NewsOrbit
Telugu TV Serials

దీపను కొట్టబోయిన కార్తీక్… అడ్డుకున్న మోనిత…!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం. సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ 1465 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు సెప్టెంబర్ 24 న ప్రసారం కానున్న కార్తీకదీపం సీరియల్లో ఏమి. జరిగిందో ముందుగా తెలుసుకుందాం.. ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్లో ప్లాష్ బ్యాక్ స్టోరీ నడుస్తోంది.గత ఎపిసోడ్‌లో సౌందర్య, ఆనందరావులు మోనిత ఇంటికి రావడంతో మోనిత కంగారుపడుతూ కార్తీక్ ను వాళ్లకు కనిపించకుండా దాచేస్తుంది.ఈ క్రమంలోనే దీపకు కూడా మోనిత వచ్చింది మీ అత్త మామలు అనే నిజం చెబుతుంది. దీప షాక్ అయ్యి మోనిత అంతు చూస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి ఇంటికి వెళ్లిపోతుంది. ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ మరింత ఆసక్తిగా ముందుగా సాగిందనే చెప్పాలి.

దీప, మోనిత ఇద్దరు ఒక్కటే అంటున్న ఆనందరావు:

Anandaravu

ఆనందరావు, సౌందర్యలు మోనిత ఇంటి నుంచి తిరిగి వెళ్తూ వెళ్తూ కార్తీక్ ఉన్నాడనే ఆశలు అడియాశలు అయినందుకు బాధపడతారు. ఈ క్రమంలోనే ఆనందరావు మోనిత కూడా దీపలాంటిదే అంటాడు.సౌందర్య ఏంటండీ అలా అంటున్నారు అంటే అంటాడు ఏంటడి మీరు బాగానే ఉన్నారా?’ అంటుంది సౌందర్య షాక్ అవుతూ.. ‘బాగానే ఉన్నాను సౌందర్యా.. నేను ఎందుకు అలా అన్నానంటే మన కార్తీక్ మంచివాడు. అందుకే ఎంత అవమానించినా దీప ఓపిగ్గా ఎదురుచూసి కార్తీక్‌ని సొంతం చేసుకుంది. అలాగే మోనిత కూడా మనం ఎంత అవమానించినా అన్నిటిని సహించి కార్తీక్ లేకపోయినా వాడి జ్ఞ‌ాపకాల్లోనే బతుకుతోంది. వాళ్లిద్దరూ అలా ఉండడానికి మన కొడుకు మంచితనమే కారణం సౌందర్య అంటాడు.

సౌందర్య,ఆనందరావులను శివకు తల్లి తండ్రులను చేసిన మోనిత :

Siva

సీన్ కట్ చేస్తే మోనిత దగ్గరకు వచ్చిన శివ ‘మేడమ్ నిన్న వచ్చినవాళ్లు నిజంగా సార్ వాళ్ల అమ్మా నాన్నలేనా? ఇందాక మీరు వంటలక్కతో అంటుంటే విన్నాను అంటాడు. మోనిత కోపంగా చూస్తుంది ఇంతలో కార్తీక్ వచ్చి వచ్చిన వాళ్లు ఎవరు మోనితా?’ అనగానే శివా వాళ్ల అమ్మానాన్నలు కార్తీక్ అని అబద్దం చెప్పేస్తుంది. వెంటనే శివ ఆశ్చర్యంగా నోరెళ్లబెట్టి మోనిత వైపు చూస్తూ ఉంటాడు.అదేంటి శివని కలవకుండా వెళ్లారు మరి అని కార్తీక్ అంటే అదేమీ లేదు కార్తీక్ శివ వాళ్ల అమ్మానాన్నలని చూస్తే ఇంటికి వస్తాను అని చిన్నపిల్లోడిలా ఏడుస్తాడట అందుకే నన్ను కలిసేసి ఎలా ఉన్నాడో తెలుసుకుని వెళ్లిపోయారు’ అంటూ కవర్ చేసేస్తుంది.మోనిత మీద శివకు డౌట్ వస్తుంది. ఈవిడ కచ్చితంగా సార్ భార్య అయితే కాదు అని క్లారిటీ తెచ్చుకుంటాడు.

మళ్ళీ వంటలక్క అవతారం ఎత్తిన దీప.. ఎందుకంటే..?

Deepa again cooking

మరోవైపు దీప జరిగినదంతా వాళ్ల అన్నయ్యతో చెబుతుంది. ఇంతలో ఇద్దరు ఆడవాళ్లు వచ్చి ‘అమ్మా ఇక్కడ దీప అంటే మీరేనా వంటలు బాగా చేస్తావంట కదమ్మా’ అంటారు. ‘అవునండి అని దీప అనగానే నేను మన కాలనీ ప్రెసిడెంట్‌ని రేపు కాలనీ అసోషియేషన్ వార్షికోత్సవం కమ్యూనిటీ హాల్లో జరుగుతుంది. నువ్వు వంటలు చేయడానికి రావాలమ్మా.. ఆటలు పాటలు అన్నీ ఉంటాయమ్మా.. జాగ్రత్తగా చెయ్యాలి’ అంటుంది అందులో ఒకావిడ. ‘సరే’ అంటుంది దీప.

వంటలక్కను ఇక్కడ నుండి పంపించేయాలి అనుకున్న కార్తీక్ :

Karthik deepa

ఇక కార్తీక్.. దీప గురించి తీవ్రంగా ఆలోచిస్తు ఉంటాడు. అప్పుడే మోనిత వచ్చి ఎక్కువగా ఆలోంచించకు కార్తీక్ ఆవిడ మారదు మనం ఈ ఊరు వదిలి వెళ్లిపోదాం అంటుంది. అలా ఎందుకు ఏదో తప్పు చేసిన వాళ్ళకి మల్లె మనం వెళ్లిపోవడం వెళ్తే అ వంటలక్కే వెళ్ళిపోవాలి అంటాడు. కాసేపటికి దీప దగ్గరకు వెళ్తాడు కార్తీక్. దీపకు. కొంత డబ్బులు ఇచ్చి ఇవి తీసుకుని ఇక్కడ నుండి వెళ్లిపొమ్మని అంటాడు.మీరు నా జోలికి రావద్దు.నాకు బాగా గుర్తుండేది ఒక్కటే అదేంటంటే మోనిత నా భార్య, ఆనంద్ నా కొడుకు అంటూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అంతా చాటుగా మోనిత విని మురిసిపోతుంది.

దీప మీద చేయి ఎత్తిన కార్తీక్ :

Karthik serious about deepa

కార్తీక్ వెళ్లిపోతు ఉండగా దీప
ఒక్కనిమిషం ఆగండి అంటుంది కార్తీక్ ఆగుతాడు. ఈ డబ్బు అంటూ ఏదో చెప్పబోతుంది దీప.
అ డబ్బులు నీకె..తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు’అంటాడు కార్తీక్ కోపంగా. ‘అయ్యో నా మొగుడు నాకు ఇచ్చిన డబ్బులు మీద నాకు హక్కు ఉంటుంది. నేనెందుకు తిరిగి ఇస్తాను.నా దగ్గరే ఉంచుకుని మీకు నచ్చే చీరల కొనుక్కుంటాను.. మీకు ఇష్టమైన నగలు పెట్టుకుంటాను అంటూ దీప నవ్వుతుంటే కార్తీక్‌కి చాలా కోపం వచ్చి వంటలక్కా అని దీపను కొట్టడానికి చేయి పైకి లేపుతాడు వెంటనే మోనిత వచ్చి అడ్డుపడుతుంది. ఆవిడ మారదు నువ్వు పదా అంటూ కార్తీక్‌ని తీసుకుని వెళ్లిపోతుంది. పాపం దీప బాధగా అక్కడే నిలబడిపోతుంది. మరుసటి రోజు దీప దేవుడి ముందు నిలబడి ఈ రోజు నేను పెద్ద సాహసం చేయబోతున్నాను ఇదైనా ఫలించాలి దేవుడా అంటూ దేవుడికి దణ్ణం పెట్టుకుంటుంది. మరి దీప ఏమి చేయనుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడాలిసిందే.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Guppedanta Manasu April 24 2024 Episode 1058: వసుధార మను కి నిజం చెబుతుందా లేదా.

siddhu

Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి బాటలో నడుస్తున్న వసుధార.‌.. గుప్పెడంత మనసుకు గుడ్ బాయ్..!

Saranya Koduri

Maheshwari: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ ముద్దుగుమ్మ మహేశ్వరి.. హల్చల్ చేస్తున్న ఫొటోస్..!

Saranya Koduri

Karthika Deepam 2 April 24 2024: దీప ని ఆపిన సుమిత్ర… నరసింహని ఘోరంగా ఛీ కొట్టిన శోభ, కార్తీక్.. అంతు చూస్తా అంటూ సవాల్..!

Saranya Koduri

Jagadhatri April 24 2024 Episode 213: డాక్యుమెంట్ కొట్టేసి ఎంగేజ్మెంట్ ని ఆపాలనుకున్న నిషిక,  డాక్యుమెంట్ ఇస్తానంటున్న కౌశికి..

siddhu

Brahmamudi April 24 2024 Episode 392: గుడిలో అనామిక రచ్చ.. అనామిక మీద ఫైరైన కనకం.. రుద్రాణి ప్లాన్ ను తిప్పి కొట్టాలనుకున్న అప్పు..

bharani jella

 Trinayani April 24 2024 Episode 1221: గాయత్రి జాడ తెలుసుకోవాలనుకున్న తిలోత్తమ, అద్దంలో కనపడిన హాసిని..

siddhu

Naga Panchami: గుడిలో ఉన్న పంచమి మోక్షకు కనిపిస్తుందా లేదా.

siddhu

Kumkuma Puvvu: ట్రస్ట్ మెంబర్ పంపించిన ఫోటోలని శాంభవి చూస్తుందా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 24 2024 Episode 606: అక్క ఆచూకీ కోసం విక్కీ ఆరాటం.. అరవింద,కృష్ణ దగ్గర ఉందని తెలుసుకున్న దివ్య.. విక్కీ పద్మావతిల ఆనందం..

bharani jella