిని చూసి బాధపడతాడు. నా భార్యకి పిల్లలకి ఎంతో తోడుగా ఉన్నావు నీ రుణం తీర్చుకోలేను నిన్ను నేను కాపాడుకుంటాను వారణాసి యొక్క ఆరోగ్యం గురించి డాక్టర్ని అడిగి తెలుసుకుంటాడు.తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Brahmamudi April 16 2024 Episode 385: రాజ్ బిడ్డని తన బిడ్డ అన్న నీరజ.. రుద్రణి ప్లాన్ సక్సెస్.. రాజ్ రహస్యం కనిపెట్టిన కావ్య, శ్వేత..

bharani jella

Trinayani April 16 2024 Episode 1214: గాయత్రీ దేవి చేయించిన వజ్రాల మంగళసూత్రం వేసుకున్న విశాలాక్షి..

siddhu

Jagadhatri April 16 2024 Episode 206: మీనన్ పట్టుకోవాలనుకున్న జగదాత్రి ఎలా తప్పించుకుంటుంది..

siddhu

Nuvvu Nenu Prema April 16 2024 Episode 599: కృష్ణ మీద పార్వతి అనుమానం.. బిడ్డ కోసం తల్లి బాధ.. ప్రమాదంలో ఉన్న విక్కీ నీ పద్మావతి కాపాడుకోగలిగిందా?

bharani jella

Krishna Mukunda Murari April 16 2024 Episode 446: ముకుంద నీ ఇష్టపడుతున్న ఆదర్శ్.. కృష్ణ ని తల్లి కాకుండా చేసేందుకు ముకుంద ప్లాన్..

bharani jella

NTR: ఎన్టీఆర్ తో సెల్ఫీ…. సారీ చెప్పిన బాలీవుడ్ హీరోయిన్..!!

sekhar

Manchu Manoj: కూతురు పుట్టిన వెంటనే మంచు మనోజ్ చేసిన పనికి అవాక్ అయిన మౌనిక.. కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్..!

Saranya Koduri

Mogalirekulu: మొగలిరేకులు సాగర్ భార్యను చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్.‌.!

Saranya Koduri

Kumkuma Puvvu April 15 2024 Episode 2155: ఆశ కిటికీ లోనుండి బంటి ని చూస్తుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 15 2024 Episode 1050: మహేంద్ర ఫణీంద్ర అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాడా లేదా.

siddhu

Malli Nindu Jabili April 15 2024 Episode 623: గెట్ రెడీ గౌతమ్ రోజు నీకు నరకం చూపిస్తూ చచ్చి బ్రతికేలా చేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Mamagaru April 15 2024 Episode 186: పెళ్లి పేరుతో అందరినీ కలపాలనుకుంటున్నావా అంటున్న చంగయ్య,చంగయ్య ని మోసం చేసిన ఒక వ్యక్తి..

siddhu