బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.గత ఎపిసోడ్ లో దీపను ఊరు వదిలి వెళ్లిపొమ్మని కార్తీక్ కొంతడబ్బులు ఇస్తాడు. అలానే దీప కూడా డాక్టర్ బాబుకు గతం గుర్తు రావాలని చివరి ప్రయత్నం చేస్తున్నా నన్ను ఆశీర్వదించండి అంటూ దేవుళ్లను కోరుకోవడం జరుగుతుంది.. ఇదే క్రమంలో ఈరోజు సెప్టెంబర్ 26వ తేదీన ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరుగుతుందో తెలుసుకుందాం.
కాలనీ వాళ్లకు దీప చెప్పిన నాటకం నచ్చుతుందా..?
దీప, కాలనీ అసోసియేషన్ వార్షికోత్సవం అని వంట చేయడానికి ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు వాళ్లు అందరూ ఏ నాటకం వేద్దాము అని ఆలోచించుకుంటూ ఉంటారు. అన్ని నాటకాలు చాలా సార్లు వేసాము.. ఈసారి కొత్తగా ఏవైనా నాటకం ఉంటే బాగుండు అని అనేలోగ దీప, నా దగ్గర ఒక కథ ఉన్నదమ్మా వింటారా అని కథ చెప్తుంది.అప్పుడు ఆ కథ విన్నా అందరూ ఏడుస్తూ ఈ కథ చేద్దాం అమ్మా అంటారు.అలాగే ఆ ముఖ్య పాత్ర నువ్వే చెయ్యమ్మా, నిన్ను తప్ప ఇంకా ఎవర్ని అందులో ఊహించుకోలేము అని అంటారు. అలాగేనండి వంట చేసి వచ్చి రిహార్సల్స్ చేస్తాను అని అంటుంది దీప.
డాక్టర్ ను కలిసిన మోనిత.. ఎందుకంటే..?
సీన్ కట్ చేస్తే మోనిత ఒక డాక్టర్ దగ్గరికి వెళ్లి, నా దగ్గర ఒక గతం మర్చిపోయిన పేషంట్ ఉన్నాడు. అతనికి తన భార్య తన పెళ్లైన సంఘటనలు అన్నీ గుర్తు చేయడానికి ప్రయత్నిస్తున్నది. తనకి గతం గుర్తొచ్చే అవకాశం ఉందా అని వెళ్లి అడుగుతుంది. అప్పుడు ఆ డాక్టర్, అవకాశాలు తక్కువ ఉన్నాయి కానీ ప్రయత్నం చేయడం మంచిదే అంటాడు.గతం గుర్తు చేయడానికి వాళ్ళ భార్యను గతంలో జరిగిన సంఘటనలు గుర్తు చేయడానికి ప్రయత్నించమనండి అని అంటాడు ఆ డాక్టర్. అప్పుడు మోనిత మనసులో అలా జరగకుండా ఇక నుంచి ఎక్కువ జాగ్రత్త తీసుకుంటాను అనుకుంటుంది.
సౌందర్యను చూసి పారిపోయిన సౌర్య:
ఆ తర్వాత సీన్లో హిమ ,శౌర్యలు షెడ్ దగ్గర కూర్చొని ఉంటారు. అప్పుడు సౌర్య, హిమా నీ వెళ్ళిపోమని ఎంత చెప్పినా సరే హిమ వెళ్ళను అని అంటుంది. ఇంతలో సౌందర్య అటువైపు వచ్చి పిల్లలు కోసం వెతుకుతూ ఫోటో చూపిస్తూ,అందర్నీ అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఒకరు పిల్లలు అటువైపు ఉన్నారు అని చెప్పగా అక్కడికి వెళుతుంది సౌందర్య. అప్పటికే శౌర్య, సౌందర్యన్ని చూసి ఇప్పుడే వస్తాను అని వెళ్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు అని హిమా అడగగా, వాష్ రూమ్ కి వెళ్తున్నాను ఇప్పుడే వస్తాను అని వెళ్తుంది. ఇంతలో సౌందర్య హిమని చూస్తుంది. వెళ్లి హద్దుకుంటుంది నానమ్మ శౌర్య కూడా వస్తుంది అని అనగా,వాళ్ళు చాలా సేపు ఎదురుచూస్తారు. అప్పుడు సౌందర్య, అది నన్ను చూసినట్టు ఉన్నది అందుకే వెళ్ళిపోయింది అంటుంది.అప్పుడు హిమ ఏడుస్తూ మళ్ళీ శౌర్యని నేను వదులుకున్నాను అని బాధపడుతూ ఉంటుంది.
నాటకానికి వస్తే తన భర్త గురించి చెప్తా అంటున్న దీప:
మళ్ళీ సీన్ కార్తీక్ దగ్గర ఓపెన్ అవుతుంది.దీప,కార్తీక్ ఇంటికి వెళ్ళి, నాకో సహాయం చేయాలి అని అని అడుగుతుంది. ఏంటో చెప్పు అని కార్తీక్ అంటే దీప,మన కాలనీ అసోసియేషన్ వార్షికోత్సవం అని నేను ఒక నాటకం వేస్తున్నాను డాక్టర్ బాబు మీరు అది చూడాలి అంటుంది. అవునా నువ్వు ఇంట్లో వేసేవన్ని నాటకాలే కదా కొత్తగా అక్కడ ఎందుకు వేయడం అని అంటాడు కార్తీక్. అప్పుడు దీప, అక్కడికి వస్తే నా భర్త గురించి మీకు చెప్తాను అని అనగా కార్తీక్ నిజంగా చెప్తావా అని అంటాడు.ఇక శివతో, ఒకవేళ మీ మేడం వస్తే నేను నాటకాలు చూడడానికి వెళ్లాను అని చెప్పమని చెప్తాడు కార్తీక్.
మోనిత కారులో సౌర్య:
ఆ తర్వాత సీన్లో సౌర్య, సౌందర్య దగ్గర నుంచి పారిపోవడానికి అని ఒక కారు డిక్కీలో వెళ్లి కూర్చుంటుంది. ఆ కారు ఎవరిదో కాదు మోనితదే.డిక్కీలో సౌర్యను చూడలేని మోనిత కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోతుంది.ఇక్కడే ఉంటే కార్తీక్ గతం గుర్తొచ్చే అవకాశాలు చాలా ఎక్కువే ఉన్నాయి కనుక వీలైనంత త్వరగా కార్తిక్ ని అమెరికాకి తీసుకువెళ్లాలి అని అనుకుంటుంది.డిక్కీలో ఉన్న శౌర్య మనసులో ఇలా చేస్తున్నందుకు నన్ను క్షమించండి నానమ్మ అని అనుకుంటుంది.
నాటకం చూస్తే కార్తీక్ కు గతం గుర్తుకు వస్తుందా.?
ఆ తర్వాత సీన్లో దీప వాళ్ళ అన్నయ్య అక్కడికి వస్తాడు. ఎందుకని ఇంత లేట్ అయింది అని దీప అనగా, ఈరోజు పేషెంట్లు ఎక్కువ ఉన్నారమ్మ అని అంటాడు. ఇంతలో కార్తీక్ అక్కడికి వచ్చి, నీకు తెలుసు కదా నాకు ఈ నాటకాలు అన్న, నాటకాలు చేసే వాళ్ళ అన్న నచ్చరు. నీ భర్త ఎవరో చెప్తే నేను వెళ్లిపోతాను అంటాడు. ఇంతకు ఈయన ఎవరు అంటే చెప్పాను కదా డాక్టర్ బాబు ఈయన మా అన్నయ్య, గుర్తులేదా అని అంటుంది దీప.నేను మర్చిపోతాను అని నీకు తెలుసు కదా! అయినా మీ అన్నయ్య అయినప్పుడు నీ భర్త గురించి తనకు తెలుసు కదా మీరే చెప్పండి అని అంటాడు కార్తీక్. అప్పుడు దీప వాళ్ళ అన్నయ్య, అది చెప్పడం కన్నా చూస్తేనే బాగుంటుంది కొంచెం సేపు ఓపిక తెచ్చుకోండి అని అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.