NewsOrbit
Telugu TV Serials

Karthikadeepam: దీపను కలవరిస్తున్న కార్తీక్… మోనిత నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఎంట్రీ ఇచ్చిన దుర్గ..!

Karthikadeepam : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్‌ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1469 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు సెప్టెంబర్ 30 న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం..గత ఎపిసోడ్ లో మోనితకు దుర్గ కనిపిస్తాడు.దుర్గ కూడా మోనితను చూడడంతో ఈరోజు ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా ముందుకు సాగిందనే చెప్పాలి.

Karthikadeepam: దుర్గ గురించి ఆలోచనలో పడిన మోనిత :

Monitha thinking about durga

ఇంటికి వెళ్లిన మోనిత ఏంటి ఆ దుర్గా గాడు మళ్లీ నా జీవితంలోకి వచ్చాడు? అసలు వాడు ఎందుకు వచ్చాడు. కార్తీక్ నా దగ్గర ఉన్న విషయం ఎవరికీ తెలియకూడదు అనుకుంటే ఒకళ్ళ తరువాత ఒకళ్ళు ఇక్కడకు వచ్చి నాలో టెన్షన్ ఇంకా రెట్టింపు చేస్తున్నారు అనుకుంటుంది. మొన్నటికి మొన్న దీప, తరువాత సౌందర్య ఆంటీ, నిన్న సౌర్య ఈరోజు ఈ దుర్గ అసలు వీళ్లంతా కావాలనే చేస్తున్నారా? అని అనుకుంటూ అయితే ఏంటి? నేనెందుకు భయపడాలి? కార్తీక్‌కి గతం గుర్తొచ్చినప్పుడు కదా అలా ఎప్పటికీ జరగదు కార్తీక్ చివరి శ్వాస విడిచే వరకూ ఈ మోనితనే కలవరించాలి.. కలవరిస్తాడు అని తనలో తనే అనుకుంటూ ఉంటుంది

దీప, సౌర్యలను కలవరిస్తున్న కార్తీక్… షాక్ లో మోనిత :

Karthik monitha siva


అప్పుడే పక్క రూమ్‌లో పడుకున్న కార్తీక్ నిద్రలో దీపా అని కలవరిస్తాడు.అది విని మోనిత షాక్ అవుతుంది. దీపా.. రౌడీ.. అమ్మా సౌర్యా.. దీపా దీపా అంటూ కలవరిస్తూనే ఉంటాడు. సరిగ్గా అప్పుడే మేడమ్ అంటూ శివ లోపలికి వస్తాడు. శివ కూడా కార్తీక్ మాటలు వినేస్తాడు.శివ రావడంతో మోనిత గుటకలు మింగుతూ శివను వెళ్లి షాప్ మూసేసిరా అంటూ పంపించేస్తుంది. ఇక శివలో మోనిత మేడం కార్తీక్ సార్ భార్య కాదు అనే అనుమానం ఇంకా ఎక్కువ అవుతుంది.

దీపను కలిసిన దుర్గ :

Deepa durga

సీన్ కట్ చేస్తే మోనితను చూసిన దుర్గ కోపంతో మోనితను తిట్టుకుంటూ వెతుకుతూ ఉంటాడు. అప్పుడే దీపను చూసి దీపమ్మా నువ్వా? అంటూ ఆశ్చర్యంగా బండిదిగుతాడు దుర్గ. నువ్వేంటమ్మా ఇక్కడున్నావ్ అంటూ దుర్గ ఆరా తీయడంతో దీప జరిగింది అంతా చెబుతుంది. ఇంతకు తెగించిందా..’ అంటూ డైరెక్ట్ గా మోనిత ఇంటికి వెళ్తాడు.

దుర్గను ఇంటి నుంచి గేంటేసిన మోనిత :
Durga siva

కాలింగ్ బెల్ కొట్టడంతో మోనిత బయటికి వచ్చి దుర్గను చూసి షాక్ అవుతుంది. ఎందుకొచ్చావ్ పో బయటికి అంటుంది.శివ వచ్చి ఎవరు మేడమ్ అంటే నేను మీ మేడంకు దూరపు బంధువు.. బెస్ట్ ఫ్రెండ్ ను కూడా అంటాడు దుర్గా.‘దూరపు బంధువే కానీ.. వీడు చాలా పెద్ద వెధవ బయటికి పంపించెయ్ శివ అని లోపలికి వెళ్తుంది మోనిత.ఇక దుర్గా దీప దగ్గరకు వస్తాడు. ‘దీపమ్మా నువ్వు ఏడవకు బాధపడకు. నీకు అండగా నేనుంటాను. డాక్టర్ బాబుకి కాదు ట్రీట్మెంట్ ఇచ్చేది ఆ మోనితకే ఇస్తాను.నేను నీ భార్యని కాదు కార్తీక్ అని మోనితతోనే చెప్పిస్తా అంటూ ధైర్యం చెబుతాడు.

దుర్గ గురించి కార్తీక్ కు చెప్పిన శివ :



కాసేపటికి కార్తీక్ బయటకు వచ్చి శివ శివా అని వెతుకుతాడు.శివ ఓ చోట ఇంటి ముందు గార్డన్‌లో పడిపోయి ఉంటాడు. వెంటనే కార్తీక్ కంగారుగా ముఖం మీద నీళ్లు జల్లడంతో శివకు మెలుకువ వస్తుంది.ఏమైంది శివా అని కార్తీక్ అడగగా మేడమ్ వాళ్ల ఫ్రెండ్ అంట ఎవరో వచ్చారు. మేడం బయటకు పంపించేయ్ అన్నారని ఆయన భుజం మీద చేయి వేశాను ఆయన లాగిపెట్టి కొట్టాడు అని చెప్తాడు శివ.
ఇంతలో దుర్గా వచ్చి ‘అవును సార్ కొట్టింది నేనే.మోనితది నాది బెస్ట్ ఫ్రెండ్ షిప్..మేము దూరపు బంధువులం కూడా నా మీద అలిగి ఇలా వచ్చేసింది. మాది చాలా క్లోజ్ బంధం సార్ ఒక చిన్న చిలిపి సంఘటన వలన మా మధ్య గొడవ జరిగింది అంటాడు.. ఇప్పుడు కాదులెండి మీ పెళ్లికి ముందు అది మనసులో పెట్టుకునే మీ పెళ్లి కూడా నన్ను పిలవలేదు అంటాడు.ఇప్పటికైనా మరిచిపోయిందని వస్తే ఆ కోపం ఇంకా అలానే ఉంది అంటాడు దుర్గా. ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు నన్ను బెదిరించి నా మీద పగ తీర్చుకోవాలి అనుకుంటే కార్తీక్‌కి నా గురించి చెప్పాలి కదా? ఈ నాటకాలన్నీ ఆడుతున్నాడేంటీ.?’ అని ఆలోచిస్తుంది మోనిత.

మోనితకు చుక్కలు చూపిస్తున్న దుర్గ, దీప :

Karthik deepa monitha durga


ఇంతలో దీప వస్తుంది. ఎవరు సార్ ఈయన అంటే మోనిత ఫ్రెండ్ అని చెప్తాడు. అవునా అంటుంది దుర్గ ఎవరో తెలియనట్టు. ఇక మోనిత మాత్రం. డౌట్ లేదు ఇద్దరు కలిసి ఏదో ప్లాన్ ప్రకారం చేస్తున్నారు అనుకుంటుంది మనసులో. ఇక దుర్గ బిజినెస్ పని మీద ఈ ఊరొచ్చాను సార్.. మోనితని కలిసి అలక తీర్చినట్లు ఉంటుంది కదా అని వచ్చాను కానీ మోనితకి నా మీద కోపం తగ్గలేదు కాబట్టే నన్ను బయటికి పంపించింది. ఓకే సార్ మోనితకి ఇష్టం లేనప్పుడు నేను ఇంకా ఇక్కడే ఉండటం బాగుండదు హోటల్‌లో రూమ్ తీసుకుంటాను లెండీ’ అంటూ వెళ్లబోతాడు దుర్గ. ఆగండి దుర్గా అంటాడు కార్తీక్. మోనిత మాత్రం బిత్తర చూపులు చూస్తూ ఉండడంతో ఈరోజు సీరియల్ ముగుస్తుంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Guppedanta Manasu April 24 2024 Episode 1058: వసుధార మను కి నిజం చెబుతుందా లేదా.

siddhu

Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి బాటలో నడుస్తున్న వసుధార.‌.. గుప్పెడంత మనసుకు గుడ్ బాయ్..!

Saranya Koduri

Maheshwari: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ ముద్దుగుమ్మ మహేశ్వరి.. హల్చల్ చేస్తున్న ఫొటోస్..!

Saranya Koduri

Karthika Deepam 2 April 24 2024: దీప ని ఆపిన సుమిత్ర… నరసింహని ఘోరంగా ఛీ కొట్టిన శోభ, కార్తీక్.. అంతు చూస్తా అంటూ సవాల్..!

Saranya Koduri

Jagadhatri April 24 2024 Episode 213: డాక్యుమెంట్ కొట్టేసి ఎంగేజ్మెంట్ ని ఆపాలనుకున్న నిషిక,  డాక్యుమెంట్ ఇస్తానంటున్న కౌశికి..

siddhu

Brahmamudi April 24 2024 Episode 392: గుడిలో అనామిక రచ్చ.. అనామిక మీద ఫైరైన కనకం.. రుద్రాణి ప్లాన్ ను తిప్పి కొట్టాలనుకున్న అప్పు..

bharani jella

 Trinayani April 24 2024 Episode 1221: గాయత్రి జాడ తెలుసుకోవాలనుకున్న తిలోత్తమ, అద్దంలో కనపడిన హాసిని..

siddhu

Naga Panchami: గుడిలో ఉన్న పంచమి మోక్షకు కనిపిస్తుందా లేదా.

siddhu

Kumkuma Puvvu: ట్రస్ట్ మెంబర్ పంపించిన ఫోటోలని శాంభవి చూస్తుందా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 24 2024 Episode 606: అక్క ఆచూకీ కోసం విక్కీ ఆరాటం.. అరవింద,కృష్ణ దగ్గర ఉందని తెలుసుకున్న దివ్య.. విక్కీ పద్మావతిల ఆనందం..

bharani jella