NewsOrbit
Telugu TV Serials

Karthikadeepam serial today episode review November 16: సౌందర్య ఇచ్చిన జలక్ తో మోనిత అవాక్ అవ్వడం ఖాయం..!!

Karthikadeepam serial today episode review November 16 :బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1511వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది.ఇక ఈరోజు నవంబర్ 16న ప్రసారం కానున్న Karthika Deepam serial,1511వ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.కార్తీకదీపం సీరియల్‌లో ప్రస్తుతం ప్లాష్ బ్యాక్ స్టోరీ నడుస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం 1511 వ ఎపిసోడ్‌లోకి కార్తీకదీపం సీరియల్ అడుగుపెట్టింది.గత ఎపిసోడ్ లో కార్తీక్ ప్రవర్తనపై మోనిత డౌట్ పడుతుంది.అదే సీన్ ఈరోజు ఎపిసోడ్ లో కూడా కంటిన్యూ అవుతుంది.

Karthika deepam

కార్తీక్ మీద మోనిత అనుమానం నిజం కానుందా..?

అసలు నేను నీ భర్తనేనా కదా అని మోనితను కార్తీక్ అడుగుతాడు. ఎందుకు అలా అడుగుతున్నావ్ అంటుంది మోనిత. నీ ప్రవర్తన అలాగే ఉంది అంటాడు కార్తీక్. ఏ ఆడదైనా తన భర్త వేరే దానితో తిరిగితే ఎలా బరిస్తుంది.వాడినైనా తిడుతుంది లేకపోతే ఆ పరాయి ఆడదానినైనా జుట్టు పట్టుకొని కొడుతుంది . నేను నిన్ను ఏమీ అనలేక నా కోపాన్ని అంతా ఆ వంటలక్క మీద చూపిస్తున్నాను అంటుంది మోనిత. సరే అవన్నీ వదిలేయ్ కానీ నాకు ఆకలేస్తుంది వంట చేయమంటాడు కార్తీక్. నేను నీ భార్యనా అని అనుమాన పడ్డావు కదా ఇంకా నా వంట మాత్రం ఎందుకు? వెళ్లి ఆ వంటలక్క దగ్గరే తినండి అని కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

Karthika deepam

కార్తీక్ ప్రవర్తన పట్ల అనుమానపడ్డ దుర్గ:

సీన్ కట్ చేస్తే దుర్గ హడావుడిగా దీప దగ్గరికి వెళ్లి దీపమ్మ నువ్వు చెప్పినది నిజమే అని నాకు కూడా అనుమానంగా ఉంది అంటాడు.దేని గురించి మాట్లాడుతున్నావ్ దుర్గ అంటుంది దీప. అదే దీపమ్మ డాక్టర్ బాబుకి గతం గుర్తుకు రావటం గురించి అంటాడు. అంతా బానే ఉంది కానీ ఒకవేళ గతం గుర్తుకొస్తే ఇంకా మోనిత దగ్గర ఎందుకు ఉంటారు అనేది అర్ధం కావట్లేదు అంటాడు.అవును దుర్గ నాకు కూడా అదే అనుమానంగా ఉంది మోనిత తనని తాను కాల్చేసుకుంటాను అన్న, నేను కాల్చేస్తాను అన్నా కూడా ఏమి అనలేదు అంటుంది దీప.అంటే డాక్టర్ బాబు మోనిత ని భార్య అనుకోవడం లేదు అంటాడు దుర్గా..నిజం తెలిసినా కూడా ఇంకా మోనిత దగ్గర ఎందుకు ఉన్నాడు అనేది మనం తెలుసుకోవాలి అనుకుంటారు ఇద్దరు..

Karthika deepam

ఈ అవకాశాన్ని వదులుకోను అంటున్న సౌర్య:

సీన్ సౌర్య దగ్గర ఓపెన్ అవుతుంది.బయటికి వెళ్తున్న ఇంద్రుడితో నేను కూడా బయటకు వస్తాను అంటుంది శౌర్య. ఇక ఇంద్రుడు నేను వెళ్తుంది మన పాత ఊరికి అక్కడ షాప్ వాడు మనకి డబ్బులు ఇవ్వాలిఅవి తేవడానికి అంటాడు.ఎక్కడికైనా పర్వాలేదు బాబాయ్ మీతో నేను బయటకు వస్తా అంటుంది సౌర్య.ఆ మాటలకి కంగారుపడిన ఇంద్రుడు వద్దమ్మా అక్కడ మీ తాతయ్య వాళ్ళు చూస్తారేమో అంటాడు.అలా అయితే మీరు కూడా వాళ్ళకి తెలుసు కదా ఎలాగో ఒకలాగా తప్పించుకొని వచ్చేద్దాం పిన్నిని కూడా తీసుకొని వెళ్దాం అని ముగ్గురు కలిసి బయటకు బయలుదేరతారు.

Karthika deepam

దీప -మోనిత మాటల యుద్ధం :

సీన్ కట్ చేస్తే బయటికి వెళ్తున్న దీప దగ్గరికి మోనిత వచ్చి నీకు ఈమధ్య పొగరు బాగా ఎక్కువైంది. ఏదో పాపం అని వదిలేస్తున్నాను అంటుంది.మోనిత మాటలకూ కోపం వచ్చిన దీప…తప్పు చేశానే రాత్రే నీకు నిప్పంటించవలసింది అంటుంది.కానీ నేను నిన్ను వదలను ఈసారి డైరెక్ట్ గా నా చేతిలోనే పోతావు నువ్వు అంటుంది దీప.ఇక ఇద్దరు కూడా కాసేపు వాదన ఆడుకుంటారు. దీప అన్న మాటలకు కోపంతో మోనిత ఒక హోటల్ కి వెళ్లి విపరీతంగా తింటుంది.మోనితని వింతగా చూస్తూ ఉంటాడు పక్కనే ఉన్నా బేరర్.. ఏంటి అలా చూస్తున్నావ్ వెళ్లి బిల్లు తెమ్మంటుంది మోనిత. అక్కర్లేదు మీ బిల్లు ఆవిడ కట్టేశారు మేడం అంటాడు బేరర్. ఎవరా అని అటు వైపు తిరిగేసరికి అక్కడ సౌందర్య ఉంటుంది. ఆవిడని అక్కడ చూసిన మోనిత షాక్ అయిపోతుంది.

Karthika deepam

సౌందర్య ఎంట్రీతో మోనిత షాక్ :

ఆంటీ ఏంటి ఈ టైం లో ఇక్కడికి వచ్చారు అని మనసులో అనుకుని సౌందర్యను అదే మాట అడుగుతుంది మోనిత. అది సరేగాని నువ్వేంటి అలా పిచ్చిదాని లాగా తింటున్నావ్ అని అడుగుతుంది.కొంచెం ఆకలిగా ఉంది ఆంటీ అంటుంది మోనిత. ఆకలా? కోపమా? అని అడుగుతుంది సౌందర్య. నాకు ఎవరి మీద కోపం లేదు. కార్తీక్ లేడని బాధ అంతే అంటుంది మోనిత.సరే పద ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం అంటుంది సౌందర్య. అందుకు కంగారుపడిన మోనిత ఇల్లంతా చిరాకు చిరాకుగా ఉంది హోటల్ కి వెళ్లి మాట్లాడుకుందాం అంటుంది మోనిత.ఇంటికి అనేసరికి ఎందుకు అంత కంగారుపడుతున్నావ్ మొన్న అంకుల్ వచ్చినప్పుడు కూడా అలాగే కంగారు పడ్డావంట అని అంటుంది సౌందర్య.అదంతా కాదు పదా ఇంటికి వెళదాం అంటుంది సౌందర్య. నీ వెనుకే నేను వస్తా స్టీరింగ్ చేతిలో ఉందని ఎటుపడితే అటు తిప్పి తప్పించుకోవద్దు అని వార్నింగ్ ఇచ్చి మోనితను తీసుకోని ఇంటికి బయలుదేరుతుంది సౌందర్య.

Karthika deepam

దీపను కంట్రోల్ చేస్తున్న కార్తీక్.. కారణం ఏంటంటే..?

మరోవైపు మోనిత మాటలకి కోపంతో రగిలిపోతుంటుంది దీప. అక్కడికి వచ్చిన కార్తీక్ దీపను చూసి ఏంటి అంత కోపంగా ఉన్నావు అంటాడు.మోనిత అన్న మాటలు గురించి చెప్తుంది దీప. ఇక నా వల్ల కాదు అది అన్నా మాటలు భరించడం అంటుంది దీప.నా ప్రాణం అంటే అంతా చులకన అయిపోయిందా దానికి.ఈసారి తాడోపేడో తేల్చుకుంటానని వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది దీప. ఇంతలో కార్తీక్ దీపను ఆపి ఎందుకు గొడవలు పెద్దవి చేసుకోవడం వద్దు అంటాడు.పర్వాలేదు డాక్టర్ బాబు ఎన్నాళ్ళని ఉరుకుంటామని ఆవేశంగా అక్కడ నుంచి మోనిత దగ్గరకు వెళ్లడంతో. ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరిన్ని వివరాలు రేపటి ఎపిసోడ్ లో చూద్దాం..

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Jagadhatri April 18  2024 Episode 208: కౌశికి నీ సీఈఓ పదవికి రిజైన్ చేయమంటున్న నిషిక..

siddhu

Trinayani April 18  2024 Episode 1216: తిలోత్తమని కొట్టిన గాయత్రీ పాప..

siddhu

Brahmamudi April 18 2024 Episode 387: కావ్య ప్లాన్ తెలుసుకున్న రాజ్.. అనామిక ను గెట్ అవుట్ అన్న కళ్యాణ్.. బోల్తా పడ్డా రాహుల్ ప్లాన్

bharani jella

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

Mamagaru: నా పెళ్లి వల్ల అందరూ కలుస్తారంటే తప్పకుండా చేసుకుంటాను అంటున్న సిరి..

siddhu

Naga Panchami: మోక్ష బాధను వైదేహి అర్థం చేసుకుంటుందా లేదా.

siddhu

Kumkuma Puvvu April 17 2024 Episode 2157: యుగంధర్ ఆశ ని గుర్తుపడతాడా లేదా

siddhu

Guppedanta Manasu April 17 2024 Episode 1052: మహేంద్ర ఇచ్చిన షాకింగ్ న్యూస్ కి శైలేంద్ర ఏం ప్లాన్ చేయనున్నాడు.

siddhu

Malli Nindu Jabili April 17 2024 Episode 625: అరవింద్ మాలిని కళ్యాణం చేయించడం నాకు ఇష్టం లేదు అని చెప్పిన వసుంధర…

siddhu

Nindu Noorella Saavasam April 17 2024 Episode 213: పిల్లల బాధని విన్న అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 17 2024 Episode 340: రాధ తో గొడవ పడుతున్న రుక్మిణి…

siddhu

Karthika Deepam 2 April 17th 2024 Episode: శౌర్యకు తండ్రి ప్రేమ అందించిన కార్తీక్.. ఫుల్ పర్మిషన్స్ ఇచ్చేసిన దీప..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 17 2024 Episode 204: అభితో రానని చెప్పి ఊరికి బయలుదేరుతున్న స్వర…

siddhu

Trinayani April 17 2024 Episode 1215: తిలోత్తమ విశాలాక్షి మెడలో తాళి పట్టుకోగానే, గాయత్రి ఏం చేయనున్నది..

siddhu

Jagadhatri April 17 2024 Episode 207: నిన్ను సీఈవో చేస్తాను అంటున్నా మీనన్, కౌశికి మీద రివేంజ్ తీర్చుకో అంటున్న మీనన్..

siddhu