23.2 C
Hyderabad
December 6, 2022
NewsOrbit
Telugu TV Serials

మోనిత ఉచ్చులో చిక్కుకున్న దీప…ఇంకా కార్తీక్ దీపకు శాశ్వతంగా దూరం అయినట్లేనా..?

Share

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1458 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది.ఇక ఈరోజు సెప్టెంబర్ 15 న ప్రసారం కానున్న కార్తీకదీపం సీరియల్లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.. ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్లో ప్లాష్ బ్యాక్ స్టోరీ నడుస్తోంది. గత ఎపిసోడ్ లో మోనితకు జ్వరం రావడంతో దీప వాళ్ల అన్నయ్యను డాక్టర్ అని చెప్పి మోనితను దగ్గరకు పంపిస్తుంది. అయితే విషయం పసిగట్టిన మోనిత ఇదంతా ఆ ఆ వంటలక్క ప్లాన్ అంటూ కార్తీక్‌కి దీప మీద అనుమానం కలిగేలా చేసింది మోనిత. దాంతో నిజమేనని నమ్మేస్తాడు కార్తీక్. ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా ముందుకు సాగిందనే చెప్పాలి.మోనిత మాటలను నమ్మిన కార్తీక్ వంటలక్క ఇంటికి ఆవేశంగా వెళ్తాడు. వంటలక్కా రా బయటికి అంటూ పిలుస్తాడు. దీప బయటికి రావడంతో ఎందుకు ఇలా చేశావ్ వంటలక్కా? మోనితకి వచ్చింది చిన్న జ్వరం అయితే మీ అన్నయ్యతో ఎందుకు వంటకు దూరంగా ఉండాలని చెప్పించావ్’ అంటూ నిలదీస్తాడు. కార్తీక్ మాటలకూ దీప మౌనంగా నిలబడిపోతుంది.. కార్తీక్ ఎమన్నా అన్నా నువ్వేమి మాట్లాడకు అన్న దీప వాళ్ళ అన్నయ్య మాటలు గుర్తు వచ్చి దీప మౌనంగానే ఉండిపోతుంది.

మోనిత మాటలు విని దీపను తిట్టిన కార్తీక్ :మోనిత నువ్వు మంచిదానివి కాదు అని చెబుతూనే ఉంది. కానీ నేనే నమ్మలేదు. ఎందుకు ఇలా చేస్తున్నావ్.నేను నీ భార్యని అన్నావ్.. పొరబాటు పడ్డావ్‌లే అనుకున్నా.గుడిలో ప్రమాణం చేశావని నిన్ను నమ్మాను.కానీ ఇప్పుడు చేసింది చూస్తుంటే టిఫిన్‌లో ఏదో కలిపావని నమ్మకం కలుగుతోంది. అంటే మోనిత చెప్పేవన్నీ నిజమేనన్న మాట అంటాడు కార్తీక్ కోపంగా. దీప కళ్లనిండా నీళ్లతో నేనేమి కలపలేదు డాక్టర్ బాబు అని అన్నా కార్తీక్ అదేం పట్టించుకోడు.అయినా నా కర్మేంటో అన్ని విషయాలు మరిచిపోతాను.నీ విషయాలు మాత్రం గుర్తుంటాయి. దానికి మోనిత ఏం అంటుందో తెలుసా? మీకు కూడా వంటలక్క మీద ఏదో ఉంది అంటోంది. నాకు అంటే మెమొరీ లాస్ మరి నీకు ఏమైంది.అందుకే మళ్లీ చెబుతున్నాను.. మోనితే నా భార్య. మోనితకి తప్ప మరో స్త్రీకి నా మనసులో స్థానం లేదు అని చెప్పేసి అక్కడ నుండి కార్తీక్ కోపంగా వెళ్ళిపోతాడు.పాపం కార్తీక్ అన్నా మాటలకూ దీప ఏడుస్తూనే ఉంటుంది.

మోనిత మరొక ప్లాన్ :


మరో పక్క మోనిత తన కొడుకు ఆనంద్ గురించి ఆలోచిస్తుంది.ఆనంద్ ను తీసుకుని వస్తే కార్తీక్ వాడి ధ్యాసలోనే ఉంటాడు అనుకుంటుంది.కానీ నేను ఆనంద్‌ని తీసుకుని రావడానికి వెళ్తే ఈ లోపు దీప కార్తీక్‌కి మాయమాటలు చెప్పి తీసుకుని వెళ్ళిపోయినా పోతుంది అని అనుకుంటుంది.పోనీ ఆనంద్‌ని తీసుకుని రావడానికి కార్తీక్‌ని నాతో పాటు తీసుకుని వెళ్దామంటే అక్కడ వాళ్ళు కార్తీక్ ను చూస్తే గుర్తుపడతారు అది ఇంకా డేంజర్.అలా కాకుండా ఆనంద్ ను ఇక్కడికి తీసుకుని రమ్మనమని చెప్పి లక్ష్మణ్‌ కి చెప్తే వాడు ఊరు ఊరంతా చెప్తాడు.మరి ఏం చేద్దాం? అని ఆలోచిస్తుంది.దీనికి ఒకే ఒక్క దారి ఉంది. నేను ఆనంద్‌కోసం వెళ్లినప్పుడు ఇక్కడ దీప ఉండకుండా చెయ్యాలి.ఈ రెండు రోజులు దీపని ఎక్కడికైనా పంపించాలి. కానీ దీపని ఎక్కడికన్నా ఎలా పంపించాలి అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటుంది.

చంద్రమ్మ, సౌర్యల ప్రేమానుబంధం :


సీన్ కట్ చేస్తే వారణాసితో చంద్రమ్మ నువ్వు వెళ్లిపో వారణాసి క్యారేజ్ ఆటోలో పెట్టేశాను.సౌర్య లేచేలోపు వెళ్లు అంటుంది. తీరా చూస్తే సౌర్యే ఆటో దగ్గర ఉంటుంది. ఏంటి పిన్నీ నన్ను పోనీకుండా ప్లాన్ చేస్తున్నావ్’ అంటుంది సౌర్య.నీకు దగ్గు,జలుబు కదమ్మ ఇప్పుడు బయట తిరిగితే జ్వరం వచ్చేస్తుంది అందుకే బయటికి వెళ్లకమ్మా’ అంటుంది చంద్రమ్మ. అప్పుడే వచ్చిన ఇంద్రుడు కూడా అదే మాట అంటాడు. అయితే సౌర్య మాత్రం ఓ గంట వెళ్లి వచ్చేస్తాం ఆ తర్వాత బాబాయ్‌ ఆటో తీసుకుని వెళ్తాడు కదా పిన్నీ అంటుంది. మా అమ్మా నాన్న వాళ్లు దొరికితే మిమ్మల్ని వదిలేసి వెళ్తానని భయపడుతున్నారా పిన్ని. మాకు హైదరాబాద్‌లో పెద్ద ఇల్లు ఉంది. అందులోనే ఎంచక్కా అందరం కలిసి ఉండొచ్చు అంటుంది సౌర్య.వెంటనే చంద్రమ్మ సౌర్యని గుండెలకు ప్రేమగా హత్తుకుంటుంది.

ఆనంద్ ను ఇంటికి తీసుకువద్దాం తాతయ్య అంటున్న హిమ :


మళ్ళీ సీన్ హిమ దగ్గర ఓపెన్ అవుతుంది.హిమ తాతయ్య ఆనందరావుతో ఆనంద్ గురించి చెప్పి మానం వాడిని ఇక్కడికి తెచ్చేసుకుందాం తాతయ్యా అంటే ఆనందరావు మనసులో ఇప్పుడు వాడ్ని తెచ్చుకుంటే ఏమని చెప్పాలి. మా పెద్దోడు కొడుకు అని చెబితే అదో అపకీర్తి అవుతుంది. కార్తీక్‌కి ఇద్దరూ ఆడపిల్లలే అని అందరికీ తెలుసు. వీడు ఎవడు అంటే మోనిత గురించి చెప్పాల్సి వస్తోంది. ఇప్పుడు వాడ్ని తెచ్చుకోవడం ఓ సమస్యే కదా అనుకుంటాడు.. ఏంటి తాతయ్య మాట్లాడవు అని హిమ అంటే చూద్దాంలే అమ్మా..!తెచ్చుకుందాం అంటూ హిమకు సర్దిచెబుతాడు. హిమ హ్యాపీ ఫీల్ అవుతుంది.

మోనిత ఉచ్చులో దీప :


సీన్ కట్ చేస్తే మోనిత కోసం ఇద్దరూ ఆడవారు వస్తారు. మోనితను కలిసి మేడమ్ మీ భర్త గతం మరిచిపోయారట కదా అని అడుగుతారు. సరిగ్గా అప్పుడే అటుగా దీప వెళ్తూ వాళ్ళ మాటలను చాటుగా వింటుంది. హ అవును.. అయితే ఏంటీ?’ అంటుంది మోనిత ఆ ఆడవాళ్లతో. అది కాదు మేడమ్ మేము ప్రకృతి వైద్యశాల నుంచి వచ్చాం ఇక్కడికి 150 కిలోమీటర్ల దూరంలో మా ఆశ్రమం ఉంది. మీ అయనకు ఒక వారం రోజులు ట్రీట్మెంట్ ఇస్తే గతం గుర్తొచ్చేస్తుంది’ అంటారు. మోనిత మాత్రం అవేం అవసరం లేదు. డబ్బులు గుంజడానికి ఇవన్నీ చేస్తుంటారని నాకు తెలుసు అని వాళ్ళని తిట్టి పంపిస్తుంది. మోనిత మాట్లాడిన మాటలను దీప చాటుగా వింటుంది.. బహుశా దీపను ఊళ్ళో. నుంచి పంపించడానికి ఇదంతా మోనిత వేస్తున్న ప్లాన్ లాగా ఉంది. మరి ఏమి జరిగిద్దో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం.


Share

Related posts

దేవత సీరియల్ టిఆర్పి రేటింగ్.. మళ్లీ అదే స్థానంలో కంటిన్యూ..! 

bharani jella

Guppedantha Manasu November 19Today Episode: జగతి రాకతో ఆనందంలో వసు.. కోపంలో దేవయాని చేయనున్న మరొక దారుణం..!

Ram

Guppedantha Manasu,25 October,590 Episode: మహేంద్ర, జగతిలు ఎక్కడున్నారో రిషి తెలుసుకుంటాడా..?? ఇక దేవయాని పని అయిపోయినట్లేనా..??

Ram