NewsOrbit
Telugu TV Serials

Karthikadeepam serial today episode review November 17: కార్తీక్ కు గతం గుర్తుకు వచ్చిందని దీప ఎలా తెలుసుకోనుంది..!

Karthikadeepam serial today episode review November 17 :బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1512వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది.ఇక ఈరోజు నవంబర్ 17న ప్రసారం కానున్న Karthika Deepam serial,1512వ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.కార్తీకదీపం సీరియల్‌లో ప్రస్తుతం ప్లాష్ బ్యాక్ స్టోరీ నడుస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం 1512వ ఎపిసోడ్‌లోకి కార్తీకదీపం సీరియల్ అడుగుపెట్టింది..

karthika deepam

నానమ్మ గురించి భయపడుతున్న సౌర్య:

ఈరోజు ఎపిసోడ్ లో జ్వాలను తీసుకుని ఆటోలో ఇంద్రుడు ఊళ్లోకి వస్తూ ఉంటాడు. అక్కడ గడిపిన రోజులను తలుచుకుని జ్వాల బాధపడుతూ ఉంటే నీకు అంత ఇష్టమైతే మళ్లీ ఇక్కడికే వచ్చేద్దాం జ్వాలమ్మా అంటాడు ఇంద్రుడు. వద్దు బాబాయ్, మీరే నాకు ఏదో మాయ మాటలు చెప్పి మీ దగ్గర ఉంచేసుకుంటున్నారు అని తాతయ్య వాళ్ళు అనుకుంటున్నారు.వాళ్లకి మీ మీద మరింత కోపం పెరిగిపోయి ఉంటుంది.మొన్న తాతయ్య కాబట్టి కామ్ గా వెళ్ళిపోయారు అదే నానమ్మ అయితే వేరే విధంగా ఉండేది అంటుంది శౌర్య. సరే అమ్మా ని ఇష్టం అంటాడు ఇంద్రుడు.

karthika deepam

దీప ఆవేశాన్ని కార్తీక్ అడ్డుకుంటాడా..?

సీన్ కట్ చేస్తే దీప ఆవేశంగా మోనితని నిలతీయటానికి ఆమె ఇంటికి వస్తుంది. కార్తీక్ ఎంత వద్దని చెప్పినా దీప వినిపించుకోదు. నా ప్రాణాలు అంత చులకన అయిపోయాయా? ఆ దుర్గ లేకపోతే ఈరోజు నేను చనిపోయి ఉండేదాన్ని అంటుంది. నీకు నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాను అంటాడు కార్తీక్. మీరు ఎంతకాలమని నన్ను రక్షిస్తూ ఉంటారు.అయినా ఈరోజుతో దాని ఆగడాలకు పుల్ స్టాప్ పెడతా అంటూ ఆవేశంగా ఉంటుంది దీప.ఇప్పుడు దీపను ఎలా కంట్రోల్. చేయాలి అనే ఆలోచనలో పడతాడు కార్తీక్..

karthika deepam

మోనిత వెనుకే వస్తున్న సౌందర్య:

రెస్టారెంట్ లో మోనితను కలిసిన సౌందర్య వెనుకనే కార్లో ఫాలో అవుతూ వస్తుంది. ఇక మోనిత చేసేది. లేక సౌందర్యను తిట్టుకుంటూ ఉంటుంది. ఆనంద్ ని ఇచ్చేసాను కదా ఈవిడ మళ్ళీ ఎందుకు నన్ను ఫాలో అవుతుంది. మావయ్య గారిని అంటే ఏదో మాయ చేసి పంపించేసాను. కానీ ఈవిడ అలా కాదు మేనేజ్ చేయడం చాలా కష్టం అనుకుంటుంది. మోనిత కంగారు పడడం చూసి ఇది ఎందుకు ఇంత కంగారు పడుతుంది. కార్తీక్ ఉన్నప్పుడైతే వాడిని లాగేసుకుంటామేమో అని కంగారు పడింది మరి ఇప్పుడు ఎందుకు ఇంత కంగారుపడుతుంది.ఏదో మా దగ్గర దాస్తుంది అదేంటో తెలుసుకోవాలి అని మోనిత ని సీరియస్ గా ఫాలో అవుతుంది సౌందర్య.
మరోపక్క ఐస్ క్రీమ్ షాప్ దగ్గర ఆగిన సౌర్య ఐస్ క్రీమ్ తింటూ ఉంటుంది.ఇంతలో చంద్రమ్మ త్వరగా ఇక్కడ నుంచి వెళ్దాం మళ్ళీ జ్వాలమ్మని ఎవరైనా చూస్తే ఇబ్బంది అవుతుంది అని అంటుంది.ఈ కాసేపటిలో సౌర్యను ఎవరు చూస్తారులే అంటాడు ఇంద్రుడు. సరిగ్గా అప్పుడే సోర్యను అటుగా వెళ్తున్న సౌందర్య చూసి కారాపుతుంది. ఈవిడ ఎందుకు కారాపిందని అనుకుంటుంది మోనిత.అక్కడే ఉన్న శౌర్యని కూడా మోనిత చూస్తుంది. ఆంటీ శౌర్యని చూశారా? ఇది అసలే నామీద లేనిపోనివి చెప్తుంది అని టెన్షన్ పడుతుంది. ఇదే కరెక్ట్ టైం ఈ లోపు నేను వెళ్లి ఇంట్లో కార్తీక్ వాళ్ళు లేకుండా మేనేజ్ చేయాలి అని అక్కడి నుంచి ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది మోనిత.మరోపక్క కార్తీక్ దీప, మోనితలకు జరిగే గొడవ ఎలా ఆపాలి అని అనుకుంటాడు ఉంటాడు.

karthika deepam

కార్తీక్ కు గతం గుర్తుకు వచ్చిందా లేదా అనేది దీప తెలుసుకుంటుందా..?

దీప మాత్రం డాక్టర్ బాబుకి గతం గుర్తుకు వచ్చినట్టు అనిపిస్తుంది. ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటూ కార్తీక్, మోనిత వాళ్ళ పెళ్లి ఫోటో బద్దలు కొట్టబోతుంది.ఒకవేళ కార్తీక్ అడ్డుకోకపోతే అతనికి గతం గుర్తుకు వచ్చినట్లే అనుకుంటుంది. మరోపక్క కార్తీక్ ఈ ఫోటో విరగ్గొట్టినప్పుడు ఆపకపోతే నాకు గతం గుర్తుకు వచ్చిందనుకుంటుంది అని మనసులో అనుకుంటాడు కార్తీక్.అందుకే దీప ఫోటో విసిరేస్తుంటే భార్య భర్తల ఫోటో ఎందుకు విరగొడుతున్నావ్ అంటాడు కార్తీక్.తను మీ భార్య ఏంటి డాక్టర్ బాబు నేను మీ భార్యని నీకు ఇంకా అర్థం కావడం లేదా అని అంటుంది దీప. నేనున్నా పరిస్థితుల్లో నన్ను అలా అడిగితే ఏం చెప్తాను అంటాడు కార్తీక్. నేనే మీ భార్యని అని తెలియాలంటే ఒకటి మీకు గతం గుర్తుకు రావాలి, లేకపోతే మోనిత చేత నిజం అన్నా చెప్పించాలి అని దుర్గకి ఫోన్ చేస్తుంది.

సౌర్యను చూసిన సౌందర్య:

ఇక సౌర్యను చూసిన సౌందర్య వాళ్ళ దగ్గరికి వస్తుంది .ఆమెను చూసి ముగ్గురు షాక్ అవుతారు.ఇంటికి రమ్మన్న సౌందర్యతో అమ్మానాన్నలతో వస్తాను అంటుంది శౌర్య. లేని అమ్మానాన్నలు ఎక్కడినుంచి వస్తారే..అయినా వీళ్లే నిన్ను మార్చేసారు అని ఇంద్రుడు, చంద్రమ్మను అంటుంది సౌందర్య. నానమ్మ వాళ్లని ఏమీ అనుకు,వాళ్లు కూడా అమ్మానాన్న లేరనే చెప్తున్నారు. మొన్న నా ఫంక్షన్ కూడా గ్రాండ్ గా చేశారు అంటుంది. ఫంక్షన్ కి సౌందర్యను పిలవనందుకు చాలా బాధపడుతుంది సౌందర్య.రోడ్డుమీద కాదు మీ ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం అని అక్కడ నుంచి బయలుదేరుతారు సౌందర్యవాళ్ళు.

కంగారులో మోనిత:

హడావిడిగా ఇంటికి వచ్చిన మోనితకి ఇల్లు తాళం వేసి కనిపిస్తుంది. అలాగే దీప ఇంటికి కూడా తాళం వేసి ఉండటంతో మరింత షాక్ అవుతుంది. వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడికైనా వెళ్లారేమో అనుకుంటుంది.ముందు ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి అని వెనక్కి తిరిగేసరికి దుర్గ కనిపిస్తాడు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్లారు అని దుర్గను అడిగితే అవన్నీ నాకు తెలియదు కానీ నీ కారు తాళాలు మాత్రం నా దగ్గరే ఉన్నాయని అవి తీసుకొని వెళ్ళిపోతాడు దుర్గ.చేసేది లేక మోనిత కోపంతో ఉగిపోతుంది. ఇక ఇంటికి వెళ్లిన సౌందర్య, ఫంక్షన్ కి పిలవలేదని ఇంద్రుడు వాళ్ళను మందలిస్తుంది.జరిగింది చాలు ఇంక నాతో హైదరాబాద్ పదా అంటుంది సౌందర్య. ఆ తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Mamagaru April 16 2024 Episode 187: బట్టలు పిండుతున్న గంగాధర్ ని చూసి కోప్పడుతున్న చంగయ్య, పెళ్లి నాకిష్టం లేదు అంటున్న సిరి..

siddhu

Karthika Deepam 2 April 16th 2024 Episode: దీప దెబ్బకు బెదిరిపోయిన పారిజాతం.. శౌర్య మాటలకు కన్నీరు మున్నీరు అయిన కార్తీక్..!

Saranya Koduri

Guppedanta Manasu April 16 2024 Episode 1051: మహేంద్ర చెప్పిన మాటకు అనుపమ మహేంద్రను నిలదీస్తుందా లేదా.

siddhu

Karuna Bhushan: సీరియల్ నటి కరుణా భూషణ్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 16 2024 Episode 203: ఇది పెళ్లామా విడిపోయిన గొల్లమా అంటున్న అభిషేక్. భర్త యముడా అంటున్న స్వరా..

siddhu

Naga Panchami: సీరియల్ హీరో మోజులో పడ్డ పంచమి.. ఫొటోస్ తో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Madhuranagarilo April 16 2024 Episode 339: పెళ్లి ఆలోచన మానేసి రెండో పెళ్లి చేసుకోండి  అంటున్న విరాజ్, రుక్మిణికి శ్యామ్ ఏం చెప్పనున్నాడు..

siddhu

Premi Vishwanath: కార్తీకదీపం వంటలక్క ఇంట్లో విఘ పండగ.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Brahmamudi April 16 2024 Episode 385: రాజ్ బిడ్డని తన బిడ్డ అన్న నీరజ.. రుద్రణి ప్లాన్ సక్సెస్.. రాజ్ రహస్యం కనిపెట్టిన కావ్య, శ్వేత..

bharani jella

Trinayani April 16 2024 Episode 1214: గాయత్రీ దేవి చేయించిన వజ్రాల మంగళసూత్రం వేసుకున్న విశాలాక్షి..

siddhu

Jagadhatri April 16 2024 Episode 206: మీనన్ పట్టుకోవాలనుకున్న జగదాత్రి ఎలా తప్పించుకుంటుంది..

siddhu

Nuvvu Nenu Prema April 16 2024 Episode 599: కృష్ణ మీద పార్వతి అనుమానం.. బిడ్డ కోసం తల్లి బాధ.. ప్రమాదంలో ఉన్న విక్కీ నీ పద్మావతి కాపాడుకోగలిగిందా?

bharani jella

Krishna Mukunda Murari April 16 2024 Episode 446: ముకుంద నీ ఇష్టపడుతున్న ఆదర్శ్.. కృష్ణ ని తల్లి కాకుండా చేసేందుకు ముకుంద ప్లాన్..

bharani jella

Mogalirekulu: మొగలిరేకులు సాగర్ భార్యను చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్.‌.!

Saranya Koduri