21.2 C
Hyderabad
December 8, 2022
NewsOrbit
Telugu TV Serials

Karthikadeepam serial today episode review November 7 : భార్య భర్తలు అయి ఉండి కార్తీక్, దీపలు ఇలా లేచిపోవడం ఏంటో..??

karthik deepa decission
Share

Karthikadeepam serial today episode review November 7 :బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1503వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది.ఇక ఈరోజు నవంబర్ 5 న ప్రసారం కానున్న Karthika Deepam serial,1503 వ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.కార్తీకదీపం సీరియల్‌లో ప్రస్తుతం ప్లాష్ బ్యాక్ స్టోరీ నడుస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం 1503 ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది.గత ఎపిసోడ్‌లో ఆనందరావు.. సౌర్య మాతో వచ్చేదాకా ఇక్కడి నుంచి కదిలేదే లేదు అని ఇంద్రుడితో తెగేసి చెప్తాడు.అయితే సౌర్యని బయటకి తీసుకుని వెళ్తాను అని ఆనందరావు సౌర్యను బయటకు తీసుకుని వెళ్తాడు. అయితే ఈ విషయం తెలిసి చంద్రమ్మను ఇంద్రుడు కొట్టి తిడతాడు.నేను వెళ్లి జ్వాలమ్మని తీసుకొస్తాను అని ఆటో వేసుకుని బయలుదేరతాడు.

karthik deepa decission
karthik deepa decission

సౌర్య గొంతు విని అల్లాడిపోయిన దీప :

ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఆనందరావు సౌర్యను.బయటికి తీసుకుని వెళ్తాను అని అబద్దం చెప్పి అదే కారులో సౌర్యని దిగనివ్వకుండా గట్టిగా పట్టుకుని హైదరాబాద్ తీసుకుని వెళ్లిపోతూ ఉంటాడు. దాంతో సౌర్య వదులు తాతయ్యా నేను రాను అంటూ…అమ్మానాన్నలు ఇక్కడే ఉన్నారు అంటూ ఏడుస్తుంది. అయినా సరే సౌర్య చేయి వదిలిపెట్టకుండా డ్రైవర్‌ని కారు ఆపొద్దు అని చెప్పేస్తాడు మరోవైపు ఆ కారు వెళ్లే రూట్‌లోనే దీప, కార్తీక్‌లు ఇంద్రుడు ఆటో కోసం వెతుకుతూ ఉంటారు.

sourya reaction
sourya reaction

కారు వెనుక పరుగుపెడుతున్న దీప, కార్తీక్ :

సౌర్య గొంతు విన్న దీప ఆ కారులో సౌర్య ఉంది డాక్టర్ బాబు అని అంటుంది. ఆ వెనుకే ఇంద్రుడు ఆటో కూడా వెళ్తుంది. మొత్తానికీ ఆ కారులో సౌర్య ఉందని ఇంద్రుడు కూడా ఫాలో అవుతూ ఉంటాడు. ‘దీపా.. అది ఇంద్రుడు ఆటోలానే ఉంది’ అంటాడు కార్తీక్ వెనుక నుంచి చూసి. ‘ఆటో వెనుక అమ్మానాన్న ఎక్కడున్నారు అని ఉంటుంది కదా డాక్టర్ బాబు.. అది ఇంద్రుడు ఆటో కాదు’ అంటుంది దీప నమ్మకంగా. అయితే సరే అని మౌనంగా దీపతో పాటు నడుస్తూ ఉంటాడు కార్తీక్. ఇంతలో సౌర్య.. కారులోపల నుంచి తొంగి చూస్తూ వెనుకే వస్తున్న ఆటో వైపు తిరిగి బాబాయ్.. బాబాయ్.. ప్లీజ్ కారు ఆపించు’ అంటూ అరుస్తుంది. ఆ అరుపులు దీప, కార్తీక్‌ల చెవిన పడి ఆ కారులో నిజంగానే సౌర్య ఉందని ఆ కారును ఫాలో అవుతూ ఉంటారు.ఇద్దరూ వెంటనే పరుగు అందుకుంటారు. ‘డాక్టర్ బాబు.. నా బిడ్డ డాక్టర్ బాబు.. నా సౌర్య’ అంటూ కుమిలి కుమిలి ఏడుస్తుంది దీప పరుగుపెట్టిపెట్టి ఊపిరి ఆడక ఆవేశపడిపోతూనే. ‘దీపా భయపడొద్దు.. మనం డైరెక్ట్‌గా ఇంద్రుడు ఇంటికి వెళ్దాం’ అంటాడు కార్తీక్. కార్తీక్ ఓదార్చే ప్రయత్నం చేస్తాడు.ఇక ఇంద్రుడు ఆ కారుని ఛేజ్ చేసి.. ఆటో అడ్డుపెట్టి కారుని ఆపేస్తాడు.

karthik on sourya house
karthik on sourya house

ఇంద్రుడితో వెళ్ళిపోయిన సౌర్య:

వెంటనే సౌర్య కారు దిగి ఇంద్రుడి దగ్గరకు పరుగున వెళ్లి పట్టుకుంటుంది. ‘సౌర్యా ఆగు ఏంటిది?’ అంటాడు కోపంగా ఆనందరావు. ‘ఆగండి తాతయ్యా.. ఒక్క అడుగు వేసినా నా మీద ఒట్టే’ అంటుంది కోపంగా ఏడుస్తూ సౌర్య. ‘సౌర్యా ప్లీజ్ వచ్చేయ్…’ అంటుంది హిమ ఆవేదనగా. ‘నువ్వు నోరుముయ్యవే.. అంతా నీ వల్లే.. అమ్మానాన్నల యాక్సిడెంట్‌కి కారణం నువ్వే.. నేను ఇంటికి రావడం అంటూ జరిగితే అమ్మానాన్నలు వచ్చాకే మీరు నాకు మళ్లీ కనిపించారంటే మీకు నేను దక్కను తాతయ్యా గుర్తు పెట్టుకోండి అని ఇంద్రుడుతో వెళ్ళిపోతుంది.

sourya decission
sourya decission

ఊరు వదిలి వెళ్లిపోవడానికి సౌర్య ఒప్పుకుంటుందా..?

సౌర్య ఆటో ఎక్కేయడంతో హిమ చాలా ఏడుస్తుంది.‘సౌర్యా ఆగు ప్లీజ్’ అంటున్నా ఆగకుండా ఆటోలో వెళ్లిపోతుంది సౌర్య ఇక ఆటోలో. ఏడుస్తున్న సౌర్యను ఇంద్రుడు ఓదార్చుతూ మనం ఇల్లు మారిపోదామా అని అంటాడు. నాకు తెలిసి మీ అమ్మానాన్నలు ఇక్కడ లేరేమో అనిపిస్తోందమ్మా.. మనం సంగారెడ్డిలో ఒకసారి చూశాం కదా అక్కడే ఉండి ఉంటారేమో అనిపిస్తోంది’ అంటాడు కావాలనే. ‘అవును బాబాయ్ ఆ రోజు మనం అక్కడ అమ్మకోసం వెతికాం కదా వాళ్లు అక్కడుంటే మనం ఇక్కడ వెతుకుతున్నామేమో వెళ్లిపోదాం బాబాయ్ సంగారెడ్డికి వెళ్లి అక్కడ వెతుకుదాం’ అంటుంది సౌర్య.

durga punches to mounitha
durga punches to mounitha

కార్తీక్ కు గతం గుర్తు వచ్చిందని మోనితతో చెప్పిన దుర్గ:

ఇక మోనిత.. దీప ఇంటి ముందుకు వచ్చి తలుపుకి తాళం వేసి కనిపించడంతో.. ‘ఈ టైమ్‌లో ఎక్కడికి వెళ్లారు వీళ్లు’ అనుకుంటూ ఉంటుంది. ‘నీ బాధ భరించలేక లేచిపోయారు’ అంటాడు దుర్గ.పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు’ అంటుంది మోనిత. ‘నిజమే బంగారం భార్య భర్తలు లేచిపోవడం చరిత్రలో ఎక్కడైనా ఉందా?’ అంటుంది మోనిత. ‘ఆ చరిత్ర సృష్టించిన ఘనత కూడా నీదే బంగారం కానీ ఇది నిజం ఇద్దరూ లేచిపోయారు అంటాడు.మర్యాదగా వాళ్లు ఎక్కడకి వెళ్లారో చెప్పు అని మోనిత దుర్గను నిలదీయగా.. దుర్గ మాత్రం కూల్ గా నీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా అంటూ డాక్టర్ బాబుకి గతం గుర్తొచ్చేసింది’ అంటాడు దుర్గ. ‘రేయ్ ఏం మాట్లాడుతున్నావ్ గతం గుర్తుకు రావడం ఏంటీ.? అంటుంది మోనిత. ‘వచ్చింది బంగారం.. అందుకే డాక్టర్ బాబు దీపమ్మ ఒకరికి ఒకరు తోడుగా దూరంగా పారిపోయారు అంటాడు.దుర్గ చెప్పింది అంతా నిజమే అనుకుని బిత్తరపోతుంది మోనిత.

karthik reaction on mounitha
karthik reaction on mounitha

ఇంద్రుడు ఇంటికి చేరుకున్న దీప, కార్తీక్ లు :

మరోవైపు ఇంద్రుడు ఇంటికి వెళ్తారు కార్తీక్, దీపలు తలుపుకు తాళం వేసి ఉండటంతో వాళ్లు సౌర్యని తీసుకుని వెళ్లిపోయారని భయపడతారు. పైగా ‘అమ్మానాన్న ఎక్కడున్నారు’ అనే ఆటో వెనుక ఉండే స్టిక్కర్ ఫోల్డ్ చేసి కింద పడేసి ఉండటం చూసి ఇంకా భయపడతారు ఇంతలో ఎదురింటి వ్యక్తి.. ‘వాళ్లు ఊరు వదిలి వెళ్లలేదు.ఇక్కడే ఎక్కడికో బయటికి వెళ్లారు’ అనడంతో ఊపిరి పీల్చుకుంటారు ఇద్దరూ. వచ్చేదాకా కాపలా కాద్దాం అంటాడు కార్తీక్.వద్దు డాక్టర్ బాబు ఇక్కడే కాపలా కాస్తే వస్తూ వస్తూ ఇక్కడ మనం ఉండటం చూస్తే ఇటురాకుండా అటునుంచి అటే వెళ్లిపోయే ప్రమాదం ఉంది మనం రేపు ఉదయాన్నే సడన్‌గా వద్దాం. అప్పుడు సౌర్య ఇంట్లోనే ఉంటుంది. వెంటనే పట్టుకోవచ్చు’ అంటుంది దీప.సరే అని కార్తీక్ అంటాడు. మరిన్ని వివరాలు తరవాయి భాగంలో చూద్దాం..


Share

Related posts

Devatha: ఆదిత్య, రుక్మిణి రేపటికి సూపర్ ట్విస్ట్ ఇచ్చారుగా..! మాధవ్ ను తండ్రి కాదన్న చిన్మయి..!

bharani jella

తులసి ఇష్టపడుతున్నానన్నా సామ్రాట్..! నేనే మాజీ భర్తనన్న నందు..!

bharani jella

మోనిత కారు ఎక్కిన సౌర్య…. దీప వేసే నాటకం చూసి కార్తీక్ గతం గుర్తు చేసుకుంటాడా..??

Ram