NewsOrbit
Telugu TV Serials

మోనిత కొత్త నాటకం… దెబ్బకు దీపను ఛీ కొట్టిన కార్తీక్..!!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ 1450 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈ రోజు సెప్టెంబర్ 6 న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.ఇక ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే దీప తీసుకెళ్లిన వంట తిన్న మోనిత వాంతి చేసుకుని పడిపోతుంది. మోనితకు వాంతులు అవ్వడంతో కంగారుపడిన కార్తీక్ డాక్టర్ కి కాల్ చేస్తాడు. మోనితకు వాంతులు అవ్వడం చూసిన దీప ఇది ఏదో నాటకం ఆడుతున్నట్టుందని మనసులో అనుకుని టెన్షన్ పడుతుంది.

మోనితకు ఇలా అవ్వడానికి కారణం నిజంగా వంటలక్కా..?

ఇంటికి వచ్చిన డాక్టర్ ఏమైందని అడిగితే ఇప్పుడే టిఫిన్ తిన్నదని చెబుతాడు కార్తీక్.వచ్చిన డాక్టర్ తో మోనిత ముందే మాట్లాడుతుంది.ఇదంతా నాటకమే కదా ఈ యాక్షన్ మా ఆయన ముందు చేయండని చెబుతుంది. మేడంకి ఫుడ్ పాయిజన్ అయిందని కార్తీక్ తో చెబుతుంది. కరెక్ట్ సమయానికి తీసుకొచ్చారు లేదంటే ఆవిడ ప్రాణాలకే ప్రమాదం ఏర్పడేది అని చెబుతాడు డాక్టర్.మళ్ళీ సీన్ వారణాసి, శౌర్య ఇద్దరి దగ్గర ఓపెన్ అవుతుంది. మోనిత ఉన్న హాస్పిటల్ కు వెళతారు. కానీ కార్తీక్ ని సౌర్య వాళ్ళు చూడరు. ఇక కార్తీక్ ఎవరు చేశారు ఫుడ్ పాయిజన్ అంటే మనం ముబై వెళ్తున్నామని తెలిసి నన్ను చంపేస్తే నిన్ను తన వశం చేసుకోవాలనుకుంటోందని ఆ వంటలక్కే ఈ ప్లాన్ చేసిందేమో అని చెబుతుంది మోనిత.

మోనిత మాటలను కార్తీక్ నమ్ముతాడా.?

మోనిత మాటలు విన్న కార్తీక్ షాక్ అయ్యి నేను నమ్మలేకపోతున్నాను అంటాడు.అంటే కార్తీక్ నేను అబద్దం చెబుతున్నా అంటావా అని దొంగ కన్నీళ్లు కారుస్తుంది. అయినా ఆవిడపై నీకు అంత సాఫ్ట్ కార్నర్ ఏంటి…నన్ను ఏమైనా చేసి డాక్టర్ బాబుని తీసుకెళ్లిపోదాం అనుకుంటే వెళ్లిపోతావా కార్తీక్. నీ ప్రవర్తన చూస్తే నాకు అలాగే ఉంది అంటుంది మోనిత. దానితో ఎప్పటికైనా నా ప్రాణాలకు ప్రమాదమే అని దొంగ కన్నీళ్లు పెట్టుకుంటుంది.

దీపను తిట్టిన కార్తీక్ :

కార్తీక్ కోపంతో శివతో పాటు వంటలక్క ఇంటికి వెళ్తాడు.అదే సమయంలో దీప వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది.అప్పుడే కార్తీక్ కోపంతో తలుపులు ఫోర్స్ గా తోస్తాడు. చాలా కోపంతో నేను నీ డాక్టర్ బాబు ని కాదని చెప్పినా వినడం లేదు ఎందుకు ? ప్రపంచంలో అందరూ చెడ్డోళ్ళు కాదు కొన్ని మంది మంచి మనుషులు కూడా ఉంటారు అనుకుని నిన్ను నమ్మాను. కానీ నా భార్యకే విషయం పెడతావా? నా భార్యని చంపేసి,ఎలాగో మతిమరుపు వాడిని కదా రెండు మూడు రోజుల్లో గతం మర్చిపోయిన తర్వాత నన్ను పెళ్లి చేసుకుందామనుకుంటున్నావా? అంటాడు.భార్యని కూడా మర్చిపోయే అంత మతిమరుపు లేదు నాకు అని దీపను తిడతాడు. అసలు పెళ్లి అయిన అబ్బాయి మీద మనసుపడడానికి నీకు ఎలా మనసు వచ్చింది అని తిడతాడు.

డాక్టర్ అన్నయ్య దగ్గర కన్నీళ్లు పెట్టుకున్న దీప :

దీప ఏదో చెప్పేందుకు ప్రయత్నించినా కార్తీక్ వినడు.నీకు డబ్బు కావాలంటే ముఖం మీద అడుగు ఇస్తాను..ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు.ఇంకెప్పుడు నీ మొఖం నాకు చూపించొద్దు అని చెప్పి కోపంగా వెళ్ళిపోతాడు.పాపం దీప ఏడుస్తూ ఉంటుంది.అదే సమయంలో డాక్టర్, డాక్టర్ వాళ్ల అమ్మ దీప ఇంటికి వస్తారు. జరిగిన విషయం వాళ్లకు చెప్పి ఆయన దృష్టిలో నేను చెడ్డదాన్ని అయిపోయాను రేపు మా పిల్లల పుట్టినరోజు ఆయన్ని గుడికి తీసుకెళ్లి అభిషేకం చేయిద్దాం అనుకున్నాను కానీ అది కూడా జరగకుండా చేసిందా మోనిత అని దీప ఏడుస్తుంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu