Karthikadeepam serial today episode review November 14 :బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1509వ ఎపిసోడ్లోకి అడుగుపెట్టింది.ఇక ఈరోజు నవంబర్ 14న ప్రసారం కానున్న Karthika Deepam serial,1509వ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.కార్తీకదీపం సీరియల్లో ప్రస్తుతం ప్లాష్ బ్యాక్ స్టోరీ నడుస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం 1509 వ ఎపిసోడ్లోకి కార్తీకదీపం సీరియల్ అడుగుపెట్టింది.గత ఎపిసోడ్ లో గుడిలో దీపాలు వెలిగించడానికి కార్తీక్, మోనిత, దీప కూడా వస్తారు.దీప,కార్తీక్ ఇద్దరు క్లోజ్ గా ఉండడం చూసి మోనిత కోపంతో రగిలిపోతుంది.
దీపను నదిలో తోసేయనున్న మోనిత :
ఈరోజు ఎపిసోడ్ లో కూడా అదే సీన్ కంటిన్యూ అవుతుంది.. మోనిత, దీపతో ఇలా అంటుంది.కార్తీక్ కి నా ప్రేమంటే విలువ లేకుండా పోయింది నేనంటే భయం లేకుండా పోయింది, ఇక మీ ఇద్దరిలో ఒకరు పోవడం ఖాయం’ అని మోనిత దీపతో అంటుంది. ‘ఇప్పటి వరకు నువ్వు ఏం చేసిన ఎందుకు భరిస్తున్నానో తెలుసా డాక్టర్ బాబుని క్షేమంగా ఉన్నారన్న ఒకే ఒక కారణంతో, ఆయనకి ఏ మాత్రం కీడు తలపెట్టాలనే ఆలోచన వచ్చినా నిన్ను నిలువునా చీరేస్తాను అని దీప… మోనితకు వార్నింగ్ ఇస్తుంది.
తగలబెట్టుకుంటా అంటున్న మోనిత :
సీన్ కట్ చేస్తే హిమ, ఆనందరావు శౌర్య గురించి మాట్లాడుకుని బాధపడతారు. దీప చెరువులో కార్తీకదీపాలు వదిలాడనికి వస్తుంది. ఆ వెనుకే మోనిత కూడా వస్తుంది.ఇక దీప దీపాలు వదలడానికి కిందకు వంగుతుంటే అదే అదును చూసుకుని నదిలోకి తోసేయడానికి చూస్తుంది, వెంటనే కార్తీక్ వచ్చి మోనితను ఆపి పక్కకి తీసుకొస్తాడు.ఏమి చేస్తున్నావ్ మోనిత అని కార్తీక్ అరవగా నువ్వు నాకు కావాలి, నీకోసం ఏమైనా చేస్తాను.తనేదో తన భర్త కోసం పూజ చేసుకుంటుంటే నీకు వచ్చిన నష్టం ఏంటి అని అరుస్తాడు.తన భర్త కోసం చేసుకుంటుంటే నువ్వు ఎందుకు ఉంటున్నావ్…తనతో కలిసి దీపాలు వెలిగించాల్సిన అవసరం నీకు ఏంటి అంటుంది.నిన్న నువ్వు పూజ కోసం డబ్బులు ఇచ్చావ్ కదా నేను తనకి పూజలో సాయం చేశాను తప్పేంటి అంటాడు కార్తీక్.. అసలు ఏమి మాట్లాడుతున్నావ్ కార్తీక్.. నాతో కలిసి పూజ చేసి దీపం వెలిగించాలి.
వంటలక్కతో మాట్లాడను అని మాట ఇవ్వమన్న కార్తీక్ :
నేను అడిగితే కర్చీఫ్ చేతిలో పెట్టి వెళ్లిపోయావ్, భార్యని నన్ను వదిలేసి ఏ సంబంధం లేని తనతో ఏంటి అంటుంది. మోనిత ఇది గుడి కాస్త నోరు అదుపులో పెట్టుకో అంటాడు కార్తీక్..ఈరోజుతో దీనికి ముగింపు పలకాలి, వంటలక్కతో ఇక మాట్లాడను అని నాకు మాట ఇవ్వు.. లేదంటే ఇక్కడే నన్ను నేను తగలబెట్టుకుంటా అంటుంది మోనిత. ఇక దీప వచ్చి తగలబెట్టుకోవే అంటుంది.డాక్టర్ బాబు నన్ను కలుస్తారు, మాట్లాడతారు అంటుంది దీప.. అవునా సరే నేను నిన్ను తగలబెట్టతానో లేక నన్ను తగాలబెట్టుకుంటానో చూద్దాం..గుళ్ళో ఉండి చెప్తున్నా రేపు ఈ పాటికి నువ్వో.. కార్తీక్ ఎవరో ఒకరు ఉంటారు, నాకు దక్కని వాడు ఎవరికి దక్కనివ్వను అంటుంది మోనిత.
సౌర్య దగ్గర ఇంద్రుడు, చంద్రమ్మ డ్రామా:
సీన్ కట్ చేస్తే శౌర్య ఇంద్రుడు, చంద్రుడు గురించి ఆలోచిస్తు ఉంటుంది.. అయితే వాళ్ళు వచ్చి కావాలనే సౌర్య వినేలాగా డ్రామా మొదలుపెడతారు. ఆటో అమ్మేశాం కదా వాళ్ళ అమ్మానాన్నని వెతకడం ఇష్టం లేక అలా చేశాము అని జ్వాలమ్మ అనుకుంటుంది అని అబద్ధాలు చెప్తాడు. వాళ్ళ ఇద్దరి మాటలు విన్న శౌర్య బాధపడి మీ గురించి ఇక తప్పుగా అనుకొను బాబాయ్ అంటూ వాళ్లకు సోరి చెప్తుంది.
మోనిత నెక్స్ట్ ప్లాన్ ఇంత గోరంగా ఉంటుందా..?
ఇక దీప గుడిలో జరిగిన సంఘటన గురించి ఆలోచిస్తుంటే కార్తీక్ టిఫిన్ తీసుకొచ్చి తినమని ఇస్తాడు. అది మోనిత చూస్తుంది. హడావుడిగా టిఫిన్ తీసుకొస్తుంటే ఎవరి కోసమే అనుకున్నా ఈవిడ గారి ఉపవాసం తీర్చడానికా అని మనసులో అనుకుంటుంది.నేను కూడా ఉపవాసం ఉన్నా కదా నా గురించి పట్టించుకోకుండా దీప దగ్గరకు వెళ్తావా.. అసలు నీకు గతం గుర్తుకు వచ్చిందని నాకు అనుమానం…అదేంటో తేలుస్తా అని మనసులో అనుకుంటుంది.